veda@dattapeetham.com

SGS Panchangam

  • Home
  • About
  • Muhurtam
  • Shobhakrut
  • Useful
  • Contact

1. పంచాంగ ఫలితము

• కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహమ్

గంగాస్నాన విశేషపుణ్య ఫలదం గోదాన తుల్యం నృణామ్।

ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సన్తాన సంపత్ప్రదమ్

నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్।।

• తిథిర్వారఞ్చ నక్షత్రం యోగః కరణ మేవ చ।

పంచాంగమితి విఖ్యాతం కర్మణామిహ సాధనమ్।।

• తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనమ్।

నక్షత్రాద్ధరతే పాపం యోగా ద్రోగ నివారణమ్।।

• కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలం త్విదమ్।।

కాలవిత్ కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్।।

2. నవగ్రహ ప్రార్థనమ్

• నమ స్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ।

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః।।

• బాలార్కప్రభమిన్ద్రనీల జటిలం భస్మాంగ రాగోజ్జ్వలమ్।

శాన్తం నాద విలీన చిత్తపవనం శార్దూలచర్మాంబరమ్।

బ్రహ్మజ్ఞై స్సనకాదిభిః పరివృతం సిద్ధై స్సమారాధితం

దత్తాత్రేయ ముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః।।

• గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం

విబుధ నివహ సేవ్యం యోగ మార్గాధిరూఢమ్।

శరణముపగతానా మార్తి సంఘాద్రి వజ్రం

మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి।

జయగురుదత్త శ్రీ గురుదత్త

3. పీఠిక

కాలాయ తస్మై నమః

అనంతమైన కాలప్రవాహంలో పయనిస్తున్న మానవులు తమ వ్యవహార సౌకర్యానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలలో కాలగణనం అతి ముఖ్యమైనది. వాస్తవంగా చెప్పాలంటే, ఆద్యంతములు లేని పరమాత్మ లక్షణమైన ఈ కాలమును లెక్కించడం అసాధ్యమే. అయినప్పటికీ కళ్ళకు కనబడుతున్న సూర్యచంద్రాది గ్రహగోళములను పరిశీలిస్తూ, వాటి ఆధారంగా ఇటువంటి వ్యవస్థను ఏర్పరచుకున్నారు. భారతీయుల కాలగణనానికి వేద, పురాణ వాఙ్మయమే ఆధారం.

ఈ కాలగణనంలో బ్రహ్మదేవుడి పదవీకాలము అతి పెద్ద మానకము(యూనిట్) కాగా, క్షణకాలము (అతిచిన్నది). దైనందిన వ్యవహారాలకు ఉపకరించేట్లుగా క్షణములు, నిమిషాలు, గంటలు లేక (ఘడియలు, విఘడియలు), లగ్నములు, యామములు (ఝాములు), పగలు, రాత్రి, దినములనే సామాన్య విభాగములు ఏర్పడినాయి. ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక దినము అని లెక్కించి, దీనికి సరిపోయేట్లుగా, తిథి, వారము, నక్షత్రము, యోగము మరియు కరణము అనే మానకాలను సూర్య, చంద్ర, భూమి గతులను ఆధారంగా చేసుకుని ఋషి సంప్రదాయం మనకు బోధిస్తున్నది. రోజువారీ కాలమును లెక్కించేందుకు, అతిముఖ్యమైన అంశములు ఈ ఐదనీ, వీటి సమూహమును పంచాంగము అంటారని కూడ తెలుసుకోవాలి.

భారతీయులకు తరతరాలగా సంక్రమిస్తున్న ఈ అపూర్వ సంప్రదాయాన్ని పరిరక్షిస్తున్న ధార్మిక వ్యవస్థకు ప్రస్తుతకాలంలో దేవాలయాలు, వేదపాఠశాలలూ, విద్వాంసుల బృందములు, మఠములు, పీఠములు ఆలవాలంగా నెలకొన్నాయి. ఆయా ప్రాంతాలలోని భక్తులకు, శిష్యులకు అనువుగా ఉండేందుకూ, మరియూ వారి వారి సంప్రదాయాలలోని ముఖ్యమైన పండుగలను పర్వదినాలను గుర్తు చేసేందుకై, ప్రత్యేక పంచాంగాలను ముద్రించడం కూడ ఆనవాయితీగా ఉన్నది.

అవధూత దత్తపీఠంలో నిర్వహించే పర్వదినాలతో పాటుగా, ప్రతి దినము గ్రహస్థితులను గుర్తించి లగ్నముల ప్రాబల్య దౌర్బల్యమును పరిశీలించేందుకు రాశిచక్రములను, ధార్మిక జీవనస్రవంతిలోని ప్రముఖమైన పండుగలనూ భక్తులకు సులభంగా అందించేందుకై జగద్గురుపరమపూజ్య శ్రీ శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యాశీస్సులతో ఈ పంచాంగము ముద్రించబడినది.

సూర్యసిద్ధాంతమును అనుసరించి, చంద్రగతిపై ప్రధానంగా ఆధారపడిన ఈ చాంద్రమాన పంచాంగములోని సమయాలన్నీ భారతీయ కాలమానము (I.S.T లేక ఇండియన్ స్టాండర్డ్ టైమ్) పై ఆధారపడి ఉన్నాయి.

గంగానదీ తీరంలో 82.5 రేఖాంశము పైన వింధ్యవాసిని క్షేత్రమునకు (మీర్జాపూర్) సరిపడేట్లుగా ఉన్న భారతీయ కాలమానానికి, స్థానిక కాలానికి ఉన్న భేదమును పాఠకులు గుర్తించాలి. భారతీయ కాలమాన రేఖాంశకు పశ్చిమంగా ఉన్నవారు, అన్ని నిమిషాలను పంచాంగ సమయానికి కలుపుకోవాలి.అలాగే రేఖాంశానికి తూర్పుగా ఉన్నవారు అన్ని నిమిషాలు తీసివేయాలి.

ఆధునిక వైజ్ఞానిక పరికరాల సహాయంతో దేశాంతర సంస్కారము చేసేందుకై ఈ పట్టిక ముద్రించబడినది. (ఉదాహరణకు - దశమి 10గంటల 20 నిముషాల వరకు అంటే, మైసూరు ప్రాంతం వారు 25 నిమిషాలు కలుపుకోవాలి. అలాగే విశాఖపట్టణమువారు 2 నిమిషాలు తీసివేయాలి). అయితే, సూర్యోదయ సూర్యాస్తమయాలు లగ్నాంతకాలాలు మటుకు మైసూరు నగరానికి సరిపోయేట్లుగా మార్చబడినాయి. కాబట్టి, సూర్యోదయ సూర్యాస్తమానాలను ఏ ఊరిలో ఉండేవారు అక్కడి దేశకాలాలను అనుసరించాలి.

తిథి, వార, నక్షత్ర, యోగ కరణములకు, సూచించిన సమయాలు సమాప్తి సమయానికి సంకేతములు. రాహుకాలము సాధారణంగా ఈ పంచాంగముతో పాటుగా, అన్ని పంచాంగాలలో సూచించే రాహుకాలము, పగలు, రాత్రి సమానంగా ఉన్న కొద్ది రోజులకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రతిదినము సూర్యోదయ సూర్యాస్తమానముయొక్క మధ్య సమయాన్ని 7 భాగములు చేసుకుంటేనే, ఆనాటి రాహుకాలం తెలుస్తుంది.ఈ పంచాంగములో సంవత్సర ఫలితాలతో పాటుగా, నిత్యం అవసరమయ్యే ధర్మశాస్త్ర విషయాలు, జ్యౌతిష అంశాలు యథోచితంగా చేర్చబడ్డాయి.

తరతరాలుగా పంచాంగ గణితం ద్వారా ప్రజా సేవ చేస్తున్న, రేలంగి గ్రామం తంగిరాల వంశజుడైన బ్రహ్మ శ్రీకృష్ణపూర్ణ ప్రసాద సిద్ధాంతి గారు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరుమల క్షేత్రానికి పంచాంగగణన సేవను అందిస్తూ, దానితోపాటుగా దత్త స్వామి నెలకొన్న అవధూత దత్తపీఠానికి కూడా సేవ చేసే మహాభాగ్యానికి నోచుకున్న మహనీయుడు.

వీరి గణితంతో పాటుగా, పంచాంగ విషయములను ధార్మికులకు సులభంగా అందించేందుకు శ్రీ గణపతి సచ్చిదానంద వేదనిధి అకాడెమీ బృందంవారు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామి (బాలస్వామి) వారి ప్రోత్సాహముతో చక్కగా కృషి చేశారు. అనతి కాలంలో సుందరంగా ముద్రించిన ఘనత బెంగళూరులోని మా ప్రింట్స్ వారికి అందినది. ఈ పంచాంగమును భక్తులకు అందించడంలో మంచి సేవ చేసిన వీరందరితో పాటుగా, పంచాంగవిషయములను పఠించి, ధార్మిక కర్మాచరణ చేసే సద్భక్తులందరికీ శ్రీ దత్తాత్రేయస్వామి వారి అనుగ్రహముతో పాటుగా సద్గురువులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని ప్రార్థిస్తున్నాము.

ఫాల్గున కృష్ణ ఏకాదశి దత్తపీఠ కార్యవర్గ పక్షాన

16-03-2023 Dr.వంశీకృష్ణ ఘనపాఠీ

ఈ ప్రచురణకు సేవ చేసిన సభ్యులు

కడియాల సూర్యనారాయణ మరియు నండూరి లవకుమార్

యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్।

యత్తపస్యామి వార్ష్ణేయ తత్కరోమి త్వదర్పణమ్।।

సర్వేచ సుఖిన స్సన్తు సర్వే సన్తు నిరామయాః।

సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్।।

దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమామ్।

సచ్చిదానంద పర్యన్తాం వన్దే గురు పరంపరామ్।।

4. శ్రీ దత్త స్తవము

శ్రీ గణేశాయ నమః। శ్రీసరస్వత్యై నమః।

శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతీ శ్రీగురు దత్తాత్రేయాయ నమః।।

1 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలమ్।

ప్రపన్నార్తి హరం వన్దే స్మర్తృగామీ సనోవతు ।।

2 దీనబన్ధుం కృపాసిన్ధుం సర్వకారణ కారణమ్।

సర్వరక్షా కరం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

3 శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణమ్।

నారాయణం విభుం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

4 సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్।

సర్వక్లేశ హరం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

5 బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనమ్।

భక్తాభీష్ట ప్రదం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

6 శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః।

తాపప్రశమనం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

7 సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణమ్।

విపదుద్ధరణం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

8 జన్మసంసార బంధఘ్నం స్వరూపానన్ద దాయకమ్।

నిశ్రేయస పదం వన్దే స్మర్తృగామీ సనోవతు।।

9 జయలాభయశః కామ దాతు ర్దత్తస్య యస్స్తవమ్।

భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ స కృతీ భవేత్।।

(ఈ స్తవాన్ని నిత్యం పారాయణ చేసినట్లైతే జయము, లాభము, కీర్తిప్రతిష్ఠలు కలుగుతాయి.)

30. విశ్వవిఖ్యాతమైన దత్తపీఠములోని ముఖ్యస్థానములు

1. విశ్వప్రార్థనా మందిరము - (దత్తపీఠ మూలస్థానం, మహా శక్తిమంతమైన కాలాగ్నిశమన దత్తాత్రేయ ఆలయం, నిత్య హోమశాల, సచ్చిదానందేశ్వర, లక్ష్మీనరసింహ దేవాలయాలు, సకల ధర్మ సమన్వయ కేంద్రం)

2. నాదమండపం - (సంగీతానికి అంకితమైన అద్భుత సభామండపం, సప్తస్వర దేవతా మండపం, 22 శ్రుతిస్థానాలకు ప్రతీకగా 22 స్తంభాలమీద నిలబడిన విసనికర్ర ఆకారంలోని సుందర మండపం

3. శ్రీగణపతి సచ్చిదానంద వేద పాఠశాల - (ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద స్మార్తప్రయోగ, సంస్కృత పాఠశాల, అర్చక శిక్షణాకేంద్రము)

4. శ్రీదత్త వేంకటేశ్వరస్వామి దేవస్థానము - (కారణికంగా ప్రతిష్ఠితమైన మహిమాన్విత సన్నిధి, పద్మావతి, ధన్వంతరి, గణపతి, నవగ్రహ, సర్వదోషహరశివ, మరకత సుబ్రహ్మణ్య ఆలయ సముదాయం)

5. విశ్వం - ప్రదర్శనశాల - (ప్రపంచవ్యాప్తంగా శ్రీస్వామీజీవారికి అందిన అరుదైన శిల్ప, కళాఖండాలకు, ప్రశస్తమైన రత్నాలకు, సంగీతవాద్యాలకు, చిత్రవిచిత్ర వస్తు విశేషాలకు ఆలవాలం)

6. కిష్కింధ మూలికావనం - ( భారతదేశంలోనే అతి పెద్దదైన సుందరమైన వామన వృక్షవనం ( బోన్సాయి గార్డెన్), మనకు ప్రకృతి సంరక్షణా స్ఫూర్తినిచ్చే మహోద్యమం)

7. సప్తర్షి తీర్థం - (భూమండలం మీద అనేక పవిత్ర తీర్థాలతోపాటుగా, విలువైన మూలికలు, ప్రశస్త రత్నాల జలాలతో భక్తులు స్నానం చేసే పుష్కరిణి, శరీర రుగ్మతలను దూరం చేసే సంజీవనం)

8. నక్షత్ర, నవగ్రహ రాశి వనం(శాస్త్రంలో పేర్కొన్నవిధంగా 27 నక్షత్రాలు, 12 రాశులు, సప్తర్షులు, పంచాయతన దేవతలు, నవగ్రహదేవతావృక్షాల అరుదైన ప్రశాంత ఉద్యానవనం )

9. ధర్మధ్వజం - (సకల విజ్ఞాన తత్వ్తాల సారం పరబ్రహ్మము అని చాటిచెప్పే అద్భుతమైన ఏకశిలా స్థూపం. 40 నిమిషాల పాటు వినసొంపుగా తత్త్వాన్ని తెలియపరిచే ధ్వనిసమేతమైన కాంతి ప్రదర్శన)

10 శుకవనం -(అనేక రకాల చిలుకలకు ఆలవాలం, ప్రపంచములోనే అత్యంత అధికమైన శుకజాతులు గల పక్షిస్థానము)

11. జయలక్ష్మీ మాత అన్నపూర్ణా మందిరమ్ -(దత్త పీఠానికి విచ్చేసే వేలాదిమంది భక్తులకు నిరంతరం అన్నదానం జరిగే ప్రదేశం. ఈ అన్నదాన సేవలో పాలుపంచుకోవడం మహాభాగ్యం)

12. ఎస్. జి. ఎస్. ఉచిత వైద్యశాల - (పంచకర్మ మెదలైన ఆయుర్వేద చికిత్సా విధానాలతోపాటు ఆధునిక వైద్యసేవలు, చికిత్సా శిబిరాలద్వారా వేలాదిమంది ప్రజలకు ఉపకరించే సేవాకేంద్రం)

31. అవధూత దత్తపీఠ విశేష ఉత్సవములు

చైత్రమాసము

1. ఉగాది నాడు హైదరాబాద్ ఆశ్రమములో దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మహాదర్శనము

2. పూర్ణిమ (ప్రాతః, మంగళవారం, చిత్ర) ఆకివీడు క్షేత్రములో విశ్వాంబరావ ధూత దత్తాత్రేయ స్వామి వారి వార్షిక పూజ

వైశాఖమాసము

1. శుక్లపంచమి – జయలక్ష్మీ మాత జయంతి

2. శుద్ధ చతుర్దశి (ప్రాతః, బుధవారం, స్వాతీ) అచ్చరపాకం క్షేత్రంలో మాయా ముక్తావధూత దత్తాత్రేయ స్వామివారి వార్షికపూజ.

3. బహుళ దశమి – కార్యసిద్ధి ఆంజనేయ క్షేత్రములలో విశేష పూజలు

జ్యేష్ఠ మాసము

1. శుక్ల ఏకాదశి శ్రీ స్వామీజీ వారి జన్మదిన సందర్భముగా గురుపాదుకా పూజ.

2. ఏకాదశి తరువాతి ఆదివారము వరకు శ్రీ స్వామిజీ వారి జన్మదిన మహోత్సవములు

3. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి మునుపటి ఆదివారము నుండి శుక్రవారము వరకు శ్రీదత్త వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు

4. పూర్ణిమ – హైదరాబాద్ క్షేత్రములో దత్తావధూత స్వామి వారి వార్షికపూజ

ఆషాఢ మాసము

1. దత్తపీఠములో శ్రీవిశాలాక్షీ అమ్మవారికి ఆషాఢ శుక్రవార పూజలు

2. పూర్ణిమ – చెన్నై క్షేత్రములో ఆదిగురు దత్తాత్రేయస్వామి వారి వార్షిక పూజ

శ్రావణమాసము

1. శుద్ధ అష్టమి (సోమవారం వారం) జయలక్ష్మీపురములో సంస్కారహీన శివ స్వరూప దత్తాత్రేయ స్వామివారి వార్షిక పూజ మరియు శ్రీ నరహరితీర్థ స్వామి ఆరాధన

2. సచ్చిదానందేశ్వరస్వామి వారికి శ్రావణ సోమవారం వార అభిషేకములు

3. శ్రీ దత్త వేంకటేశ్వర క్షేత్రములో శ్రావణ శనివార విశేషపూజలు

భాద్రపద మాసము

1. శుక్ల తదియ – స్వర్ణగౌరీ వ్రతము

2. శుక్ల చతుర్థి – విజయవాడ క్షిప్రగణపతి స్వామివారి అభిషేకము మరియు పిఠాపురం అనఘాదత్త

క్షేత్రములో శ్రీపాదవల్లభ స్వామి జయంతి

3. శుద్ధ చతుర్దశి (గురువారం, శతభిషక్) నూజివీడు క్షేత్రములో దేవదేవ దత్తాత్రేయస్వామివారి వార్షికపూజ.

ఆశ్వయుజ మాసము

1. దత్తపీఠములో శరన్నవరాత్ర పూజలు

2. పూర్ణిమ ( బుధవారం) హృషీకేశ క్షేత్రములో దిగంబరదత్తాత్రేయస్వామివారి వార్షికపూజ

కార్తిక మాసము

1. సచ్చిదానందేశ్వరస్వామివారికి కార్తిక సోమవారం వార అభిషేకములు

2. శుక్ల ద్వాదశి (ప్రాతః, బుధవారం, రేవతి నక్షత్రం) విజయవాడ క్షేత్రములో శ్యామకమల లోచన దత్తాత్రేయస్వామివారి వార్షిక పూజ

3. పూర్ణిమ (ప్రాతః, బుధవారం, కృత్తిక) బెంగళూరు క్షేత్రములో దత్తయోగిరాజ స్వామివారివార్షిక పూజ.

4. బహుళపాడ్యమి (ప్రాతః, గురువారం, రోహిణీ) మచిలీపట్నం క్షేత్రములో అత్రివరద దత్తాత్రేయస్వామి వారి వార్షికపూజ

5. బహుళ విదియ (ప్రాతః, శుక్రవారం, మృగశిర) గండిగుంట క్షేత్రములో దిగంబరావధూత స్వామి వారి వార్షిక పూజ

మార్గశిర మాసము

1, శుద్ధ విదియ ప్రొద్దుటూరు క్షేత్రములో యోగిరాజ వల్లభ దత్తాత్రేయ స్వామివారి వార్షిక పూజ

2. శుద్ధ షష్ఠి – మైసూరు మరకత సుబ్రహ్మణ్య స్వామివారి కావడి ఉత్సవము

3. శుక్ల త్రయోదశి దత్తపీఠములో దత్తాత్రేయ జయంతి మహోత్సవ ప్రారంభము, మండపోత్సవము, పంచామృతాభిషేకము.

4. శుక్ల చతుర్దశి – మైసూరు దత్తపీఠములో రథోత్సవము, క్షీరాభిషేకము

5. పూర్ణిమ ( సాయం, బుధవారం ) కాలాగ్నిశమన దత్తావతారము, దత్తాత్రేయోత్పత్తి

6. పూర్ణిమ ( పూర్ణిమ, గురువారం, మృగశిర) దత్తాత్రేయ జయంతి యోగిరాజ వల్లభ దత్తాత్రేయ స్వామివారి వార్షిక పూజ.

7. బహుళ అష్టమి – ప్రధాన అనఘాష్టమి

పుష్య మాసము

1. పుష్య శుద్ధ విదియ – గాణగాపురం విశ్వరూప దత్త క్షేత్రములో శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారి జయంతి

2. పుష్య పూర్ణిమ ( ప్రాతః బుధవారం) సూరత్ క్షేత్రములో లీలావిశ్వంబర దత్తాత్రేయస్వామివారి వార్షిక పూజలు

3. ధనుర్మాస శుక్ల ఏకాదశి ముక్కోటి ఏకాదశి – శ్రీ దత్త వేంకటేశ్వరస్వామివారి ఉత్తరద్వార దర్శనము

మాఘ మాసము

1. శుక్ల పంచమి – మరకత రాజరాజేశ్వరీ అమ్మవారి వార్షిక పూజ

2. శుక్ల సప్తమి – సూరప్ప పౌండరీకయాజిగారి ఆరాధన

3. శుక్ల దశమి – శ్రీ పాదవల్లభ అవఘాదత్త క్షేత్రము, పిఠాపురములో బ్రహ్మోత్సవ వార్షిక పూజ

4. పూర్ణిమ (మధ్యాహ్నం, గురువారం, మఘ) కొచ్చిన్ క్షేత్రములో సిద్ధరాజ దత్తాత్రేయ స్వామివారి వార్షిక పూజ.

5. మహా శివరాత్రి – మైసూరులో సచ్చిదానందేశ్వర స్వామి విశేష పూజలు, హరిద్వార క్షేత్రములో సహస్రలింగేశ్వరస్వామి వారి వార్షిక పూజ

ఫాల్గున మాసము –

1. శుద్ధ దశమి (ప్రాతః, ఆదివారం) అనంతపుర క్షేత్రములో జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామివారి వార్షిక పూజ.

విశేష సూచన –1. షోడశ దత్తావతారములలో, ఆవిర్భావ సమయం తెలపనట్లైతే, దత్తావతారం సమయంగా సాయం వ్యాపినీత్వమే ఆశ్రయించాలి.

2. ప్రతి బహుళ అష్టమి – అనఘాష్టమి.

3. ప్రతి అమావాస్య శ్రీదత్తముక్తి క్షేత్రములో అభిషేకము, అన్నదానము.

32. దత్తపీఠంలో ప్రధానమైన పండుగలు

1. శ్రీ స్వామీజీవారి జన్మదినోత్సవం -

ఈ ఉత్సవాలు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి దీక్షగా జరుగుతాయి. సామాన్యంగా మే, జూన్ ప్రాంతాలలో వస్తాయి. ఈ సందర్భంగా గొప్ప యజ్ఞాలు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అఖిల భారత జ్ఞాన బోధ సభా సమ్మేళనం, వేదపరీక్షలు జరుగుతాయి. అంతర్జాతీయ ప్రతిష్ఠాకరమైన వేదనిధి, నాదనిధి, శాస్త్రనిధి, దత్తపీఠ ఆస్థాన విద్వాన్ ఇత్యాది బిరుదులతో ఉత్తమోత్తమ పండితులకు పురస్కారాలు జరుగుతాయి. ఈ సందర్భములోనే శ్రీదత్త వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవములు కూడా జరుపబడును.

2. శ్రీదేవి నవరాత్రులు -

తొమ్మిది రోజులు జరగే ఈ ఉత్సవాలు సంపూర్ణమైన పూజా కార్యక్రమాలు, హోమములు, నాదసేవా కార్యక్రమాలతో నిండి ఉంటాయి.

3. దత్త జయంతి -

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుడైన ఆదిగురు దత్తాత్రేయ స్వామి జన్మదిన మహా పర్వదినమిది. మార్గశీర్ష పూర్ణిమ, ఇది సామాన్యంగా డిసెంబరులో వస్తుంది. ఇది మూడురోజుల ఉత్సవం. విశేషమైన దత్తపూజలు. దత్తహోమాలు ఉంటాయి.

4. శివరాత్రి -

శ్రీ స్వామీజీ మహారుద్ర యాగముని ఈ ఉత్సవములోనే చేస్తారు. ఇది ఒకరోజు ఉత్సవం. రాత్రంతా శ్రీసచ్చిదానందేశ్వరుడికి అభిషేకాలు, రుద్రహోమం జరుగుతాయి కైలాసం దిగి వచ్చినట్లుంటుంది, ఫిబ్రవరి, మార్చ్ నెలలలో ఉంటుంది. ఈ పై నాలుగు ఉత్సవాలలోనూ శ్రీస్వామీజీ సామాన్యంగా మైసూర్ దత్తపీఠంలోనే ఉంటారు.

5. జయలక్ష్మీ మాత జయంతి -

ఈమె శ్రీ స్వామీజీ వారి తల్లి. యోగ దీక్షా గురువు కూడా ఈ మహాతల్లి జన్మంచినది పరమపదించినది కూడా శంకరజయంతి నాడే. ఇది ఒకరోజ ఉత్సవం సామాన్యంగా ఏప్రిలే, మే మాసాలలో వస్తుంది.

6. శ్రీ నరహరి స్వామి ఆరాధన -

శ్రీ స్వామీజీవారి తండ్రి శ్రీ నరహరి తీర్థస్వామివారి ఆరాధన మహోత్సవము శ్రావణ శుద్ధ అష్టమి రోజు ఆగస్ట్ మాసములో ఆచరించబడును,

7. వైశాఖమాసంలో వచ్చే లక్ష్మీనృసింహ జయంతి, ఆషాఢ మాసంలో గురుపౌర్ణిమ, భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి కూడా దత్తపీఠంలో విశేషంగా ఆచరించబడతాయి.

8. ఇవికాక ప్రతి ఆదివారం గణపతి హోమాలు, ప్రతి పౌర్ణమి పవమాన హోమం 16, దత్తాత్రేయ అవతార జయంతులకు దత్తాత్రేయ హోమాలు జరుగుతాయి.

33. తెలుసుకోదగినవి

1. మూఢము- గురు, శుక్ర గ్రహములు రవితో కలసివుండే వేళను మూఢము లేదా మౌఢ్యము అందురు. ఈ కాలంలో వారు శుభఫలాలనీయరు. కావున వివాహాది ఎట్టి శుభకార్యాలు చేయరాదు.(ఆశ్రేషాది గండ నక్షత్రములకు శాంతి, హోమ, జప, అభిషేకాలు వంటివి మాత్రమే చేయవలెను.)

2. గోధూళికా ముహూర్తం- సూర్యుడున్న ముహూర్తం నుండి 7వది గోధూళిక అనబడును. మేతకు వెళ్ళిన గోవులు మరలివచ్చే-సూర్యాస్తమయ పూర్వవేళ అన్ని ప్రయాణాలకు మంచివి.

3. వివిధ యాత్రలకు- స్త్రీ యాత్రకు వృషభ కన్యా మిథునరాశులు, గోయాత్రకు తులా, వృషభ, మేష, సింహ, మకర లగ్నములు - ధనార్థులకు కుంభ, కటక, మీన, మకర రాశులు. యుద్ధయాత్రకు వృషభ, సింహ, ధనుర్మేష లగ్నములు జయప్రదములు.

4. తిథిసంధి- అమావాస్యకు శుద్ధపాడ్యమికి నడుమ పంచమి, షష్ఠీల మధ్య దశమీ ఏకాదశుల నడుమ 4 ఘడియల కాలం తిథి సంధి.

5. నక్షత్రసంధి- రేవతి - అశ్వినుల మధ్య, ఆశ్రేషా -మఖానడుమ, జ్యేష్ఠా-మూల తారలు మధ్యన 4 ఘడియలు కాలం నక్షత్రసంధి.

6. లగ్నసంధి- మీనమేషములు, కటక, సింహములు, వృశ్చిక, ధనుస్సు-వీటినడుమ 1 ఘడియ లగ్నసంధి.

7. కనుమలు- మరణం, శవదహనం, సపిండీకరణం, జాతర, సంక్రమణం, గ్రహణం - ఇవి జరిగిన మరుసటి రోజును కనుమ అంటారు.

8. నిషిద్ధనవమీత్రయం- ఏదైనా ఒక ప్రయాణం చేసిన 9వరోజునగాని, ఆ తిథికి 9వ తిథికిగాని, ప్రవేశము చేయరాదు. ప్రవేశించిన నాటి 9వ నాడుగాని 9వ తిథిగాని- అటునుండి బయలుదేరరాదు. వీటినే ప్రయాణనవమి, ప్రవేశనవమి, ప్రత్యక్షనవమి అంటారు. ఈ మూడు నవములు నిషిద్ధములు.

9. సిద్ధియోగములు- శుక్రవారం 1, 6, 11 తిథులు- బుధవారం 2, 7, 12 తిథులు-మంగళవారం 3, 8, 13 తిథులు-శనివారం 4, 9, 14 తిథులు- గురువారం 5, 10, 15 తిథులు - వీటిని సిద్ధయోగములంటారు.

10. అధికమాసము- సూర్యుడు నెలకు 1 రాశి చొప్పున సంవత్సరమునకు 12రాశులలో సంచరించును. ఆయన యొక్క రాశి ప్రవేశమునకే సంక్రమణమని పేరు. అలా సూర్య సంక్రమణం జరుగని శుద్ధపాడ్యమి నుండి అమావాస్య వరకు గల మాసం అధికమాసంగా చెప్పబడుచున్నది.

11. పక్షచ్ఛిద్ర తిథులు - 4, 6, 9, 12, 14 తిథులు

12. క్షయ మాసము- చాంద్రమాసమునందలి ఏ మాసమున సూర్యుడు రెండు రాశులలో ప్రవేశించునో - ఆ మాసమును క్షయమాసమందురు.

13. శూన్యమాసము- సూర్యుడు మీనంలో వున్న చైత్రమాసం, మిథునంలో వున్న ఆషాఢం, కన్యలో వున్న భాద్రపదం, ధనుస్సులో వున్నపుష్యమాసం -ఇవి శూన్యమాసములు అనబడును.

14. త్రిసోష్టకములు - మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గునము 4 మాసముల్లోనూ కృష్ణపక్షాన వచ్చే 7, 8, 9 తిథులతో కూడిన దినములకు త్రిసోష్టకములందురు. ఇవి అనధ్యాయములు.

15. విసర్జించవలసిన వేళలు- గ్రహణాది 7రోజులు, లగ్నాంత 1/2 ఘడియ, నక్షత్రాంత 21/2 ఘడియలు మాసాంత 3రోజులు, సంవత్సరాంతమున 15రోజులు వర్జనీయాలు. శుభకార్యాలు చేయరాదు.

16. కర్తరులు- సూర్యుడు భరణి 3, 4 పాదాలు సంచరించడం డొల్లుకర్తరి, పెద్దదోషం లేదు. కృత్తికలో సంచరించడం అగ్ని కర్తరి. కర్తరీకాలంలో చెట్లు నరకడం, కృష్యారంభం, విత్తుజల్లుట, వాసీకూపతటాక గృహనిర్మాణాదులు, క్రొత్త వాహనములు వాడకము ప్రారంభించుట చేయరాదు. ఉపనయనం, వివాహ, గృహప్రవేశం, యజ్ఞయాగాదులు మొదగులనవి చేయవచ్చును.

17. జన్మనక్షత్ర విధులు- జన్మనక్షత్రములో వ్యవసాయ, నిషేక, యజ్ఞాదులు, చెవులు కుట్టుట, అన్నప్రాశన, ఉపనయనం, భూసంపాదన, అక్షరాభ్యాసం, చేయవచ్చును. గర్భాదానం, పుంసవనసీమంతాలు, ప్రయాణం, వివాహం, ఔషధసేవ, శ్రాద్ధం, క్షౌరం, మొదగులనవి చేయరాదు.

18. పాము శకునం- రైతు తనమానాన తాను పోతుండగా పడగఎత్తి ఆడుచున్న పాము కనబడితే పొలం బాగా పండును. చచ్చినపాము కనబడితే మరణవార్త వినును. పాముపారిపోతే ఫలితం శూన్యం.

19.చుక్కెదురుదోషము- శుక్రమూఢములో ప్రయాణమునే చుక్కెదురు దోషమందురు. నవవధువు, గర్భిణీ బిడ్డతో కలసి బాలెంత-వీరు ముగ్గురునూ శుక్రాభిముఖముగ అస్సలు ప్రయాణం చేయరాదు.

20. సర్వార్థసాధన చక్రము- ఈ దిగువ చక్రము ప్రకారము వార నక్షత్రములన్నచో సర్వకార్యారంభములకును శుభప్రదము.



ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
అశ్విని శ్రవణం అశ్విని - అశ్విని అశ్విని శ్రవణ
పుష్య పుష్యమి ఆశ్లేష - పుష్య - -
ఉత్తర రోహిణి - రోహిణి - - రోహిణి
హస్త - - హస్త రేవతి రేవతి -
మూల మృగశిర - మృగ పునర్వసు పునర్వసు -
ఉ.షాఢ - కృత్తిక కృత్తిక - - స్వాతి
ఉ.భాద్ర - ఉ.భాద్ర అనూరాధ అనూరాధ అనూరాధ -

34. కుజదోషము-అపవాదములు

సంసారులు కానిదే సర్వేశ్వరులకైనా పరిపూర్ణత లేదనేది ఆర్షవాక్యం. అటువంటి సంసారానికి మూలమైనవివాహ వ్యవస్థలో - వధూవర జాతక పరిశీలనలలో ఎంతటి విజ్ఞులనైనాసరే ఇబ్బంది పెట్టేది, భయపెట్టేదియే "కుజదోషం". ఏ మనిషికైనా సరే జన్మలగ్నమునుండి 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడున్నా లేక ఆ స్థానాలకి కుజదృష్టి కల్గిన - అది స్త్రీల యొక్క భర్తృభావానికి పురుషుల కళత్ర భావానికి పీడ కల్గిస్తుంది. అలాంటి జాతకులకు వివాహం చేయరాదనీ, కుజదోషం లేని వధూవరులకు మాత్రమే పెండ్లి చేయాలని పెద్దల ఆదేశం.

కాని వధూవరుల జాతకాలు రెండింటా కూడా కుజదోషం సమతుల్యంగా వుంటే వివాహం చేయవచ్చునని అన్ని శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి. అంతేకాకుండా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్న జాతకులకు కుజదోషం వర్తించదని కూడా చెబుతున్నాయి.

మేష, వృశ్చికములకు చతుర్థ కుజుడూ, వృషభ తులలకు వ్యయ కుజుడూ, మిథున, కన్యలకు ద్వితీయ కుజుడూ, మకర, కర్కాటకములకు సప్తమ కుజుడూ, ధనుర్మీనములకు అష్టమ కుజుడూ, కుంభ సింహములకు కుజుడెక్కడ వున్ననూ కూడా దోషము లేదని పూర్వులంగీకరించి యున్నారు. కాని కుజుడు సప్తమ స్థానంలో ఉండడం మహాదోషమని విశ్వసించేవాళ్ళూ, తాము భయపడుతూ - ఇతరులకు భయపెట్టేవాళ్ళూ కూడా ఉన్నారు. అందుకు కారణం - మేష సింహ వృశ్చిక కుంభాలలోని సప్తమ కుజుడు దోషకారినని - బృహజ్జాతకకారులు చెప్పడమే. కాని, మేషాది పన్నెండు రాశులకూ ఒకవిధమైన ఫలితాలుండవని గుర్తించాలి. ముఖ్యంగా - సప్తమ కుజుడి వలన చెప్పుకోబడే రాశులన్నీ కూడా - ఆ సప్తమ స్థానమైన రాశినిబట్టే వుంటాయి. ఉదాహరణకి, కటక ధనుర్మీనాలు సప్తమాలై - ఆ రాశులలో కుజుడుంటే శుభకరుడే గాని, దోషికాడు. తులా వృషభాలు సప్తమమై అక్కడ కుజుడుంటే - భార్యా భర్తలిద్దరూ - జీవితాంతం అనురాగంగా వుంటారు. కన్యా కుంభాలు సప్తమమై అక్కడ కుజుడు వుంటే - వివాహానంతరం భోగభాగ్యాలు కలుగుతాయి.

ఏది ఏమైనప్పటికీ, మొత్తం మీద గ్రహగత చతుర్విధ సంబంధాలన్నీ చక్కగా పరిశీలించిన తర్వాతనే ఫలనిర్ణయం చేయాలిగాని - జాతక పీఠికలో కుజుడు కనబడగానే " కుజదోషం అని కంగారుపడడం అమాయకత్వమే తప్ప అన్యంకాదని మనవి చేస్తున్నాం. ఇంకా శుక్రుడూ, రాహు కేతువుల సంబంధాలూ, సప్తమ స్థానాధిపతి యొక్క స్థానబలం, సప్తమ స్థానమందున్న గ్రహముల ప్రభావం, సర్పదోషం మొదలైన యోగాలవలన దాంపత్య జీవిత సుఖాన్ని శాస్త్ర దృష్టితో నిర్ణయించగలగాలి. గావున - శాస్త్ర విజ్ఞానం గలవారి చేత జాతకములు పరిశీలన చేసుకొని సుఖాన్ని పొందవచ్చును.

35. నవవిధ శాంతులు

దుష్ట నక్షత్రములందు స్త్రీలు రజస్వలలైనప్పుడు, గండనక్షత్రములలో శిశుజననమైనప్పుడు జరపవలసిన శాంతి 9 విధములు. అవి దిగువ నిచ్చుచున్నాము. శాంతికిగాను తొమ్మిది పనులు చేయవలెను.

1. తైలావలోకనం- కంచు, లేదా, మట్టిపాత్రలో తగినంత మంచినూనెపోసి అందులో పగడం - ముత్యం వుంచాలి. ఒకచోట ఉప్పు గుట్టగాపోసి - యీ పాత్రను పూజించాలి. తదనంతరం - ఆ తైలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి.

2. రుద్రాభిషేకం- నక్షత్రం యొక్క దోషబలాన్ని బట్టి ఈ తంతు జరపాలి. శక్తివంచన లేకుండా ముగ్గురుగాని, అయిదుగురుగాని, 11మందిగాని రుద్రన్యాసయుక్తంగా 11 పర్యాయాలు శివాభిషేకము, పూజ చేయించాలి. తదుపరి ఆ బ్రాహ్మణులను భోజన, తాంబూల, దక్షిణలతో సంతోషింపచేసి వారి ఆశీస్సులను బొందవలెను.

3. సూర్యనమస్కారములు- ఒంటికాలిపై నిలిచి – అరుణమంత్రమును 108 పర్యాయములు జపించుచు చేయు నమస్కారమని పేరు. దీనికి ఒకరుగాని, ముగ్గురుగాని, 5గురుగాని బ్రాహ్మణులను నియుక్తపరచవలెను.

4. మృత్యుంజయ జపము- దీనినే అపమృత్యుహరం అంటారు. యథాశక్తి బ్రాహ్మణులను నియమించి - లక్షసార్లు మృత్యుంజయ మంత్రజపం చేయించటం సాంప్రదాయం. తద్వారా అన్నివిధములైన అపమృత్యుదోషాలు తొలగిపోతాయి.

5. నక్షత్ర జపం- 27గురు బ్రాహ్మణులను నియమించి- ఒక్కొక్క నక్షత్రమునకు 108 నుండి 1008 పర్యాయములు శాంతి మంత్రము జపింప చేయవలెను.

6. నవగ్రహ జపం- నవగ్రహములకు 9మంది విప్రులచే ఆయా శాంతి నిర్ణీత మంత్రములను జపింపచేయవలెను.

7. హోమము- నవగ్రహముల పేరిట తగుహోమము(అగ్ని పూర్వకంగా) చేయింపవలెను.

8. సువాసినీ పూజ- శక్తిననుసరించి, తగినంత మంది ముత్తైదువలకు భోజన తాంబూలాదులిచ్చి, పువ్వులు పండ్లను సమర్పించి, నమస్కరించి వారి ఆశీస్సులు పొందవలెను.

9. ఈ ఎనిమిది అనంతరము - తగుమంది బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. దానగ్రహీతమైన బ్రాహ్మణుడు అనంతరము స్నానము, జపము తప్పక ఆచరించవలెను. గ్రహింపవలెను.

ఈ తొమ్మిది అంగములతో చేసినదే -శాంతి యనబడును. తద్వారా సర్వనక్షత్ర, గ్రహదోషములు - అపమత్యు భయములు తొలగి సుఖశాంతులు లభించును. ఈ శాంతి కార్యములు ఇంటి పురోహితులను (స్థానిక బ్రహ్మను) సంప్రదించి జరిపించుకోవలెను.

36. ప్రయాణమునకు శుభ సమయములు

• శుభతారలు- అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, రేవతీ నక్షత్రములు శ్రేష్ఠములు.

• రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిషం మధ్యమములు. తక్కిన తారలు నిషిద్ధములు.

• మంచి నక్షత్రములందు వార శూలలూ, ఆనందాదియోగములూ చూచుకొని ప్రయాణించవలెను. ఉభయ పక్షములందలి 2, 3, 5, 7, 10, 11, 13 తిథులు మరియు కృష్ణ 1 మంచివి.

• శుభవారాలు- తూర్పునకు మంగళవారం, దక్షిణమునకు సోమవారం, శనివారాలు, పడమరకు బుధ, గురువారాలు, ఉత్తరానికి ఆది, శుక్రవారాలు మంచివి.

37. ప్రయాణానికి కూడని తిథివారశూలలు

దిక్కు తిథి వారములు నక్షత్రము లగ్నము
తూర్పు 1, 9 శని-సోమ జ్యేష్ఠ-ధనిష్ఠ తుల-కుంభం
ఆగ్నేయం 3, 11 శని-గురు ................ మకరం
దక్షిణం 5, 13 గురు శ్రవణం, అశ్వని మీనం-వృశ్చికం
నైఋతి 4, 12 సోమ–శుక్ర ................. కర్కాటకం
పడమర 6, 14 ఆది-శుక్ర రోహిణి-పుష్యమి ధనుస్సు, సింహం
వాయవ్యం 7, 15 ఆది-మంగళ ................. మేషం
ఉత్తరం 2, 10 బుధ-మంగళ పుబ్బ-హస్త కన్య, వృషభం
ఈశాన్యం 8, 30 బుధ ................ మిథునం

చక్రములో చెప్పబడిన శూలలలో ప్రయాణము చేయరాదు. మరియు ఏకాదశి సోమవారం వారం, ద్వాదశి శనివారం, షష్ఠి గురువారం, తదియ బుధవారం, అష్టమి శుక్రవారం, నవమి ఆదివారం, పంచమి మంగళవారం ఇవి దగ్ధయోగములు. కావున ఆ రోజులలో అస్సలు ప్రయాణము చేయరాదు.

కొత్తకాపురం - ఆడపిల్లను క్రొత్తగా కాపురమునకు పంపుటకు ఆది, మంగళ, శుక్రవారములు పనికిరావు. పునర్వసు నక్షత్రము దోషభూయిష్ఠము.

నిర్ఘ్య విషయము - నిషిద్ధకాలములందు తప్పనిసరి ప్రయాణమైనచో ఆదివారం బంగారమును, సోమ – వస్త్రం, మంగళ – ఆయుధం, బుధ –పుస్తకం, గురు –గొడుగు –టోపీ –తలపాగాలలో ఒకటి, శుక్ర – చెప్పులు లేదా వాహనం, శని కంఠమున ధరించు వస్తువును – ప్రయాణ మార్గమండలి యెవరి యింటనైనా నిర్ఘ్యముంచుకొని అనవసరవేళ శుభ శకునమున ప్రయాణమై వెళ్ళవచ్చును.

ప్రయాణ ప్రారంభమునందు ఈ క్రింది శ్లోక పఠనము ద్వారా సర్వకార్య జయము కలుగును.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ।।

38. తారలు-అధిపతులు-శాంతులు

ఎవరైనా మంచి ముహూర్తమునిర్ణయించుకొన్నప్పుడు వ్యక్తియొక్క జన్మలేక నామ నక్షత్రము నుండి ఆనాటి వరకు లెక్కించగా ఈ క్రింది తారలు వచ్చును. ఇవి మూడు పర్యాయాలు వచ్చును.

1 జన్మ, 2 సంపత్, 3 విపత్, 4 క్షేమ, 5 ప్రత్యక్, 6 సాధన, 7 నైధన, 8 మిత్ర, 9 పరమమిత్ర తారలు అనబడును.

1.జన్మతార- మంచిదికాదు. అధిపతి రవి. వాహనం-నెమలి. దోషకాలం-7.ఘడియలు తోటకూరదానం శాంతి. తాపకారకుడు. మనస్తాపం కలిగించును. క్షోభతో దేహనాశము కల్గించును. వృత్తి, ఉద్యోగములకు కారకుడు, వృథా వ్యయము.

2. సంపత్తార- మంచిది. అధిపతి-బుధుడు. వాహనం-గుర్రం. దోషం లేదు. ధనలాభం, ఆనందం, సుఖం కలిగించును. ధనధాన్యలాభకరము, సర్వవిధ ద్రవ్యలాభము. ఏలోటు ఉండదు. హుందాతనం, సంపద, వృద్ధి, స్థిరత్వము.

3. విపత్తార - చెడ్డది. అధిపతి-రాహువు. వాహనం-మేక. దోషం-3ఘడియలు. బెల్లం దానం శాంతి. ఇది కలహములు, అపార్థములు కలిగించును. దారిద్ర్యబాధ, కార్యనాశనము కూడ. మనఃక్లేశము, విపత్తులు ఇచ్చును.

4. క్షేమతార - మంచిది-అధిపతి-గురుడు. వాహనం-ఏనుగు. దోషం లేదు. రాజప్రాప్తి. శాంతి, సుఖం, గౌరవం, ధైర్యప్రదాత. ఆరోగ్య క్షేమములు కలుగును.

5. ప్రత్యక్తార - చెడ్డది-అధిపతి-కేతువు వాహనం-కాకి. కార్య నాశనం-దోషం 8 ఘడియలు. ఉప్పు దానం శాంతి. మృత్యుకారకుడు, పట్టుదలలు, తాపము.

6.సాధనతార - మంచిది-అధిపతి-చంద్రుడు వాహనం-నక్క. దోషం లేదు. కీర్తికరుడు. సుఖశాంతులతో సంపత్సౌభాగ్యాలతో గౌరవప్రతిష్ఠలతో వర్ధిల్లచేయును. వ్యవహార జయం, లాభం, కార్యసిద్ధి కల్గించును.

7.నైధనతార - చెడ్డది-అధిపతి-శని-కార్యనాశకుడు. వాహనం-సింహం. ప్రమాదభయము, యుద్ధభయం, ప్రాణభీతి, దోష ఘడియలు 8. బంగారంతో కలపి నువ్వులు దానం శాంతి. సర్వదా చెడ్డది. ఆయుఃక్షీణము నిచ్చును.

8. మిత్రతార- మంచిది. అధిపతి-శుక్రుడు-సంతోషకారకుడు. వాహనం-గరుడుడు విశేషమైన సుఖ సౌఖ్యములు, దోషం లేదు. పుష్టిని యిచ్చును.

9.పరమమిత్ర తార- మంచిది. అధిపతి-కుజుడు. వాహనం – హంస కొంచెం కష్టం, కార్యం సానుకూలము, దోషములేదు. మిత్రత్వం శాంతి సుఖం శుభం.

ప్రథమ నవకంలో జన్మతార, ద్వితీయ నవకంలో విపత్తార, తృతీయంలో ప్రత్యక్తార సర్వవేళలా నైధనతార పూర్తిగా విసర్జించితీరాలి. ఆయా నిషిద్ధ నవకాలుకాక యితర నవకాలలో ఆయాతారలు వచ్చుచున్నప్పుడు దోష ఘడియలు విసర్జించి ఉపర్యుక్త దానాలతో శాంతి జరిపి పిమ్మట కార్యక్రమాలు జరుపుకోవాలి.

మాసఫలము జూచు క్రమము - శుద్ధపాడ్యమి ప్రవేశమునందే నక్షత్రముండునో ఆ నక్షత్రము లగాయతు తన నక్షత్రము వరకు లెక్కించి ఆ సంఖ్యను 9చే భాగించగా మిగిలిన శేషము 1. ప్రయాణము 2. మృష్టాన్న భోజనము 3. తనుతాపము4. శౌర్యము 5.విద్య 6. వస్త్రలాభము, 7. శోకము 8. అనంత పుణ్యము 9. మహాఫలము కలుగును.

39. ఏల్నాటి శని ప్రభావము

జన్మరాశికి-12, 1, 2 రాశులలో శని సంచరించుటనే ఏల్నాటి శని యందురు. ఒక్కొక్క రాశిలో 2 1/2 సం।।రములు చొప్పున మొత్తం 7 1/2 సం।।రములు దోషమగును. 12వ రాశిలోనికి రాగానే ధన వ్యయముపై దెబ్బతీయును. దరిద్రము, ఇంటి పోరు, కష్టములు, మానహాని, వ్యవహార చిక్కులు కలుగును. జన్మ(1) రాశిలోనికి రాగానే గతంలో మిగిలినదేమైనా వుంటే అది కూడా ఖర్చు చేయించి శరీరమును బాధించును. బంధు అరిష్టము, కళత్రపీడ, గుర్తించలేని వ్యాధులు, మతిభ్రమణం, కళాకాంతులు లేకపోవుట కలిగించును. 2వ రాశిలోనికి రాగానే-ఎనలేని ఆశలు కల్పించును. కాని నిందలుపడుట, నిత్యదుఃఖము కలుగును. మానసికముగా క్రుంగదీయును.

3వ రాశిలోనికి ప్రవేశించగానే సర్వ శుభములూ కలిగించును. జననకాలంలో శని స్వస్థాన, ఉచ్ఛలగ్నములందు శని ఆధిపత్య నక్షత్రములందు జన్మించిన వారికి ఈ శని రాశుల సమీప సంచారమందు ఉన్నతిని కల్గించునని భావించవచ్చును. ఏది ఏమైనా 12, 1, 2 రాశులలో శని సంచారమిట్లుండును.

40. వధూవరులకు పరస్పర వైరము కలిగించు వేధ నక్షత్రములు

అశ్విని-జ్యేష్ఠలకు, భరణి-అనూరాధలకు, కృత్తిక-విశాఖలకు, రోహిణి-స్వాతులకు, ఆర్ధ్రా-శ్రవణములకు, పునర్వసు-ఉత్తరాషాఢలకు, పుష్యమి-పూర్వాషాఢలకు, ఆశ్రేష-మూలలకు, మఘా-రేవతులకు, పూర్వఫల్గుని-ఉత్తరాభాద్రలకు, ఉత్తరఫల్గుని-పూర్వాభాద్రలకు, హస్త-శతతారలకు పరస్పర వేధ కలిగి యుండును. కావున ఈ నక్షత్రముల జంటలో నొక జంట దంపతుల జన్మనక్షత్రములై యున్నచో దంపతులకు కలహకరమగును. ద్విపాద నక్షత్రములగు చిత్రా-మృగశిర-ధనిష్ఠలును పరస్పరవైరము కలవై యుండును.

41. శుభ కార్యములకు సరిపడే శుభ నక్షత్రములు

అశ్విని - రోహిణి, పుష్యమి, స్వాతి, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి, (మృగశిర, హస్త, చిత్ర, అనూరాధ, మూల)

భరణి - మృగ, పున, మఖ, ఉత్తర, చిత్ర, మూల, ఉ.షా, ధనిష్ఠ, రేవతి, అశ్విని(పుబ్బ, స్వాతి)

రోహిణి - మృగ, పున, ఉత్తర, చిత్ర, ఉ.షా, శ్రవ, ధనిష్ఠ, పూ.భా, రేవతి (పుష్య, అనూ, శత)

మృగశిర - పుష్యమి, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉ.షా, శ్రవణ, శతభిష, ఉ.భా, అశ్విని, రోహిణి, (మఖ, ధనిష్ఠ)

ఆర్ద్ర - పున, హస్త, చిత్ర, ధనిష్ఠ, రేవతి, రోహిణి, మృగ, (పుష్య, మఖ, స్వాతి, మూల, శత)

పునర్వసు - పుష్యమి, మఖ, ఉత్తర, చిత్ర, స్వాతి, అనూరాధ, మూల, ధనిష్ఠ, శతభిషం,ఉత్తరాభాద్ర, అశ్విని, మృగశిర (రేవతి)

పుష్యమి- రోహిణి, పునర్వసు, హస్త, స్వాతి, శ్రవణ, రేవతి, ఉత్తరాభాద్ర, (ఉత్తర, అనూరాధ, ఉ.షా, శతభిషం)

ఆశ్రేష - అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, చిత్ర, అనూరాధ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, ఉ.భా, (హస్త, మూల, శ్రవణం, రేవతి)

మఖ - రోహిణి, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, శతభిష, ఉ.భా, (అశ్విని, చిత్ర, శ్రవణ, ధనిష్ఠ)

పుబ్బ - అశ్విని, మృగశిర, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్ర, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, రేవతి (స్వాతి, శతభిష)

ఉత్తర - అశ్విని, రోహిణి, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణ, శతభిషం, ఉ.భా (ఉ.షా, రేవతి)

హస్త - మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్ర, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, రేవతి, (అనూరాధ, శ్రవణ, ఉ.భా, రోహిణి)

చిత్ర- అశ్విని, పుష్య, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉ.షా, శతభిష, (మృగ)

స్వాతి - శ్రవణం, ధనిష్ఠ, రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు, హస్త, చిత్ర, (మూల, శతభిష, అశ్విని, పుష్యమి)

విశాఖ - అశ్విని, మృగశిర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్ర, స్వాతిఅనూరాధ, మూల, ఉ.షా, ధనిష్ఠ, శతభిష, ఉ.భా

అనూరాధ - శ్రవణ, శతభిష, రేవతి, రోహిణి, పునర్వసు, పుష్య, హస్త, స్వాతి (ఉ.షా, ఉ.భా)

జ్యేష్ఠ - మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్ర, అనూరాధ, ఉ.షా, ధనిష్ఠ, ఉ.భా, రేవతి (శ్రవణం, రోహిణి)

మూల - పుష్య, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, శతభిష, ఉ.భా, రేవతి (అశ్విని, రోహిణి, మృగశిర, ధనిష్ఠ)

పూ.షా - అశ్విని, మృగశిర, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్ర, మూల, ఉ.షా, ధనిష్ఠ, రేవతి (శతభిష)

ఉ.షా - అశ్విని, రోహిణి, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణ, శతభిష, ఉ.భా (మఖ, ఉత్తర)

శ్రవణం మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్ర, ఉ.షా, ధనిష్ఠ, రేవతి(రోహిణి, పుష్యమి, పూ.షా, ఉ.భా)

ధనిష్ఠ - అశ్విని, రోహిణి, పుష్యమి, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉ.షా, శ్రవణ, శతభిష, ఉ.భా, (మృగశిర, మఖ, చిత్ర)

శతభిషం - రోహిణి, మృగశిర, పునర్వసు, చిత్ర, స్వాతి, శ్రవణ, ధనిష్ఠ, రేవతి (అశ్విని, పుష్యమి, మఖ)

పూ.భా - అశ్విని, మృగశిర, పుష్య, మఖ, చిత్ర, స్వాతి, అనూరాధ, మూల, ఉ.షా, ధనిష్ఠ, శతభిష, ఉ.భా (పునర్వసు)

ఉ.భా - రోహిణి, పునర్వసు, హస్త, శ్రవణ, శతభిష, రేవతి, (స్వాతి, అనూరాధ, పుష్య)

రేవతి - మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, చిత్ర, అనూరాధ, మూల, ఉ.షా, ధనిష్ఠ, ఉ.భా,(అశ్విని, రోహిణి, హస్త)

42. శుభకార్యములకు శుభసమయములు

1. వివాహ నిశ్చయతాంబూలములకు - శుక్లపక్షంలో 11, 13, 15 తిథులు, ఉభయ పక్షములలోనూ 2, 3, 5, 7, 10 తిథులు- ఆది, బుధ, గురు, శనివారములును మంచివి. అశ్విని, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం యీ నక్షత్రాలయందు లగ్నమునకు 5-9 స్థానములలో పాపగ్రహములు లేనప్పుడు నిశ్చయ తాంబూలములు పుచ్చుకొనవలెను.

2. పెండ్లికొడుకు, పెండ్లికుమార్తెను చేయుటకు - మంచి తిథులతో కూడిన, ఆది, బుధ, గురు, శనివారములను పునర్వసు, అశ్విని, అనూరాధ, హస్త, చిత్ర, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ మంచివి. లగ్నమునుండి 5-9 స్థానములు శుద్ధిగా వుండవలెను.

3. వివాహమునకు శుభవేళలు - మాఘ, ఫాల్గున, వైశాఖ, జ్యేష్ఠమాసములు శ్రేష్ఠం. మార్గశిర కార్తికమాసములు మధ్యమం. చైత్ర, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, పుష్యమాసములు అధమములు. శుక్లపక్షంలో 2, 3, 5, 7, 9, 10, 13, 14, 15 తిథులు బహుళపక్షంలో 1, 2, 5, 7, 9, 10 తిథులు బుధ, గురు, శుక్ర వారములు మంచివి. రోహిణి, మృగశిర, మఖ, ఉత్తరాత్రయం హస్త, స్వాతి, అనూరాధ, మూల, రేవతీ నక్షత్రములూ-మేష, వృషభ, మిధున, సింహ, కన్య, తుల, ధనుర్మీనలగ్నమలు శుభప్రదములు. మిగిలిన లగ్నములలో చేయరాదు. సప్తమశుద్ధి ప్రధానము. ముందుగా కుమారునకు ఉపనయనము చేయవలెను. పిదప కుమార్తెకు పెండ్లి చేయవలెను. ఏకోదరులకు ఆరునెలలో పున ర్వివాహము చేయరాదు.కాని ఫాల్గునమందు ఒకరిని మీనేతర చైత్రమాసమందొకరికిని పెండ్లి చేయవచ్చును. అష్టమ శుద్ధిని కూడా చూడవలెను. కూతురుకు, కొడుకుకు ఒకే లగ్నంలో పెండ్లి చేయకూడదు.

4. పెండ్లిపీట - 8ఇంచుల వెడల్పు, 6ఇంచుల ఎత్తు, 37ఇంచుల పొడవూ వుండాలి.

5. గర్భాధానం - ఈ తంతు రాత్రే జరగాలి. లగ్నంలో కాని అష్టమంలో కాని గ్రహాలు వుండరాదు. గురు, చంద్ర, శుక్రులు బలంగా వుండాలి. పంచపర్వాలు, శ్రాద్ధాదినాలు పనికిరావు. వృషభ, కటక, కన్యా, తులా, ధనుర్మీనలగ్నాలు మంచివి. సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు - 2, 3, 5, 7, 10, 13 తిథులు మంచివి. రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం. హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, ధనిష్ఠ, శతభిష తారలు మంచివి. కాని అవి వధూవరులలో ఏ ఒక్కరికి నైధనతార కాకూడదు.

6. నిషేకం- 2, 3, 5, 7, 10 తిథులు సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు లగ్నశుద్ధి గల వృషభ మిథున, కన్యా, తులా, ధనుర్మీనలగ్నాలు - అశ్విని, రోహిణి, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, శతభిషా తారలు శ్రేష్ఠం. సంధ్యా, వ్రత, శ్రాద్ధ పర్వదినములు, పగటివేళలు పనికిరావు.

7. వివాహానికి మృతాశౌచశంక - జ్ఞాతులు మరణించిన 1, సోదరులను పుత్రులను గాని మరణించిన 11 భార్య మరణించినచో 3, తల్లి మరణించిన 6 నెలలు, తండ్రి గతించిన 12 నెలలూ వదలి పెండ్లాడవచ్చును.

8. నవవధువు గృహప్రవేశం - పెండ్లి అయిన ఆరవరోజునుండి 16 వ రోజులోపల గృహప్రవేశము చేసేవారికి తిథివార నక్షత్రాలతో పనిలేదు. అనంతరమైనచో విషమ వర్షమాసాదులు చూసుకోవలెను. వృషభ, మిధున, కటక, సింహ, వృశ్చిక, ధనూ, కుంభ, మీన లగ్నములు మంచివి. ద్వాదశ శుద్ధి చూడాలి. బుధ, గురు, శుక్రవారాలు-అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, మఖ, మూల, పునర్వసు, జ్యేష్ఠ, ధనిష్ఠ, రేవతీ తారలు-2, 3, 5, 7, 10 తిథులు మంచివి.

9. నవవధువు అత్తవారింట ఉండదగనివి - వివాహమైన మొదటి సంవత్సరం క్రొత్త పెండ్లికూతురు అత్తవారింట జ్యేష్ఠంలో వుంటే బావగారికి, పుష్య ఆషాఢలలో వుంటే మామగారికి అధికమాసంలో భర్తకు, క్షయ మాసంలో వధువుకు కీడు.

10. నవవధువు పుట్టింట వుండదగనివి- పెండ్లి అయిన పిదప వచ్చిన తొలి చైత్రమాసంలో క్రొత్తపెండ్లికూతురు పుట్టింట వుండకూడదు. ఉంటే తండ్రికి కాని, కుటుంబ యజమానికి గాని హాని.

11. గాజులు పెట్టుటకు– 5 వ నెలలోగాని, 7వ నెలలోగాని(బేసి నెలలో) పెట్టవలెను.

12. పుంసవన సీమంతములు - 2, 3, 5, 7, 10, 13, 15 తిథులు - బుధ, గురు, శుక్రవారములు - రోహిణి, హస్త, చిత్త, స్వాతి, పుష్య, ఉత్తరాత్రయం, పునర్వసు, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిష, రేవతీ తారలు - మేష, మిధున, ధనూ, కుంభ, తులా లగ్నములు మంచివి. 3 వ మాసము పుంసవనము చేయుటకు, సీమంతమునకు 4, 6, 8, నెలలు మంచివి.

43. మహిళలు శుభాశుభ ముహూర్తములు

ప్రథమ రజస్వలా విషయములు

1.శుభతారలు - ఈ విషయంలో నక్షత్రబలమునకు పట్టు యెక్కువ. దోష నక్షత్రమైనచో అధికశాంతి చేయించవలెను. అశ్విని, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పుష్య, ఉత్తరాత్రయం, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ధనిష్ఠ, శతభిష, శ్రవణ, రేవతి మంచివి. భర్తయొక్క జన్మ నక్షత్రము అమితహాని, వివాహాలకు వరుని జన్మతారను వధువు ప్రథమ రజస్వలా తారనూ పరిశీలించి తీరవలెను.

2. శుభ తిథులు- 3, 5, 7, 10, 11, 13, 15 శుభం. తక్కినవాటికి శాంతి.

3. శుభవారములు - గురు, శుక్ర, మంచివి. సోమవారం, బుధ, సామాన్య శాంతి. ఆది, మంగళ, శని వారములు అధిక శాంతి.

4. శుభ లగ్నములు- వృషభ, మిథున, కటక, కన్యా, తులా, ధనూ, మీనలగ్నములు మంచివి. తక్కినవి చెడ్డవి. అయినప్పటికీ లగ్నము శుభయుతమైనచో సామాన్య శాంతి చాలును.

5. వేళావిశేషములు- - ప్రాతఃకాలము చిరసౌభాగ్యము, ఉషర్వేళ సౌభాగ్యలోపం. పూర్వాహ్నం పుణ్యక్షేత్ర దర్శనం, మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగుణం - సంధ్యలు చెడు ప్రవర్తన, అర్ధరాత్రి బాల్యవైధవ్యం, సమయాన్ని బట్టి శాంతులు జరపాలి.

6. రాత్రిశంక - అర్ధరాత్రి తరువాత, రజస్వల, జన్మములు, మృతులు, బహిష్టులు, సంభవిస్తే రజస్వలయైనచో ఆ రాత్రిని 3 భాగాలుగా చేయగా తొలి రెండు భాగాలు పూర్వదినము, మలిభాగము పరదినముగను లెక్కించాలి.

7. దుస్తులు - చిరుగుల్లేనివీ, మంచివీ, శుభ్రమైనవీ, గట్టివీయైన వస్త్రాల్లో ప్రథమ రజస్వలయగుటక్షేమం.దుస్తుల రంగులను బట్టి ఫలితములు వేరుగాయుండును. తెల్లటి వస్త్రములు సర్వశుభప్రదములు.

8. తరువాత శాంతి వచనములు - ప్రథమ రజస్వలయందు తిథివార నక్షత్ర వర్జ్య దుర్ముహూర్త లగ్న-పాపగ్రహవీక్షణ దోషములున్నయెడల స్నానాంతరం జన్మనక్షత్ర జపము సంపూర్ణ నవగ్రహశాంతి గౌరీదేవికి సహస్రనామ కుంకుమార్చన చేయించి ఎరుపు వస్త్రం దానమీయవలెను. యథాశక్తి అన్నశాంతి చాలా యోగప్రదము.

9. నూతన వస్త్రాభరణములు ధరించుటకు - బుధ, గురు, శుక్రవారాలు మంచివి. మంగళవారం కీడు, అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉ.షా, శ్రవణ, ధనిష్ట, రేవతి తారలు మంచివి. చెడ్డ నక్షత్రములున్న రోజున మంగళవారం నాడు క్రొత్తబట్టలూ, నగలూ ధరించకూడదు.

44. పురిటి విషయములు

1. పురిటికి తెచ్చుటకు - 7 లేదా 9వ నెలలో తేవలెను.

2. పురిటివిధి - తొలి రెండు పురుళ్ళు పుట్టింట 3వ పురుడు అత్తింట పోయవలెను. 3వ పురుడు పుట్టింట పోసినచో శిశుహాని.

3. బాలింతరాలి పథ్యమునకు - 2, 3, 5, 7, 9, 10, , 11, 13, 15 తిథులు రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిష, రేవతి, ఉత్తరాత్రయ తారలు - బుధ, గురు, శుక్రవారాలు మంచివి. పథ్యలగ్నమునుండి పదవయింట పాపగ్రహముగాని, వీక్షణగాని లేకుండా చూడవలెను.

4. బాలింత స్నానం - పురుడయిన 11వ నాడే చేయించవలెను. ఒకవేళ అట్లు కుదరని యెడల ఆది, మంగళ, గురువారాలు అశ్విని, రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, రేవతీ తారలు మంచివి.

5. శిశువును ఉయ్యాలలో వేయుటకు - జననాది 21వ రోజు, 1, 3, 5 నెలల్లో ధనుర్మీనలగ్నములలో శిశువు యొక్క శిరస్సు తూర్పు దిశ నుండునట్లుగా తొట్టెలో పరుండబెట్టవలెను. ఇందుకు సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10 తిథులు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, అనూరాధ, రేవతి, ఉత్తరాత్రయ తారలు మేలు.

6. పురిటి శిశువు గృహాంతరము చేర్చుటకు- - 1, 2, 3, 5, 7, 10, 11, 12, 13, 15 తిథులలో అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, అనూరాధ, రేవతీ తారలలో చంద్రబలము బాగుగానున్నప్పుడు బుధ, గురు, శుక్రవారాలలో శుభగ్రహ వీక్షణములలో వున్న కన్య, కుంభ, తుల, మకర, వృశ్చిక లగ్నములు శుభము.

45. బిడ్డల విషయమై శుభాశుభములు

1. నామకరణమునకు - సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 11, 13 తిథులు - అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్య, మఖ, హస్త, స్వాతి, చిత్త, అనూరాధ, శతభిష, ఉత్తరాత్రయతారలు, అష్టమశుద్ధి గల వృషభ, సింహ, వృశ్చిక, కుంభలగ్నములు మంచివి. బిడ్డ పుట్టిన 11, 21, 29 దినములలో గాని 3వ నెలలో గాని పేరు పెట్టవలెను.

2. కేశఖండనం - 2, 3, 5, 7, 10, 13 తిథులూ, సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు, అశ్విని, మృగశిర, పుష్య, శ్రవణ, ధనిష్ఠ, శతభిషా తారలు మంచివి. స్త్రీ, శిశువులకు బేసిమాసము, మగబిడ్డలకు సరిమాసము మేలు.

3. ముక్కు చెవులు కుట్టుటకు - 6, 7, 8 నెలలో శుక్లపక్షములో అష్టమశుద్ధీ గురుబలమూ వున్న వృషభ, మిథున, కర్కాటక, కన్య, ధనుర్మీనలగ్నములలో పగటిపూట జరుపవలెను. భరణి, కృత్తిక, ఆరుద్ర, ఆశ్రేష, మఖ, పూర్వాత్రయం, వి.జ్యే. మూలా అనే 11 తారలు తప్ప తక్కినవన్నీ మంచివే. సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 13 తిథులూ శ్రేష్ఠమైనవి.

4.అన్నప్రాశనము - మగబిడ్డలకు 6, 8, 10, 12 నెలలోనూ, స్త్రీ శిశువులకు 7, 9, 11 నెలలోనూ లగ్నశుద్ధీ దశమశుద్ధీ కలిగిన వృషభ, మిథున, కర్కాటక, కన్యా, ధనుస్సు, మీనలగ్నములో మాత్రమే చేయవలెను. అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిష, రేవతి, ఉత్తరాత్రయం - ఈ 15 తారలు మాత్రమే మంచివి. 2, 3, 5, 7, 10 తిథులు సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు శ్రేష్ఠములు. ఈ తంతు మధ్యాహ్నం 12 గంటలలోపలనే జరిపించవలెను.

5. ఉపనయనము - మూఢము, దక్షిణాయనము పనికిరావు. అనాధ్యయన రహితమైన 2, 3, 5, 7, 10 తిథులు అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, ఉత్తరాత్రయము, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతీ తారలు మంచివి. తల్లిదండ్రులకు తారాబలము, చంద్రబలము ప్రధానంగా చూడాలి. లగ్నానికి కేంద్రంలో పాపులుగాని, చతుర్ధంలో రవిగాని అస్సలు పనికిరావు. అష్టమశుద్ధి వుండి తీరాలి.

6. దత్తత స్వీకారం- 2, 3, 5, 7, 10 తిథులు శుక్లపక్ష 11, 13 మంచివి. బుధ, గురు, శుక్రవారాలు శ్రేష్ఠం. రోహిణి, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, రేవతీ తారలు మంచివి. లగ్నంలో శుభగ్రహాలు వుండాలి. లేదా లగ్నం శుద్ధిగా, శుభగ్రహ వీక్షణతో, ముఖ్యంగా లగ్నమునుండి పంచమంలో పాపగ్రహాలు కాని, వారి వీక్షణగాని ఉండకూడదు.

46. బాలారిష్ట దోషములు - భంగములు

• జన్మలగ్నమురీత్యా చంద్ర 8, కుజ 7, రాహు 9, శని 1, గురు 3, రవి 5, శుక్ర 6, బుధుడు 4, కేతు 11, ఈ స్థానములందున్న బాలారిష్టము అనబడును. శిశుజన్మ లగ్నాధిపతి బలవంతుడు కాకున్నను, కేంద్రములందు పాపులున్నను,

• పాపగ్రహములు లగ్నమును చూచుచున్ననూ, క్షీణచంద్రుడు వ్యయమందున్నను దోషములు కనబడును. శిశుజన్మ లగ్నాధిపతి బలవంతుడయిననూ, కేంద్రములందు శుభగ్రహము లుండినను, ఏ శుభగ్రహము లగ్నమును చూచుచుండిననూ బాలారిష్ట దోష భంగము కలిగి దీర్ఘాయుష్యము కలుగును.

• శిశువు జన్మించిన తర్వాత జనన కాల శుభపత్రిక వ్రాయించుకొనవచ్చును. కానీ జాతక చక్రములు, జాతకములు 3 సంవత్సరములలోపు వ్రాయించరాదు.

47. విద్యా శుభవిషయములు

• విద్యారంభ విషయములకు (6) సాధనతార ప్రశస్తము.

• అక్షారాభ్యాసము- బిడ్డ 5 సం।।రాల (5నెలల 5రోజుల) వయసులో వుండగా, ఉత్తరాయణంలో గురు, శుక్రమౌఢ్యములు లేనప్పుడు అనధ్యాయ రహితంగా చూసి, అష్టమశుద్ధి గల మేష, కటక, తులా, మకర లగ్నాలలో ఉదయకాలమునందే జరిపించాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి 3వ సం।।లో జరుగుచున్నది.

• విజయదశమి, అక్షయతదియరోజులందు జరిపించవచ్చని కొందరి అభిప్రాయము. 2, 3, 5, 7, 10, 13, తిథులు సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, రేవతీ తారలూ మంచివి.

• వేదవిద్యారంభమునకు- 1, 4, 8, 9, 14, 15 తిథులు పనికి రావు. 7, 13, మధ్యమము. తక్కిన తిథులలో గురుపాదులు నిర్ణయించిన తిథినాడు అశ్విని, రోహిణి, ఆర్ధ్ర, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, మూల, శ్రవణ, రేవతీ తారలున్నప్పుడు ద్విస్వభావ రాశులు లగ్నమైతే శుభం.

• సంగీత నాట్యములకు వాద్యములకు - సోమవారం, బుధ, గురు, శుక్రవారములు 3, 5, 7, 10, 13, 15 తిథులు ఉత్తరాత్రయం, హస్త, అనూరాధ, పుష్య, హస్త, జ్యేష్ఠ, శతభిష, ఆర్ధ్ర, ధనిష్ట, రేవతీ తారలు మంచివి.

48. వ్యాపారములకు శుభాశుభములు

1. సాధారణముగా వర్తకమునకు - 4, 9, 14 తిథులు మంగళవారం, కుంభలగ్నం పనికిరావు. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, అనూరాధ, రేవతీ నక్షత్రములు శుక్రవారం చంద్రుడు లగ్నాధిపతిగా వుండి 3 - 11 స్థానాలలో పాపగ్రహాలు-పాపవీక్షణలు లేని శుభ లగ్నంలో ప్రారంభించాలి. కాని కొన్ని రకాల వ్యాపారాలకు కొన్ని ప్రత్యేక శుభవేళలుంటాయి. అవి దిగువ యిస్తున్నాము.

2. బట్టల షాపులు - 2, 3, 5, 7, 10 తిథులు - ఆది, బుధ, గురు, శుక్రవారాలు- అశ్విని, రోహిణి, పునర్వసు, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, రేవతీ తారలు శ్రేష్ఠము.

3. పండ్ల వ్యాపారములకు - 2, 3, 5, 7, 10 తిథులు, సోమవారం, బుధ, గుర, శుక్రవారాలు- అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరాత్రయం, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతీ తారలు శ్రేయస్కరము.

4. వెండి బంగారు షాపులకు - 2, 3, 5, 7, 10 తిథులు సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు- అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరాత్రయం, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతీ తారలును శ్రేయస్కరములు.

5. పుస్తకములు, స్టేషినరీ - 2, 3, 5, 7, 10 తిథులను సోమవారం, బుధ, గురు, శుక్రవారాలును- రోహిణి, మృగశిర, హస్త, స్వాతి, అనూరాధ, ఉ.షాఢ, శ్రవణ, శతభిష, పూర్వాభాద్ర, రేవతీ తారలు ఉత్తమోత్తమములు.

6. రైసు మిల్లులకు - 2, 3, 5, 7, 10 తిథులు సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, ఉత్తరాత్రయం, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, రేవతీ తారలు చతుర్థాష్టమశుద్ధిగల స్థిరలగ్నములూ లాభం.

7.హోటల్స్ - 2, 3, 5, 7, 10, 11 తిథులూ సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, మఖ, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిష, రేవతీ తారలు తృతీయశుద్ధిగల శుభలగ్నమూ ఉత్తమం.

8.చిట్ ఫండ్స్- 2, 3, 5, 7, 10 తిథులు, బుధ, గురువారాలు అశ్విని, రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం, స్వాతి, అనూరాధ, శ్రవణ, రేవతీ తారలు సప్తమమందు బలీయమైన శుభగ్రహమున్న వృషభ, మిథున, కటక, తులా, ధను, మీనలగ్నాలు శ్రేష్ఠము.

9. సినిమా వ్యాపారములకు (ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్) - 2, 3, 5, 7, 10, 11, 13, 15 తిథులు, సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తర, స్వాతి, అనూరాధ, ఉ.భాద్ర, రేవతీ తారలునూ సప్తమశుద్ధి కలిగి, శుక్రుడు బలముగావున్న లగ్నమందును లాభము, శనిబలముగా వుండవలెనని మరొక మతము.

10. మోటారు వాహనాల వ్యాపారమునకు - 2, 3, 5, 7, 10 తిథులు, సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణ, శతభిష, ఉ.భా, రేవతీ, ధనిష్ట నక్షత్రములు శుభతారలు చూడవలెను.

49. గృహోపయోగ విషయ శుభాశుభములు

1. బంగారం, వెండి, స్టీలు పాత్రలు వాడుటకు - బుధ, గురు, శుక్రవారాలు-అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, శతభిష, రేవతి తారలుండగా-అమృతయోగ ఘడియలలో భుజించుట ఆరంభించవలెను.

2. క్రొత్తవాహనములు వాడుట ప్రారంభించుటకు - 2, 3, 5, 7, 10 శు -11, 13 తిథులును, సోమవారం, బుధ, గురు శుక్రవారాలు - రోహిణి, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, శ్రవణ, రేవతీ తారలు-అష్టమశుద్ధిగల వృషభ, మిధున, కటక, కన్యా, తులా, ధనుర్మీనలగ్నాలు మంచివి. బుధహోర ప్రశస్తంగా చెప్పబడినది.

3.గ్యాస్ స్టౌ, ఫ్రిజ్, మిక్సీలవంటి ఆధునిక పరికరాల వాడకం మొదలుపెట్టుటకు-

2, 3, 5, 7, 10, 11, 13 తిథులూ మంగళ, బుధ, గురు, శుక్రవారాలు వర్జ్య, దుర్మూహుర్తాలు లేని కుజహోరలో మంచివి.

4. ఇండ్లు, స్థలములు, భూమి కొనుటకు, అమ్ముటకు- 1, 5, 6, 10, 11 తిథులు మృగశిర, పునర్వసు, ఆశ్రేష, మఖ, పూర్వాత్రయం, విశాఖా, అనూరాధ, మూల, రేవతీ తారలు మంచివి. పూర్ణ తిథులగుట మంచిది. కొనుటకు గురు, శుక్రవారాలు అమ్ముటకు బుధ, గురువారాలు.

5. ఇతర వస్తువులు కొనుటకు - అశ్విని, చిత్ర, స్వాతి, శ్రవణ, శతభిష, రేవతి ఈ నక్షత్రములతో కూడిన గురువారం సర్వశ్రేష్ఠం. ఇతర తారలు ఆశ్శ్రేయాలు.

50. తలంటు, నేత నూతన వస్త్రధారణలకు ఫలములు

వారములు తలంటు మంచంనేత వస్త్రధారణ
ఆది సంతానం ధనలాభం చిరుగుట
సోమవారం శాంతి సౌఖ్యం చింతన
మంగళ అల్పాయువు దుఃఖం శుభహాని
బుధ ధనలాభం పీడ ధనప్రాప్తి
గురు ధననష్టం పీడ ధనప్రాప్తి
శుక్ర సౌఖ్యహాని రాజ్యలాభం మిత్రప్రాప్తి
శని సర్వలాభం నాశనం మాలిన్యత

51. పశు, మత్స్య మరియు వ్యవసాయ సంబంధ విషయములు

1. పశుశాల వేయుటకు - 2, 3, 5, 7, 10, 11, 13 తిథులూ, సోమవారం, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, మృగశిర పుష్యమి, హస్త, మూల, పూర్వాభాద్ర నక్షత్రములును మంచివి. పుష్యమీ నక్షత్రమున్న గురువారం నాడు వృషభలగ్న మందలి, వృషభనవాంశలో పశువులశాల వేసినచో విశేష శ్రేయస్సు కలుగును.

2. పశువులను కొనుటకు - బుధ, గురు, శుక్రవారాలును, అశ్విని, పునర్వసు, పుష్య, హస్త, విశాఖ, జ్యేష్ఠ, పూ.షా, ధనిష్ఠ, పూ.భా, రేవతీ తారలు మంచివి.

3. పశువులను అమ్ముటకు -అశ్విని, మృగశిర, ఆశ్లేష, మఖ, పూర్వాత్రయం, విశాఖ, జ్యేష్ఠ, ధనిష్ఠ, రేవతీ తారలు, సోమవారం, బుధ, గురు, శనివారాలు క్షేమము.

4. పడవ నీటిలో దింపుటకు -2, 3, 5, 7, 10, 11, 13 బహుళ పాడ్యమీ తిథులను, సోమవారం, బుధ, గురు, శుక్రవారాలును, అశ్విని, మృగశిర, హస్త, చిత్త, స్వాతి, మూల, ఆశ్రేష, మఖ, పూర్వాత్రయం, రేవతి, విశాఖ తారలునూ, మేష, మిథున, కటక, తులా, మకర, మీన లగ్నములును యోగ్యములు.

5. వలను నీటిలో తడుపుటకు - 1, 5, 7, 10, 11, 15 తిథులు, సోమవారం, బుధవారాలు అశ్విని, రోహిణి, స్వాతి, శ్రవణ, అనూరాధ, పుష్య, జ్యేష్ఠ, హస్త, పునర్వసు, ఉత్తర, శతభిష, మూల తారలు లాభకరమైనవి.

6. క్రొత్త భూమిలో వ్యవసాయమునకు ప్రవేశించుటకు - ఆది, మంగళ, బుధ, శుక్రవారాలు శ్రేష్ఠము. సోమవారం వారం మధ్యమము. అశ్విని, రోహిణి, మఖ, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ధనిష్ట, రేవతీ తారలు మంచివి.

7. ఏరువాక దుక్కిదున్నుట - శుభతిథులు ఆది, మంగళ, గురు, శుక్రవారాలు శ్రేష్ఠము. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, మఖ, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉ.షాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, ఉ.భా, రేవతీతారలూ-వృషభ, మిథున, కన్యా, ధనుర్వృశ్చిక లగ్నములు మంచివి. మేష, కటక, సింహ, తులా, మకర, కుంభములు హాని.

8. విత్తనములు చల్లుటకు - చల్లబోయెడి విత్తనముల రంగునుబట్టి ఆ రంగు ఏ గ్రహముదో ఆ గ్రహవారములో చల్లుట మంచిది. మొత్తముమీద అన్ని విత్తనములకునూ భరణి, కృత్తిక, ఆరుద్ర, పునర్వసు, ఆశ్రేష, పూర్వాత్రయం, విశాఖ, జ్యేష్ఠతారలు, తప్ప తక్కిన నక్షత్రములతో కూడిన బుధ, గురు, శుక్రవారాలు శ్రేష్ఠము. వీనికి కూడా ఏరువాకలగ్నములో మంచిది.

9. వరి ఆకు ఊడ్చుటకు - మొలకపై ఊడ్చుటకు 4-9-14 తిథులు, రేవతి, ధనిష్ట, మూల, అనూరాధ, స్వాతి, చిత్త, హస్త, ఉత్తర, మఖ, పుష్య, మృగశిర, రోహిణి, అశ్వినీ తారలు, సోమవారం, బుధ, గురు శుక్రవారాలు మంచివి.

10.అరటి మామిడి తోటలకు - అశ్విని, పుష్య, మఖ, ఉత్తరాత్రయం, అనూరాధ, రేవతీ తారలు 3, 5, 8, 10, 13, 15 తిథులు బుధ, గురు, శుక్రవారాలలో మేష, వృశ్చిక, కన్యా, వృషభ లగ్నములు మంచివి.

11. చెఱుకు తోటకు - రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం, చిత్త, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, రేవతీ, శతభిష మరియు కర్తరీ దోషములేని పుష్యమీతారలును- సోమవారం, బుధ, గురు, శుక్రవారాలును, శుక్లపక్షమందలి 5-7-10 తిథులును - తులా, ధనుర్మీన, వృశ్చిక, మిథున లగ్నములును మంచివి.

52. జాత - శౌచాదిక విషయములు

• నెలపురుడు - మగశిశు జననం మొదలు 30రోజులు స్త్రీ జననం మొదలు 40రోజులు నెల పురుడు పట్టవలెను. శిశువుకు దంతములు రాకుండానే మృతిచెందితే తల్లిదండ్రులకి ఒకనెల అశౌచం, జ్ఞాతులకి స్నానంతో శుద్ధి,

• దంతములు వచ్చిన తర్వాత 3 సంవత్సరముల లోపున మరణిస్తే తల్లిదండ్రులకు 11రోజులు, జ్ఞాతులకు 1రోజు అశౌచం, తదాది విప్రులలో ఉపనయనమయ్యే లోపుగాని-ఇతరులలో బిడ్డ గడికట్టే లోపలగాని అశుభం జరిగితే అందరికి 3రోజులే అశౌచం. ఉపనయనమైన పిదప మరణిస్తే పక్షిణీదార్లకు స్నానమాత్రశుద్ధి, తల్లిదండ్రులకూ జ్ఞాతులకూ 11రోజులు అశౌచం.

• 2. పక్షిణీదార్లు - పినతల్లులు, పెదతల్లులు, మేనమామలు, వీరి సంతానం, స్త్రీ, పురుషులు, మేనత్త వారి సంతానం, తల్లితల్లి, పినతండ్రి, పెదతండ్రి, వీరి సంతతి, అన్నదమ్ములు, వీరి స్త్రీపురుష సంతానములు.(కుమార్తెలు, అల్లుండ్రు, కుమార్తెల సంతానం, స్త్రీపురుషులు, అక్కచెల్లెండ్రు, వీరి సంతానము, స్త్రీపురుషులకు, పురుషులకు అక్కచెల్లెండ్ర భర్తలకు, భార్యకు సోదరులును, అత్తమామలు -వీరు పక్షిణీదారులు. పురుషులకు జనక తండ్రులు, దత్తుడు, అక్కచెల్లెళ్ళు, వారి భర్తలు, భార్య సోదరుడు, అత్తమామలు పోయినచో 3రోజులు పక్షిణి పట్టవలెను.

• స్త్రీకి సవతి తల్లి, సవతి సోదరి సోదరులకు పక్షిణి పట్టుట కొంత ఆచారమున్నది. దత్తునికి కన్నవారూ-కన్నవారికి దత్తుడూ కూడ పక్షిణీదారులే) పోయిన 3రోజులలోపు తెలిసినచో 4వరోజు శుద్ధి, 4 నుండి 10 రోజులలోపు తెలిసినచో 1 పగలు, 1 రాత్రి (90 ఘడియలు) పక్షిణి పట్టవలెను.

• ఒక మైలలో మైల కలసిన, మొదటి దానితోనే శుద్ధి అగును. రజస్వలకాని బాలిక మరణిస్తే కేవలం స్నానశుద్ధి. వివాహితయైన స్త్రీ మరణిస్తే పక్షిణీదారులు కూడా మైలపట్టి తీరాలి.

• పక్షిణీదార్లు కానివారు - స్త్రీలకు పినతండ్రి, పెదతండ్రి భార్యలు, భర్తకు సోదరుని కుమార్తెలు, అన్నదమ్ముల భార్యలు, అక్కచెల్లెండ్ర భర్తలు, మేనమామ భార్యలు వీరికి పక్షిణిలేదు. మరియు దత్తునికి జనక తల్లిదండ్రులు మాత్రము, జనక తల్లిదండ్రులకు, దత్త కుమారుడు-వీరికి పక్షిణీ కలదు.(ఇది ఆచారసిద్ధము). ఇట్లే సవతితల్లి, సవతి సోదరి, సోదరులు-వీరికి పక్షిణి ఆచరించవలెను.

• ఏకజాతీయాశౌచము - ముందుగా వినిన అశౌచముతో తరువాత వినిన అశౌచము కలసిపోవును.కాని 10వరోజున పట్టవలసిన అశౌచము 3రోజులలో కలవదు.

• .స్వీయజాతాశౌచము - తల్లిదండ్రులకి మృతాశౌచము విధిగా పాటించవలెను. ఇది ఎందులోనూ లీనమవదు. ఈ అశౌచము ముందు సర్వాశౌచములూ నశించిపోవును.

• 7. సూతకాదుల ప్రారంభ నిర్ణయము- జాతశౌచ, మృతాశౌచ, రజస్వలాదులు రాత్రి జరిగినచో -రాత్రి కాలమునకు 3 భాగాలు చేసి, తొలి 2 భాగలందైన పూర్వదినముగను -3భాగాలయందైన పరదినముగను పరిగణించాలి. తల్లిదండ్రుల మృతికి 1సం।।ము సూతకము. తానే కర్తయైన - సవతి తల్లి మృతికి 6 నెలలు సూతకము. స్వభార్యమృతికి 3 నెలలు సూతకము. ఇతరుల మృతియందు సూతకము సూచింపబడలేదు.

• తర్పణ క్రమము - ముందుగా తల్లిదండ్రులకీ, సవతితల్లి, తల్లితండ్రి, తండ్రితండ్రి, ముత్తాతలు, భార్య, పుత్రులు, పినతండ్రి, పెత్తండ్రులు, మేనమామ, కూతురు, బావలు, మరదులు, అత్తమామలు, విద్యాగురువు, సద్గురువు, ప్రభువు, స్నేహితుడు. ఈ క్రమంలో తర్పణమీయాలి. మాతా మహ్యాదులను పితామహ్యాదులతో కలపక విడిగా తర్పణములీయీలి. భార్యలు పోయినవారికి సభార్యాణాం అనియు, బిడ్డలు పోయినవారికి ససంతతేః అని భర్తృహీనులకు సభర్తృణాం అనీ సగోత్రముగా తర్పణమీయవలెను. (సవతి తల్లికి వలెనే-సాపత్న్య సోదరులుకు కూడా.

53. తిథి నిర్ణయము - (ఆబ్దికములకై)

• సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము, 2.సంగవకాలము, 3. మధ్యాహ్నకాలము, 4.అపరాహ్ణకాలము, 5.సాయంకాలము.

• ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా, వ్రత, శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము.

• ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం.

• ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు, లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను.

54. మూర్తి నిర్ణయము

జన్మరాశికి గ్రహ ప్రవేశకాలమున చంద్రుడు ఎన్నవ రాశిలో ఉన్నాడో దానిని బట్టి మూర్తిమంతయు నిర్ణయించవలెను.

1. 6, 11 రాశులైన సువర్ణమూర్తి = సర్వసౌఖ్యములనిచ్చును

2. 2, 5, 9 రాశులైన రజతమూర్తి = సౌభాగ్యమునిచ్చును

3. 3, 7, 10 రాశులైన తామ్రమూర్తి = సామాన్యముగా నుండును.

4. 4, 8, 12 రాశులైన లోహమూర్తి = ధనహాని కలుగును.

55. మృత విషయమై గృహవర్జన

• 1, 4, 6, 8, 9, 12, 14, 30 తిథులు, ఆది, మంగళ, శుక్రవారాలు దోషములు. చిత్త, మృగశిరా నక్షత్రములందలి మృతి విషయమై 3 నెలలు కృత్తిక, ఉత్తర, ఉ.షా, విశాఖా, పునర్వసులందైనచో 4 నెలలు,

• రోహిణి, మఘ, ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్ర, ఉ.భా, రేవతులందైనచో 6 నెలలు, భరణి నక్షత్రమైన 1 నెల- ఆగృహమును విసర్జించవలెను.

• చెడుతిథి, చెడువారము అయి-నక్షత్రము బాగున్నచో 7 అర్థదోషమగును. తిథి వారములతో నక్షత్రము కలిసినచో పూర్ణదోషము. తిథికంటే వారదోషం ఎక్కువ.

• శుక్రవారముకంటె మంగళవారం కీడు కల్గించును. ఈ వారములతో ద్వి-త్రిపాద-ధనిష్ఠ పంచక నక్షత్రములు కలసినచో ఒక మరణముతో మరొక మరణము సూచ్యము. కాన గృహమును విసర్జించుట మంచిది.

56. ఏకోదర సంస్కార నిర్ణయము

• అన్నదమ్ములకు ఒకేరీతి సంస్కారములు ఒకేసారి చేయకూడదు. కనీసము ఆరు మాసముల వ్యవధి ఉండవలెను. తప్పనిసరైన సంవత్సరాది పండుగకు ముందు ఒకరికి, తరువాత ఒకరికి చేయుట ఆచారము కలదు.

• అన్నా చెల్లెళ్ళకు, ఒకే సంస్కారము అక్కచెల్లెళ్ళకు ఒకేసారి చేయవచ్చును. కన్యాదానము చేసిన తదుపరి, కన్యను తెచ్చుకోవలయును.

• తన పుత్రికను ఇచ్చిన ఇంటిలో తన కుమారునికి కన్యను తేకూడదు. మొదట ఇవ్వబడిన పుత్రిక జీవించి ఉండగా మరలా పుత్రికను ఇవ్వకూడదు.

• జ్యేష్ఠపుత్రికా పుత్రులను విడిచి తదుపరి సంతానమునకు సంస్కారము చేయకూడదు.

57. ఏకవింశతి మహాదోషములు - అపవాదములు

1. పంచాంగశుద్ధిహీన - ఏష్యము, దుష్టగ్రహవేధ, క్రాంతులు, వైప్రా, అనుదోషములు గల రోజులు కాని బుధ, గురులు బలముగా నున్నచో దోషములు లేదు.

2. సూర్య సంక్రాంతి - రవి ప్రవేశమునకు 19 ఘడియలు ముందు వెనుకలు, మేష, కర్కాటక, తులా, మకర, సంక్రమణములకు ఆయన ప్రవేశములకు 30 ఘడియలుముందు వెనుకలు దోషము.

3. పాపషడ్వర్గలు - లగ్న, హోర, ద్రేక్కాణ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశల యందు పాపగ్రహములు లేకుండుట.

4. భృగుషట్కం - ఉచ్చంగతుడైన శుక్రుడు 6వ యింట ఉండకూడదు. శత్రునీచ స్థానములో అస్తంగతుడైన దోషము లేదు అని కొందరందురు. కాని, ప్రమాణములు కానరావు.

5. అష్టమకుజ - 8వ యింట కుజుడు ఉచ్చస్తుడైను కాకున్నను దోషమే శత్రునీచ అస్తంగతుడైన దోషము లేదు.

6. గండాంతము - 10 ఘ।।ల మధ్యమ 4-9 మధ్యమ 10-11 మధ్యమ 4ఘ।।లు తిథి గండదోషము. ఆశ్రేష, మఘ, జ్యేష్ట, మూల, రేవతి, అశ్వినుల మధ్య 4 ఘ నక్షత్ర గండదోషము. నంద తిథులకు ప్రారంభమున 2 ఘడియలు, పూర్ణ తిథులకు అంత్యమున 2 ఘడియలు గండాంతములగును.

7. రాశిగండదోషము -కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మేష, మీన రాశుల మధ్య 4ఘడియలుచంద్ర గురులు శుభులైనచో ఈ దోషము బాధించదు.

8. కర్తరీ - లగ్నమునుండి 2వ యింట వక్రగ్రహము 12వ యింట ఋజుగ్రహము, సమభాగములనున్న దోషము. 1, 4, 5, 7, 9, 10, 11వ యింట బుధ, గురు, శుక్రులున్న దోషము లేదు. ఈ కర్తరులందు గృహనిర్మాణాది పనులు చేయరాదు. తదితర వివాహాది శుభముహూర్తములకు ఈ కర్తరీ దోషముతో సంబంధం లేదు.

9. రిఃఫషష్ఠాష్టమ, సగ్రహచంద్ర - చంద్రుడు 6, 8, 12వ యింట జన్మలగ్న నక్షత్ర లగ్నములకు 8వ లగ్నము, 8వ యింట చంద్రుడున్నను అష్టమాధిపతి లగ్నమందున్నను దోషము. ఆయా 8 స్థానములు శుభగ్రహ వీక్షణ పరస్పర మైత్రులు కలిగినచో దోషము లేదు.

11. అష్టమచంద్ర - అష్టమచంద్రుడైనచో, ఆ చంద్రుడు నీచ నవాంశగతుడైనచో దోషము లేదు.

12. వర్జ్య, దుర్ముహూర్తదోషములు - పంచాంగంలో వ్రాసిన వర్జ్య దుర్ముహూర్తకాలములు పనికిరావు.

13 కుళికా - ఆదివారం 1, సోమవారం 2, మంగళ 12, బుధ 11, 3 శుక్ర, 7శని, 15 ఘడియలుతరువాత 4 ఘ।।కు కుళికాదోషము. లగ్నమునుండి చంద్రుడు 3, 4, 5, 7, 9, 10 స్థానములతో నున్న శుభప్రదము.

14. ఖర్జూరయోగము - 1. పంచశలాక, సప్తశలాక, ఖర్జూర చక్రములందు (అభిజిత్తుతో) వ్రాసిన నక్షత్రములు ఒక రేఖపై గలవి వేధించబడును. 2. క్రూర గ్రహమునకు ముందు వెనుక నున్నవి. వేధానక్షత్రములు క్రూరాక్రాంత గలవి.

15. ఏకార్గళ - దుష్టయోగములైన, 1.వ్యాఘా-పున, 2. శూల-మృగ, 3. పరిఘ-మఘ, 4. వ్యతీ-ఆశ్రే, 5. నిష్కం-అశ్విని, 6. గండ-మూల, 7. అతిగండ-అనూరాధ, 8.వజ్ర-పుష్య, 9.వైధృ-చిత్ర మొ।।గాగల నక్షత్రములు మొదటి రేఖపై నున్నచో ఏకార్గళ దోషము. సూర్య చంద్ర నక్షత్రములు 1-4, 4-1, 2-3 పా।।కానిచో దోషము లేదు.

16. ఉత్పాత - భూకంపములు, తోకచుక్కలు, మొదలగునవి ఉత్పాత అనబడును. దాని నుండి 7 రోజుల వరకు దోషము.

17. గ్రహణ - గ్రహణములు సంభవించిన నక్షత్రములు ఆ పిదప 7 రోజుల వరకు దోషము. అర్ధగ్రాస గ్రహణమైన 3రోజులు మాత్రమే వదలవలెను. ఏ నక్షత్రమున గ్రహణము పట్టునో ఆ నక్షత్రము ఆరు మాసముల వరకు ముహూర్తములకు పనికి రాదు.

18.క్రూరగ్రహ వేధ - పాప గ్రహ, ప్రవేశ వర్జ్యరాశులు పనికి రానివి. ఆ రాశులు శుభగ్రహయుక్తమైనపుడు శుభప్రదము.

19. అశుభ విబద్ధ నక్షత్రములు - పంచాంగములోని రవే, రాక్రాం, రావే, కుక్రాం, కువే, శక్రాం, శవే మొదలైననక్షత్రములు దోషములు.

20. క్రూరగ్రహ నవాంశ - లగ్న, నవాంశాధిపతులు, నవాంశులను చూచుచుండినను, లగ్ననవాంశాధిపతులు పరస్పరదృష్టి, లగ్నగతులైనను, శుభ, మిత్ర, దృష్టి కలిగినను శుభప్రదము.

21. మహావ్యతీపాత వైధృతి- శోభ, హర్షణ, శూల, వైధృతి, వ్యతీపాత, గండ అనువాటి చివర భాగములలో సూర్య, చంద్ర కాంతి దోషము కలిగిన వ్యతీపాత దోషము.

మొత్తము మీద పర్యాలోచన చేయగా, లగ్న కేంద్ర, దోషములయందు గురు, శుక్ర బలములున్నచో శుభము. ముహూర్తములకు బలము నిర్ణయించునపుడు లగ్నబలము చూచుట ముఖ్యము.

• నైసర్గిక పాపులైన రవి, కుజ, రాహు, కేతువులు 3, 6, 11 స్థానములందును,

• శుభ గ్రహములైన గురు, శుక్ర, బుధ, చంద్రులు 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానములందుండుట ఉత్తమము. గ్రహములెంత బలముగానున్నను లగ్నబలము లేనిచో ప్రయోజనము లేదు.

• గురువు కేంద్రస్థానమునందు, రవి ఏకాదశములో అన్నచో సమస్తదోషములు పరిహారమవుతాయని శాస్త్రకారులు తెలిపారు.

© Copyright SGS PANCHANGAM. All Rights Reserved