veda@dattapeetham.com

SGS Panchangam

  • Home
  • About
  • Muhurtam
  • Shobhakrut
  • Useful
  • Contact

5. సంవత్సర – ఫలితము

 కలియుగ శతాబ్దములు - 5124

 శ్రీ శంకరాచార్యాబ్దములు - 2095

 విక్రమార్క శతాబ్దములు - 2080

 శాలివాహన శతాబ్దములు - 1945

 హిజరీ శతాబ్దములు - 1943-1944

 శ్రీ రామానుజాబ్దములు - 1006

 నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణాబ్దములు - 09

 తెలంగాణా రాష్ట్ర అవతరణాబ్దములు - 09

 మధ్వాచార్యాబ్దములు - 907

 భారతదేశ స్వతంత్రాబ్దములు - 76

 ఆంగ్ల సంవత్సరము - 2023–2024

ఈ సంవత్సరము రాజు - బుధుడు, మంత్రి – శుక్రుడు, మేఘాధిపతి - శుక్రుడు, సేనాధిపతి - గురుడు. అర్ఘాధిపతి - గురుడు, పూర్వ సస్యాధిపతి – చంద్రుడు. అపర సస్యాధిపతి (ధాన్యాధిపతి) శని, రసాధిపతి – బుధుడు, నీరసాధిపతి – చంద్రుడు. బలరాముడు, గోష్ఠాగార ప్రాపకుడు – శ్రీకృష్ణుడు, గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడు. పశువులపై శ్రద్ధ – పాడిపంటల సమృద్ధి, మొత్తము మూడు కుంచముల వర్షము. మొత్తము 20 భాగములలో సముద్రమందు 8 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమియందు 3 భాగములు వర్షము కురియును. 16 వీసములకు 13 వీసముల పంట లభించును. జలధాన్యములు, నల్లని మాగాణి, మెట్ట పంటలు బాగుగా ఫలించును. జ్యేష్ఠ బహుళమున తొలకరి వర్షములు కురియును. ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగును.

6. కర్తరీ నిర్ణయము

• 05-05-2023 వైశాఖ పూర్ణిమ శుక్రవారం ఉ 6.24 ని।।లకు డొల్లు కర్తరీ ప్రారంభం.

• 11-05-2023 వైశాఖ బహుళ షష్ఠి గురువారము (తెల్లవారితే శుక్రవారం) తె 4.11 ని।।లకు నిజకర్తరీ ప్రారంభం.

• 29-05-2023 జ్యేష్ఠ శుద్ధ దశమి సోమవారము ప 1.21 ని।।లకు నిజకర్తరీ త్యాగము.

7. మౌఢ్య నిర్ణయము

• 29-03-2023 చైత్ర శుద్ధ అష్టమి బుధవారం సా 5.01 ని।।లకు పశ్చాదస్తమిత గురు మౌఢ్యారంభము.

• 25-04-2023 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం సా 5.09 ని।।లకు గురు మౌఢ్య త్యాగము.

• 08-08-2023 అధిక శ్రావణ బహుళ అష్టమి మంగళవారం ప 1.58 ని।।లకు పశ్చాదస్తమిత శుక్ర మౌఢ్యారంభము.

• 18-08-2023 నిజ శ్రావణ శుద్ధ తదియ శుక్రవారం రాత్రి 7.21 ని।।లకు ప్రాగుదిత శుక్రమౌఢ్య త్యాగము.

8. గంగానదీ పుష్కర నిర్ణయము

• 21-04-2023 వైశాఖ శుద్ధ విదియ శుక్రవారం రాత్రి గం. 5.15 ని।।లకు అనగా తెల్లవారితే శనివారం దేవ గురుడు బృహస్పతి తన మిత్ర స్థానమగు మేషరాశి యందు ప్రవేశించుటచే గంగానదికి 22-04-2023వ తేదీ నుండి గంగా నదీ పుష్కరములు ఆరంభమగును.

ఈ రోజు నుండి సార్ధ త్రికోటి దేవతా సహితముగా బృహస్పతి గంగానదిలో నివసింతురు కనుక, స్నాన, దాన, తర్పణ, పిండప్రదానములు చేయుట వలన పితృదేవతలు తరించి, యజమానులకు కుటుంబ వృద్ధి. ప్రతినిత్యం పూజా సమయంలో కలశంలో నీరు ఉంచి,

గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి।
నర్మదే సిన్ధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు।।

అని కలశంలో గంగాజలం సాన్నిధ్యం అనుభవించినంత మాత్రం చేతనే అంటే కలశారాధన చేసే సమయంలో గంగను స్మరించినంత మాత్రం చేతనే పవిత్రత చేకూరుతుందంటే, ఇక శ్రద్ధగా పుష్కర సమయంలో గంగానదిలో పుష్కర తీర్థ విధులు ఆచరించడం వలన ఎంతటి పుణ్యఫలప్రదమైనదో అతిశయోక్తికాదు.

9. శోభకృద్వత్సర ఫలము

సర్వ సస్యములు చక్కగా ఫలించును. రాజులు, ప్రజలు పరస్పర స్నేహము కలిగి వర్తించెదరు. ప్రజాభీష్ట పరిపాలనముండును. గృహములు, ప్రభుత్వ కార్యాలయములు, దేవాలయములు పుష్ప- సుగంధ శోభములతో అలరారుచుండును.

10. సావన వర్షాధిపతి గురుని ఫలము

ఈ సంవత్సరము సర్వ సస్యములకు వర్షములు సమృద్ధిగానుండును. పంటలు బాగుండును. ధరలు తగ్గియుండును. సుభిక్షము, ప్రజలకు సాటిలేని సుఖము, రాజకీయాభివృద్ధి యుండును.

11. సావన వర్షాధిపతి చంద్రుని ఫలము

మేఘములు బాగుగా వర్షించును. క్షేమము సుభిక్షము గీతోత్సవములు కలుగును. ప్రజలు ధర్మమునకు కట్టుబడి యుందురు.

12. మేష సంక్రమణ ఫలము

• 14-04-2023 చైత్ర బహుళ నవమి శుక్రవారం సా 5.04 ని।।లకు రవి మేషరాశి ప్రవేశం. ఈ సంక్రమణ కాలము సాయంకాలము నందు సంభవించుట వలన దేశమున తగురీతిన వర్షములు కురియుననియూ, పగటికాలమందు అగుటచే ధాన్యాదులకు ధరలు పెరుగుట, కలహములను పాలకులు నానా విధములగు సంతోషములను కలవారగుదురని సూచించును. సస్యములు బాగుగా ఫలించును. పాడిపంటల సమృద్ధి ధరలు తగ్గియుండును. సంక్రమణ సమయం రిక్తతిథియగుట వలన పశువులకు రోగములు సూచించును.

13. రవి మేషరాశి ప్రవేశ ఫలము

22-06-2023 ఆషాఢ శుద్ధ పంచమి గురువారం రాత్రి 2.05 ని।।లకు రవి ఆర్ద్రా ప్రవేశం. రాత్రియందు అగుటవలన సుఖమును కలుగజేయును. పంచమి తిథియగుటచే సమస్త జీవకోటి సుఖించును. సస్యానుకూల వృష్టి, పాడిపంటల సమృద్ధి కలుగును. ధాన్యాదుల ధరలు తగ్గును. హర్ష యోగం వలన సంతోషము, మేషలగ్నము శుభం, ఆర్ద్రా ప్రవేశకాలమునకు చంద్రుడు పూర్ణ జలరాశి యందు చంద్రుడు యుండుట వలన అధిక వర్షములు, దుర్మార్గులవలన ప్రజాహాని కలుగును. మలేరియా వంటి దోమకాట్లు మూలముగా ప్రజాహాని అధికమగును.

14. పశుపాలక వర్షాఢక నిర్ణయం

దేశమందంతటనూ సస్యానుకూల వర్షములు కలిగి సస్యములు చక్కగా ఫలించును. మధ్యదేశమందు విశేషముగా సుభిక్షము. పాడిపంటల సమృద్ధి కలుగును. గోష్ఠాగార ప్రాపకుడు శ్రీకృష్ణుడు. గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడు. సమస్త ప్రాణకోటికి వ్యాధులు తొలగి ఆరోగ్యముతో నుండును. గోజాతి చక్కటి పాలనొసగును. ధరలు సమముగా ఉండును. పాడిపంటల వృద్ధి కలుగును. పశుపాలకుడు బలరాముడు. పశువులపై శ్రద్ధ – పాడిపంటల సమృద్ధి కలుగును. మొత్తము మూడుతూముల వర్షమునకు ఎనిమిది భాగములు సముద్రమందు, తొమ్మిదిభాగములు పర్వతములందు, మూడుభాగములు భూమియందు కురియును. ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగును. సంవత్సర ప్రారంభమున ఆఢకము బాల్య యవ్వన వయస్సుగల వైశ్యచేతియందు ఉండుటచే సస్యానుకూల వర్షములు పాడిపంటల సమృద్ధి యుండుట, ధాన్యాది సమస్త వస్తువుల ధరలు పడిపోవును.

15. పాక్షిక చంద్రగ్రహణము 28.10.2023

ఆశ్వయుజ పూర్ణిమ 28-10-2023 శనివారం రాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము సంభవించును.

• గ్రహణ స్పర్శ రాత్రి 1.05 ని।।లకు

• గ్రహణ మధ్యకాలము రాత్రి 1.44 ని।।లకు

• గ్రహణ మోక్షకాలము రాత్రి 2.22 ని।।లకు

• ఆద్యంత పుణ్యకాలము గం 1.17 ని।।లు

అశ్విని నక్షత్రమందు ఈ గ్రహణము సంభవించుటచే అశ్విని నక్షత్రము వారు, మేషరాశివారు చూడరాదు, వారు మరుసటి రోజు యథావిధిగా శాంతి చేసుకొనుట మంచిది.

గ్రహణ స్పర్శ మొదలు పశుపక్ష్యాదులతో సహా సమస్త జీవకోటికి సూతకము కలుగుననీ, నీరు మాత్రము గంగాజలంతో సమానమని భావించి శిష్టాచార సంపన్నులు, ధార్మికులు గ్రహణ స్పర్శను చూసిన వెంటనే పట్టు స్నానము, గ్రహణ మోక్షానంతరము విడుపు స్నానము చేయుదురు. మధ్యాహ్న భోజనాదులు యథావిధిగా ఆచరించుట, రాత్రికూడదు. మరియు 29-10-2023 ఆదివారం గ్రహణ శూల గావున దూరప్రయాణముల కూడదని తెలియునది.

16. మకర సంక్రమణ పురుష లక్షణము

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్థి అనగా ది 15-01-2024 సోమవారం ఉదయం 8.25 ని।।లకు రవి మకర రాశి ప్రవేశం.

శుక్షపక్షము – ప్రజలకు వ్యాధి, పీడ రాజులకు యుద్ధము కలుగును. చవితి తిథి దుఃఖము, సోమవారం వస్తువులకు అధిక మంచువలన నష్టము సంభవించుట, పూర్వాహ్ణ రాజులకు నష్టం, లగ్న ఫలం ప్రజలకు పశువులకు క్షయం, ముహూర్తం 3వది ధరలు పెరుగుట. వాహనము – అశ్వము.

17. సంవత్సర ఫలిత సారాంశము

• అస్మిన్దినే లోక వ్యవహారతః చాంద్రమాన వశాదయం శోభకృత్ (శోభన) నామ సంవత్సరః బార్హస్పత్య మానేన కాశీ ప్రాంతే రాక్షస నామ సంవత్సరః।

• ప్రభవాది 60 సంవత్సరములలో 37 వది శోభకృత్ నామ సంవత్సరము. 1 యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 60 సంవత్సరములను 12 యుగములుగా విభజిస్తే, శ్రీ శోభకృత్ నామ సంవత్సరము 8వ యుగమున రెండవది పరివత్సరనామకము గలది అనల దేవతాకమైనది.

• ఈ శోభకృత్ సంవత్సరమునకు అధిపతి సూర్యుడు. సూర్యుడిని ఆరాధించిన ఆరోగ్యమును, తేజస్సును అనుగ్రహించును. ఇందు యవ దానము విశేష పుణ్యఫలప్రదము.

• శోభకృత్ సంవత్సరాధిపతి శుక్రుడు. శుక్రుని ఆరాధించిన సమాజంలో గౌరవం, సమానత్వం, సఖమయమైన వైవాహికజీవనం, కీర్తి, విలాసాలకు సంపదలకు మొదలగువానికి సంకేతమై భౌతికమైన ఆనందాలను ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. రాజసము, కావ్య రచన, అవధానము, నిశితముగా పరిశీలించి తార్కికముగా ఆలోచన చేసి అపారమైన విద్యాయోగము కలిగేటట్టు చేయడం, ఇతరులను చులకన చేయు స్వభావము, మధుర కంఠధ్వని, సంగీతాది లలితకళల యందు అభిరుచి మొదలగునవి అనుగ్రహించు గ్రహము.

• సత్సంప్రదాయాచారాలను నైతిక విలువలను పాటిస్తూ, శుక్రగ్రహమునకు అధిదేవత ఇంద్రాణి, ప్రత్యధిదేవత ఇంద్రమరుత్వత్ సహితముగా శాస్త్రోక్తంగా పూజిస్తే ఖచ్చితమైన శుభఫలితాలు కలుగుతాయి. గ్రహదేవత భౌతికతత్త్వాన్ని తెలియజేస్తే, అధిదేవత గ్రహదేవత యొక్క ప్రవృత్తిని, ప్రత్యధిదేవత గ్రహదేవత యొక్క ప్రభావాన్ని ఉన్నత స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చేటట్టు చేస్తుంది.

• శోభన వత్సరాధిపతి శుక్రుడు సస్యానుకూల వర్షములు, పాడిపంటలు సమృద్ధి, పశువృద్ధి, ప్రభుత్వాలు ఆలోచనతో ముందుచూపుతో ప్రజాసంక్షేమములను అమలుచేయుట యుండును. చైత్రాదిమాస త్రయమున ధాన్యాదుల ధరలు సరసముగానుండును. కొన్నిచోట్ల ఉత్పాత భయములుండును.

• ఆషాఢమున స్వల్పవృష్టి, అధికశ్రావణమున స్వల్పవర్షం, దుర్భిక్షం, అధికారులు పాపభీతి లేక ప్రజలను బాధించుట, ప్రజా వ్యతిరేక విధానములను ఆచరించుట, ఆహార ధాన్యముల నిల్వలు తగ్గుట.

• నిజశ్రావణమున అధికవృష్టి, ప్రజాపీడలు. భాద్రపదమున వర్షములు వరదలధికము.

• ఆశ్వయుజమున ఆహారధాన్యముల ధరలు మందము.

• కార్తికాది మాసపంచకమున రాజకీయ ఒడిదుడుకులు, వాదోపవాదములు, ధాన్యాదుల ధరలలో హెచ్చుతగ్గులు సంభవించును. ప్రజా కలహములున్ననూ తీరిపోవును. గత సంవత్సరములలో వలె దేశమంతా అధిక స్థాయిలో వర్షాలు కురుస్తాయి.

18. వర్ష, జగల్లగ్నములు

• వర్ష లగ్నం - వృశ్చికం, జగల్లగ్నం - కన్య.

• ఈ లగ్నములకు కేంద్ర కోణముల యందు శుభ గ్రహములు మరియు శుభ దృష్టి గలవై యుండుటచే సుభిక్షము మరియు ధనధాన్య వృద్ధిచే దేశమున శుభకరమగును. పశ్చిమ దేశములందు అధికకాలము దుర్భిక్షము, ఉత్తరమున ధనవృద్ధి, సకల ధాతువులకు మధ్యమ ధరలు కలుగును. తూర్పు దేశములందు మూడు నెలలు దుఃఖము, మూడు మాసముల పైన సుఖ సంతోషములు కలుగును. మధ్య దేశమున ధాన్యనాశము కలుగును. దక్షిణదేశములందు పాలకులు మారుట, అన్ని రకముల లోహముల ధరలు పెరుగుట సంభవించును. మరియు దేశ గోచారాన్ని పరిశీలించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహాయ సహకారాలు తగుమాత్రం ఉంటాయి. అయితే పాలకుల మధ్య పరస్పర అవగాహన సమన్వయం ఉంటుంది.

• 1. వర్షలగ్నములో లగ్నాధిపతి కుజుడు. లగ్నము నుండి అష్టమ స్థానమందు, అష్టమాధిపతి బుధునికి పంచమస్థానమున నీచ మరియు రవి, గురు, బుధులతో చేరిక వలన బుధుని యొక్క మెరుగైన ఫలితములు ఆశించవచ్చును. అష్టమాధిపతికి నీచ వలన ప్రజలు దీర్ఘాయుర్దాయముతో రాణిస్తారు. లగ్నమునకు ద్వితీయ పంచమాధిపతియగు గురుని మరియు తృతీయ, చతుర్థాధిపతి యగు శని దృష్టి, దేశసార్వభౌమాధికార విషయంలో రాజీ ఉండదు. ప్రజల ఆరోగ్యం జీవనస్థితిగతులు సామాన్యంగా ఉంటాయి. పర్వతాలు అడవులు దుర్వినియోగానికి గురవుతాయి.

• 2. ద్వితీయాధిపతి – గురుడు. భాగ్య, రాజ్య లాభాధిపతులగు చంద్ర, రవి, బుధులతో కూడియుండుట లగ్నషష్ఠాధిపతి కుజుని దృష్టి, గ్రామీణ వ్యవసాయ రంగాలు అడవులు నదీజలాల నిర్వహణ, పర్యావరణ కాలుష్య నివారణ విషయాలలో సంబంధ ప్రభుత్వాల అజమాయిషీ కొరవడుతుంది. ఆర్ధిక వ్యవహారాలు బ్యాంకుల కుంభకోణాల విషయంలో ప్రజలు అప్రమత్తతగా యుండుట అవసరం.

• 3. తృతీయ స్థానమునకు కుజుని వీక్షణ, తృతీయ చతుర్థ స్థానాధిపతి చతుర్థ స్థానమందు ఇతరదేశాలతో సత్సంబంధాలు కొనసాగుతాయి. సమాచార వ్యవస్థల వృద్ధి, క్రీడారంగం ముందంజలో ఉంటాయి.

• 4. కళాశాలలు విద్యాలయాలు విశ్వ విద్యాలయాల పాత్ర అంతంత మాత్రంగానే ఉంటుంది. గనులు వాయుపురితమై దుష్ప్రభావానికి లోనవుతాయి.

• 5. ప్రజారోగ్యముపై శ్రద్ధ చూపి కొత్తగా వైద్య కళాశాలలను నెలకొల్పుతారు. మాతా, శిశు సంరక్షణ వంటి అంశాలలో ప్రభుత్వాలు శ్రద్ధ వహించి వారికి అండగా ఉంటాయి. పాలకుల మానసిక స్థితి, పరిశోధనా సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటుంది.

• 6. ప్రజారోగ్యం విషయంలో శ్రద్ధ చూపి అంటువ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ప్రాణ నష్టం ఉండబోదు. సరిహద్దు నిఘా నియంత్రణ అమలు, శత్రువుల పై వ్యూహం మెరుగ్గా ఉంటుంది. శత్రువుల జాడలను సులువుగా తెలుసుకుని వారిని మట్టుపెట్టగల్గుతారు.

• 7. వివాహ సంక్షేమ పథకాలు అమలవుతాయి, ఈ విషయంలో ధార్మిక కేంద్రాలు ప్రభుత్వాలు ప్రోత్సాహకరమైన పాత్రను పోషిస్తాయి. వివాహ వ్యవస్థలు, భార్యా భర్తల మధ్య అవగాహన పెరిగి తగాదాలు, విడాకులు తగ్గుముఖం పట్టడం లాంటి విషయాలు గతంలో కంటే మెరుగవుతాయి.

• 8. వర్ష మరియు జగలగ్నములలో లగ్నానికి దుస్థానమైన అష్టమ స్థానమున లగ్నాధిపతి యుండుట వలన దేశంలో నేరాలు, మోసాలు పెరగడం, ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోవడం, వరదలు, నిత్యావసర వస్తువుల గిరాకీ కొన్నిచోట్ల కరువుకాటకాలు మొదలైనవి తప్పవు.

• 9. వైజ్ఞానిక పరిశోధనలు, న్యాయవ్యవస్థలు, ధార్మిక సంస్థలు తమవంతు కృషిని అందించి బాగా రాణిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు మరింత పకడ్బందీగా అమలవుతాయి.

• 10. శాసనవ్యవస్థల నిర్వహణ పనితీరు సంతృప్తికరంగా ఉండి ప్రజాభీష్టం మేరకు కొత్త చట్టాలను తీసుకునివస్తారు.

• 11. స్థానిక సంస్థలైన పంచాయితీ, పురపాలక సంఘాలు, నగరసంస్థలకు, అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా అధిక ధనాదాయం సమకూరుతుంది. ఆస్తిపన్ను, గృహ నిర్మాణ పన్నులు, రిజిస్ట్రేషన్ చేయుటకు పన్నులు, టెక్నాలజీ వినిమయానికి ఆదాయం, రైల్వేల ఆదాయం, ఖనిజ శుద్ధి సంస్థల ఆదాయం, జి.ఎస్.టి. మొదలగు పన్ను వసూళ్లు మరియు సామాన్య ప్రజలనుంచి సైతం ఆదాయపన్ను, ఇతరత్రా రాబడులద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం ప్రభుత్వాలకు చేకూరుతుంది.

• దేశ అంతర్గత శత్రువులు, నిఘావంటి విషయాలలో సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా వ్యవహరించడం జరుగుతుంది. వాటి కట్టడికి మార్గాలు సుగమమవుతాయి. దేశంలో సత్యం ధర్మం ప్రచారం చేసి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే దిశగా హిందూధార్మిక సంస్థలు ఎనలేని సేవలు చేస్తాయి.

• ఈ సంవత్సరం బృహస్పతి మేష రాశిలో సంచారం వలన అక్కడక్కడ దేశ ప్రజల మనోభావాలకు ఆటంకం కలిగినా, సత్సాంప్రదాయాన్ని పరిరక్షించి, ఆధ్యాత్మిక తత్వాన్ని, జ్ఞానవృద్ధి, వ్యక్తిగత ధైర్యం మరియు ఔత్సాహిక స్వభావం పెంపొందేలా జేసి అన్ని రంగాలలోనూ మన అవగాహనను పెరిగేటట్టు చేస్తుంది.

• మేషరాశిలోని బృహస్పతి వ్యక్తులను, వ్యవస్థలను అంతర్ముఖంగా ఆశావాదులజేసి అవకాశాలను కల్పిస్తుంది. ఆయుర్దాయం కల్పించడం, సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షించడం, క్రమశిక్షణా రాహిత్యానికి బంధన యోగం కల్పించడం, దోషులకు శిక్షలు విధించడం. నల్ల ధాన్యములు, హూణవిద్య, న్యాయ వ్యవస్థ తత్సంబంధ అధికారాల కృషిజీవనం మొదలగు కారకత్వాలున్న శనైశ్చరుడు మూలత్రికోణమైన కుంభ రాశిలో సంచారం దేశానికి మంచి చేస్తుంది.

జగద్గురువైన శ్రీకృష్ణభగవానుడు, లోకానికి వెలుగునిచ్చే శ్రీసూర్యభగవానుడు, కలియుగదైవం శ్రీనివాసుడు లోకమునకు శాంతి, సౌభాగ్యము, రక్షణ, సన్మార్గములు కలిగింతురుగాక.

।।శుభం భూయాత్।।

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

19. రాజాది నవనాయక ఫలములు

1. రాజు (బుధః)- రాజు బుధుడు- రాజు బుధుడగుటచే అపర సస్యములు బాగుగా ఫలించును. పూర్వ సస్యములు మధ్యమ ఫలములిచ్చును. లిపి లేఖకులు, శిల్పకారులకు వృద్ధియుండును. వాయుపీడ అధికమగుటచే స్వల్ప వృష్టి యుండును. గాలి ఎక్కువ, సుడిగాలులు, తుఫానులు ఎక్కువగా వస్తాయి. వర్షాలు సమానంగా ఉంటాయి. రాజభీతి రోగభయాలు ఎక్కువ. సస్యాలు మధ్యమము.

2. మంత్రి (శుక్రః)- మంత్రి శుక్రుడగుటచే సస్యములకు ఈతి బాధలు మూషక బాధలు, గేదెలు, ఆవులకు హాని, ధాన్యాదుల ధరలు సరసముగా నుండును. చెరువులు పూర్తిగా నిండునట్టి వర్షములుండును, ధాన్యాలు విశేషంగా పండుతాయి. గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి. సువృష్టి కలుగుతుంది.

3. సేనాధిపతి (గురుః)- ప్రజలు, రాజులు న్యాయ వర్తనులై యుందురు. ప్రజాభీష్ట పాలన ఏర్పడును. గ్రామవాసులు సుఖముగా జీవించెదరు. అధికారులకు, పాలకులకు, పెట్టుబడి దార్లకు సుఖజీవనము. దేశమంతా చక్కని వర్షాలు కురుస్తాయి. ప్రజలు సుఖ సంతోషాలతో అత్యంత అనురాగము కలవారవుతారు. పాలకులు ధర్మమార్గం పై ఆసక్తి కలవారౌతారు.

4. అర్ఘాధిపతి (గురుః) - గురుడు ధరలకు అధిపతియగుట వలన సువృష్టి, ధనధాన్య సమృద్ధి, యజ్ఞాది కర్మలయందు బ్రాహ్మణులకు శ్రద్ధ. ప్రపంచమున ఉత్సవములు శుభ కార్యములు అధికమగును. ధాన్య రాశులతోనూ, ధనంతోనూ భూమి తులతూగుతూ ఉంటుంది. ఉత్సవాలతోనూ, జాతర్లతోనూ మంగళవాద్యాలతోనూ దేశం చూడముచ్చటగా ఉంటుంది.

5. మేఘాధిపతి (శుక్రుః)- అతివృష్టి, సుభిక్షము, సస్య వృద్ధి, ప్రజలు ఆరోగ్యవంతులై యుండుట, గోవులు ఆరోగ్యవంతమైయుండి పాలనిచ్చుట సంభవించును. అధిక వర్షాలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. పశువులు పుష్కలంగా పాలనిస్తాయి.

6. పూర్వ సస్యాధిపతి (చంద్రః)- జలధాన్యములు మాగాణి, మెట్టపంటలు బాగుగా ఫలించును. వృక్షజాతులు చక్కగా పుష్పించును. చింతపండు, మామిడి పండ్లు, పనస, నారింజ ఫలములు, గోధుమలు, మంచి ధాన్యము, జొన్నలు, సజ్జలు, చెరకు, ఉప్పు, తమలపాకులు మొదలగువానికి ధరలు సరసముగానుండును.

7. అపర సస్యాధిపతి(ధాన్యాధిపతి) (శనిః)- మినుములు, నువ్వులు, అవిశెలు, కృష్ణ కాటుకలు మొదలగు నల్ల ధాన్యములును, నల్ల ఆవాలు మొదలగు సూక్ష్మ ధాన్యములును, నల్ల భూమియు బాగుగా ఫలించును.

8. రసాధిపతి (బుధః)- పిప్పళ్ళు, శొంఠి, అల్లము, మిరియాలు, ఇంగువ, ఉల్లిపాయలు, నెయ్యి, నూనెలు, చెరకు, బెల్లము, పంచదార, వేరుశెనగ, కొబ్బరికాయలు, ఆముదాలు, నువ్వులు, అవిశెలు, మొదలగు నూనె గింజలకు ధరలు పెరుగును. సుగంధ ద్రవ్యాలు దుర్లభంగా ఉండటంచేత ధరలు పెరుగుతాయి.

9. నీరసాధిపతి (చంద్రః)- ముత్యములు, రత్నములు, బంగారము, వెండి, కంచు మొదలగు లోహములు, వస్త్రములు, అలంకార వస్తువుల ఉత్పత్తి అధికమగుటచే ధరలు తగ్గి ప్రజలకు సులభముగా లభించును. పగడాలు, పుష్పాలు, కర్పూరం, అగరవత్తులు వృద్ధి చెంది అందరూ ధరించే విధంగా ఉండి ఆనందకరమౌతాయి.

20. పురోహితాది ఉపనాయక నిర్ణయము

పురోహిత, గణక, పరీక్షకాది ఉపనాయక గ్రహములు శుభులు శుభఫలితములను, పాపులు పాప ఫలితములను ఇచ్చుదురు.

పురోహితః – చంద్రః అశ్వాధిపః - శుక్రః రత్నాధిపః - శుక్రః
పరీక్షకః – చంద్రః గజాధిపః - చంద్రః వృక్షాధిపః - శనిః
గణకః - కుజః పశ్వాధిపః- గురుః జంగమాధిపః - చంద్రః
గ్రామనాయకః – శుక్రః దేవాధిపః - చంద్రః సర్పాధిపః - కుజః
దైవజ్ఞః – గురుః నరాధిపః - శుక్రః మృగాధిపః - గురుః
రాష్ట్రాధిపః – బుధః గ్రామపాలకః- చంద్రః శుభాధిపః – బుధః
సర్వదేశోద్యోగి - శుక్రః వస్త్రాధిపః - బుధః స్త్రీణామధిపః - గురుః
21 మందిలో శుభులు – 18, పాపులు -3

21.గ్రహ సంచారములు

రవి సంచారము - (2023 -2024)

ఏప్రిల్14 మేషం సా 5.04 అక్టోబర్ 18 తుల ప 3.08
మే 15 వృషభం ప 3.15 నవంబర్ 17 వృశ్చికం ప12.38
జూన్ 15 మిథునం రా 1.21 డిసెం 16 ధనుస్సు రా12.34
జూలై 17 కర్కాటకం సా 5.03 జనవరి 15 మకరం ఉ 8.25
ఆగస్ట్17 సింహం తె 4.22 ఫిబ్రవరి 13 కుంభం రా 7.15
సెప్టెం17 కన్య తె 4.48 మార్చ్ 14 మీనం ప 2.50

కుజ సంచారము –(2023 -2024)

మే 10 కర్కాటకం ప 1.48 నవంబర్ 16 వృశ్చికం ఉ 10.46
మే 30 సింహం రా 2.17 డిసెంబర్ 27 ధనుస్సు రా 12.21
ఆగస్ట్ 18 కన్య ప 3.54 ఫిబ్రవరి 5 మకరం రా 9.42
అక్టోబర్ 3 తుల సా 5.58 మార్చ్ 15 కుంభం సా 6.08

బుధసంచారము - (2023 -2024)

మార్చ్ 31 మేషం ప 2.59 నవం 06 వృశ్చికం సా 4.26
ఏప్రిల్ 21 మేషం భరణి 3 వక్రారంభం నవం 27 ధనుస్సు ఉ 5.53
మే 08 మేషం వక్రీ ప 3.46 డిసెం 14 ధనుస్సు పూ.షా 1 వక్రారంభం
మే 15 మేషం అశ్విని 4 వక్ర త్యా డిసెం 28 వృశ్చికం వక్రీ ఉ 11.22
జూన్ 07 వృషభం రా 7.44 జనవరి 02 వశ్చికం జ్యేష్ఠ 4 వక్ర త్యా
జూన్ 24 మిథునం ప 12.41 జనవరి 07 ధనుస్సు రా 8.53
జూలై 08 కర్కాటక ప 12.19 ఫిబ్రవరి 01 మకరం ప 2.41
జూలై 24 సింహం తె 4.32 ఫిబ్రవ 20 కుంభం ఉ 6.01
ఆగస్ట్ 24 సింహం (ఉత్తర1) వక్రారంభం మార్చ్ 07 మీనం ఉ 9.35
సెప్టెం 15 సింహం (పుబ్బ1)వక్రత్యాగం మార్చ్ 25 మేషం తె 3.05
అక్టోబ 01 కన్య రా 8.35 ఏప్రిల్ 02 మేషం అశ్విని 1 వక్రారంభం
అక్టోబ 18 తుల రా 1.17

శుక్ర సంచారము –(2023 -2024)

ఏప్రిల్ 06 వృషభం ఉ 10.56 అక్టోబర్ 01 సింహం రా 12.59
మే 02 మిథునం ప 1.50 నవంబర్ 02 కన్య తె 5.13
మే 30 కర్కాటకం రా 7.39 నవంబర్ 29 తుల రా 1.04
జూలై 06 సింహం తె 4.06 డిసెంబర్ 25 వృశ్చికం ఉ 6.45
జూలై 24 సింహం మఘ2 వక్రారంభం జనవరి 18 ధనుస్సు రా 8.56
ఆగష్ట్ 07 కర్కాటకం వక్రీ రా 12.21 ఫిబ్రవరి 11 మకరం తె 4.52
సెప్టెం 04 కర్కాటకం ఆశ్రేష 1 వక్రత్యాగం మార్చ్ 07 కుంభం ఉ 10.46
మార్చ్ 31 మీనం సా 4.45

గురు సంచారము–

• సంవత్సరాది నుండి ఏప్రిల్ 21 వరకు మీన రాశిలోనూ, తదుపరి మేషరాశిలో ప్రవేశించి సంవత్సరము చివరవరకు సంచరించును.

• ఏప్రిల్ 21 మేషం తె 5.51, సెప్టెంబర్ 5 (భరణి3) వక్రారంభం

• డిసెంబర్ 31 మేషం (అశ్విని4) వక్రత్యాగమై మేషరాశిలో సంవత్సరమంతా సంచారం.

శని సంచారము-

• సంవత్సరమంతా శని కుంభరాశిలోనే సంచారం జరుగును.

• జూన్ 18న కుంభం (శతభిషం2) వక్రారంభమై నవంబర్ 4న కుంభం (ధనిష్ఠ4) లో వక్రత్యాగమగును.

• జూన్ 18 కుంభం (శతభిషం2) వక్రారంభం నవంబర్ 4 కుంభం (ధనిష్ఠ 4) వక్రత్యాగం

రాహు కేతు సంచారములు– సంవత్సరాది నుండి అక్టోబర్ 30 వరకు రాహువు మేషములో, కేతువు తులలో తదుపరి తేదీనుండి రాహువు మీనంలో, కేతువు కన్యలోనూ ప్రవేశించి సంవత్సరమంతా సంచరించును.

22.కందాయఫలములు

అశ్విని 1 1 1 మఖ 4 1 3 మూల 7 1 0
భరణి 4 2 4 పుబ్బ 7 2 1 పూ.షా 2 2 3
కృత్తిక 7 0 2 ఉత్తర 2 0 4 ఉ.షా 5 0 1
రోహిణి 2 1 2 హస్త 5 1 2 శ్రవణం 0 1 4
మృగ 5 2 3 చిత్త 0 2 0 ధనిష్ఠ 3 2 2
ఆర్ద్ర 0 0 1 స్వాతి 3 0 3 శతభిష 6 0 0
పున 3 1 4 విశాఖ 6 1 1 పూ.భా 1 1 3
పుష్య 6 2 2 అనూ 1 2 4 ఉ.భా 4 2 1
ఆశ్రేష 1 0 0 జ్యేష్ఠ 4 0 2 రేవతి 7 0 4

ఇందలి బేసి సంఖ్యలు ధనలాభమును, సమ సంఖ్యలు సమ ఫలితమును, శూన్య సంఖ్యలు శూన్యఫలితమును ఇచ్చును. మొదటి సున్న రోగభయము, మధ్యసున్న మనోభీతి, చివరి సున్న హానిని తెలుపును. ఒక్కొక్క సంఖ్య 4 మాసములుండును.

23. ఆదాయ వ్యయములు - రాజపూజ్యావమానములు

రాశి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం
మేషం 5 5 3 1
వృషభం 14 11 6 1
మిథునం 2 11 2 4
కర్కాటకం 11 8 5 4
సింహం 14 2 1 7
కన్య 2 11 4 7
తుల 14 11 7 7
వృశ్చికం 5 5 3 3
ధనుస్సు 8 11 6 3
మకరం 11 5 2 6
కుంభం 11 5 5 6
మీనం 8 11 1 2
సర్వాదాయం - 105, సర్వవ్యయం 96, ఫలితం= + 9

24. దినాధిపతుల ఫలములు

1. రవి- త్రిప్ప, ఉష్ణము, అకాలభోజనము, భయం, వ్యయం కార్యవికలత, గొప్పవారి దర్శనము, రాజకీయ చర్చలు, పరులవలన ఆశాభంగము, జీర్ణవస్త్రధారణము, శ్రమ సాహస కార్యలాభం, శిరోవ్యాధి, శారీరక శ్రమ, కార్యవిలంబము.

2. చంద్ర- భక్తి, భుక్తి, సుఖసంతోషములు, మిత్రగోష్ఠి, శుభవార్తా శ్రవణం, స్త్రీ సౌఖ్యం, గౌరవం, మనఃశాంతి, నిర్మలత్వం, సత్కార్యాచరణము.

3. కుజ- ధనాలోచన, కోపం, సందేహం, వైద్యుని కలయిక, కఠిన మనస్కత, దూరవార్తా శ్రవణం, తొందరపనులు, క్రయవిక్రయములు, ప్రయాణం, కార్యాటంకము, అపవాదులు, కలహం, ధననష్టం, ధనవ్యయం, ఆత్మస్తుతి, పరనింద.

4. బుధ- కష్టంమీదగాని పనినెరవేరదు. శుభవార్తా శ్రవణం, జ్యోతిషగోష్ఠి, ధనలాభం, బంధుమిత్ర సందర్శనం, ప్రయాణం, ఉపయోగపడే వ్యక్తులతో సంభాషించుట, చిక్కులు, చికాకులు లేకపోవుట, విష్ణుభక్తి, స్త్రీసౌఖ్యం, పరోపకారము.

5. గురు- శుచి, శుభ్రత, గౌరవం, సుఖభోజనం, లాభం, కార్యానుకూలం, శయ్యాభోగం, సాంఘిక కార్యాచరణ, రాజగౌరవం, పండిత గోష్ఠి, సాంప్రదాయక సత్కార్యములను ఆచరించుట, విద్యా, ఉద్యోగ లాభమగుట, పుష్టి, వృద్ధి, ఆనందము.

6. శుక్ర- భోగాది సౌఖ్యములు స్త్రీలపై ఆసక్తి, నూతనవస్త్రములు, పరిమిళ ద్రవ్యాలు, ఆనందములు, బాకీలవసూలు, కళాప్రియత్వం, స్వతంత్రం, కీర్తి.

7. శని- బుద్ధిమాంద్యం దైహికజడత్వం, తొందరమాటలు, చెడువార్తలు వినడం, కష్టనష్టానుభవము, అంగవైకల్యం, రోగాదిరుగ్మత. భూలాభం, గృహలాభం. శ్రమతో కార్యనిర్వహణ, స్థిరవృద్ధి, గో, భూ, వాహనసేవ. శాంతికి శివదర్శనం.

8. రాహు- అకస్మాత్కలహం, ప్రయాణం, దుస్స్వప్నం, నీచసమాగమం, అస్వస్థత, భీతి, స్మశాన దర్శనం, విరక్తి, అకాలభోజనం. వ్యాపారగోష్ఠి, సాహస కార్యలాభం. డాబు, దర్పం, వ్యాపారాలలో పట్టుదల. శాంతికై సుబ్రహ్మణ్య ఆరాధన.

9. కేతువు- బంధువైరం, దుష్ట స్త్రీ పీడ, మనశ్చాంచల్యం, దైవభక్తి, అతికోపం, దీర్ఘతర్కం, పుణ్యకర్మలు, స్వల్పాధికారంకలుగుతుంది. పామువల్ల ప్రమాదం. తరచు నష్ట ద్రవ్యలాభం. ప్రాయశ్చిత్తాదివ్రతకర్మాచరణం, క్రతుదీక్షాతత్పరత. శాంతి- మహారుద్రాభిషేకం, కేతుస్తుతి.

10. శని- శ్రమ, ప్రయాణం, రాజభీతి, చాంచల్యము, పుణ్యకథా శ్రవణం, తర్కం, దుష్టజంతుభీతి, అకారణకోపం, అధికారుల వలన బెడదలు, ఆవేశం, నిందారోపణ, నీలాపనిందలు, మూఢభక్తి, చోరభీతి, పట్టుదల. శాంతికై శివస్తుతి.

25. గ్రహములకు మిత్ర – శత్రుత్వములు

గ్రహములకు మిత్రత్వ – శత్రుత్వములు
గ్రహములు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని
మిత్రులు చ, కు, గు ర, గు, కు ర, చ, గు ర, శు ర, చ బు, శ బు, శు
శత్రులు శు, శని లేరు బుధ చ, కు కు, శు ర, చం ర, చ, కు
సమానులు బుధ బు, శు, శ శు, శ గు, శ బు, శని కు, గు గురు
• ఫలం – వధూవరుల రాశ్యధిపతులు ఒకరైనను, ఏకరాశ్యధిపత్యము కలిగియున్నను శుభప్రదము. శత్రువులైన పరస్పరము కలహము కలవారగుదురు. నైసర్గిక మిత్రులు తాత్కాలిక శత్రువులైనను, నైసర్గిక శత్రువులు తాత్కాలిక మిత్రులైనను సములగును. నైసర్గిక సములు తాత్కాలిక శత్రువులైన శత్రువులే. తాత్కాలిక మిత్రులు అయిన మిత్రులే.

26. మాసాధిపతుల ఫలితములు

1. రవి - పనుల తొందర, ఒత్తిడి, ఆలస్యం, తూర్పు ప్రయాణం, దుఃఖం, శిరోవేదన, భయం, రాజభీతి, నిరుత్సాహం, ఆశాభంగం, శ్రమ, కోపం. శాంతి - రుద్రాభిషేకం, సూర్యస్తుతి.

2. చంద్రుడు - మాతృసౌఖ్యం, దధ్యన్నసౌఖ్యం, స్త్రీ సంభోగ సుఖం, మనో నైర్మల్యం, ఆనందం, గౌరవం, కృషి వ్యాపారాదులు, పెద్దల దర్శనం, సర్వకళాత్మభావం, లలిత కళలపట్ల కౌశల్యం, సప్త సంతాన పోషణం.

3. గురు - ధన లాభం, గురు ఆదరణం, జ్ఞానం, సుఖం, భార్యకు ఆభరణములు, సంతాన సౌఖ్యం, పడమరకు ప్రయాణం. మంచి వస్త్రధారణం. స్థిరవృద్ధి, శాస్త్ర విజ్ఞానం, ధైర్యం, సర్వశుభం, శివదర్శనం.

4. రాహు - ఆతురత, స్మశాన దర్శనం, దైన్యం, వ్యసనం, కడుపునందు, బొడ్డునందు వ్యాధి, కోపం, ధన నష్టం, ప్రయాణంలో దొంగల భయం, గుండె జబ్బు, క్షయ, ఉబ్బసము వంటి దీర్ఘరోగ బాధ. శాంతి - దుర్గాపూజ, రాహుస్తుతి.

5. బుధ - బంధుగోష్ఠి, విద్వజ్జన సంగమం, వర్తకజన స్నేహం, వ్యాపార వృద్ది, భవిష్యత్ ఆలోచనలు, హాస్య సంభాషణ, ధనలాభం, ప్రయత్నసిద్ది. శాంతి- విష్ణుభక్తి, విష్ణు స్త్రోత్రములు, పూజలు

6. శుక్రుడు- తెల్లని బట్టలు ధరించుట, పరిమళ ద్రవ్యోపయోగం, స్త్రీ సంభోగ సౌఖ్యం, నూతన పరిచయములు, స్థిరలాభం, మధుర పదార్థ లాభం, ధన లాభం, స్త్రీ లాభం, గో లాభం, సర్వ సుఖం, లక్షీ స్త్రోత్రం.

7. కేతువు- బంధువైరం, దుష్ట స్త్రీ పీడ, మనశ్చాంచల్యం, దైవభక్తి, అతికోపం, దీర్ఘతర్కం,

8. పుణ్యకర్మలు, స్వల్పాధికారం కలుగుతుంది. పామువల్ల ప్రమాదం. తరచు నష్ట ద్రవ్యలాభం. ప్రాయశ్చిత్తాది వ్రతకర్మాచరణం, క్రతుదీక్షాతత్పరత. శాంతి- మహారుద్రాభిషేకం, కేతుస్తుతి.

9. శని- ఏనుగుల వలన, జంతువుల వలన భయం, నల్లని లాభం, కోపం, పరపీడ, నీచభయం, దుర్వార్తా శ్రవణం, నీచకార్యాచరణము బుద్ధిమాంద్యము, అనవసర ప్రసంగం, విరక్తి, గర్భశూల, గుండెపోటు. శాంతి - రుద్రాభిషేకం, తైలాభిషేకం, శనిస్తుతి.

10. కుజుడు - అధికారుల బెడద ఆయుధముల వలన భయం, కార్యనాశనం, మనస్తాపం, మనః కాఠిన్యం, దక్షిణ నైర్‌ఋతి దిశాప్రయాణం, ఔషధసేవ, ధనమునకు ఇబ్బంది, అకారణ విరోధం, రక్తదర్శనం, ఒత్తిడులు, పనులలో ఆటంకం, శాంతి - - శివునకు అభిషేకం, కుజస్తుతి, దుర్గా స్తోత్రం.

27. రాశిఫలితములు

1. మేషరాశి ఫలితములు

అశ్విని- 1, 2, 3, 4 పాదములుభరణి- 1, 2, 3, 4 పాదములు కృత్తిక- 1 వ పాదము



ఆదాయం – 5 వ్యయం - 5
రాజపూజ్యం- 3అవమానం - 1

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వ తేదీ నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరారంభము నుండి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వరకు, జన్మరాశి యందు మరియూ అక్టోబర్ 31వ తేదీ తదుపరి సంవత్సరాంతము వరకు, రజతమూర్తులుగా సౌభాగ్యమును కలుగజేయుదురు.

జన్మరాశిలో గురు సంచారము వలన పనుల ఒత్తిడి, గ్రంథ పఠనము, జ్ఞానసముపార్జన. సెప్టెంబర్ నుండి డిసెంబర్ నెల మధ్య తలనరములు, కండరముల నొప్పులు. అధిక బరువు వలన మోకాళ్ళ నొప్పులు, స్థూలకాయంతో బాధపడే అవకాశం ఉంది. ఏప్రిల్ 21వ తేదీ నుండి గురుని మేషరాశి సంచారం మీకు సానుకూలం. మీరు మీ వృత్తి నైపుణ్యాన్ని లేదా ఉద్యోగపరంగా బాధ్యత పెరిగి గౌరవాన్ని పెంచుతుంది. 2023 ఏప్రిల్ లేదా సంవత్సర ద్వితీయార్ధంలో మీకు పదోన్నతి. ప్రైవేట్ సంస్థలలో ఉన్నవారికి స్థానమార్పు. గురుచండాల యోగము వలన పరిస్థితులు మార్పు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య గురుడు వక్రించుట చేష్టాబలము వలన జన్మరాశి యందు గురుని సంచారము వలన ఈ రాశివారి వ్యక్తిగత గౌరవము, హోదా పెరుగుట, పూజ్యత, సుఖజీవనము, ధర్మకార్యనిరతి, ఆకస్మిక రాజ సన్మానములు శుభసూచనలు.

సంవత్సరాది నుండి అక్టోబర్ 31 వరకు జన్మరాశి యందు రాహు సంచారము ఎంతో కొంత వరకు వ్యక్తిగత జీవనమును, పనిచేసే చోట ఇబ్బందులు, తోటివారు తక్కువగా చూడడం జన్మరాశిలో రాహు సంచారం. సప్తమ రాశిలో కేతు సంచారం వలన అనేక సమస్యలు. నేత్ర చికిత్సలు సఫలీకృతం. జూదము, పందెములాడుట వలన నష్టము. కళత్ర ఆరోగ్యము విషయంలో తగిన శ్రద్ధ అవసరం. దుర్గారాధన ఎంతైనా వీరి ఉన్నతికి ఉపయుక్తం అవుతుంది. భార్యా భర్తల మధ్య అవగాహన పెంచుకోవడం వలన కుటుంబవ్యవస్థ కుదుటపడుతుంది.

అక్టోబర్ 31 తదుపరి వ్యయస్థానంలో రాహువు షష్ఠ స్థానంలో కేతువు కొంత ఉపశమనాన్నిస్తాయి, ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. పోటీలలో ప్రత్యర్ధులపై విజయం. మీ వ్యాపారాభివృద్ధికిదే సరైన సమయం. మేషరాశి వారికి రాజ్యాధిపతియైన శని లాభస్థానమందు యుండుట వలన వృత్తి విషయాలలో ఆశించిన ఫలితాలు. మేషరాశిలోని న్యాయమూర్తులకు వృత్తిగౌరవం లేదా ఉద్యోగ ఉన్నతి. నిర్ణయాధికారం కలిగిన ఉద్యోగులకు ఇదే విధంగా ఉన్నతి. కర్షకులకు, వృత్తి వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలుంటాయి. ధన సమృద్ధి కలుగుతుంది.

ఈ సంవత్సరమంతా మేష రాశివారికి ఆరోగ్య, ఆర్ధిక, కుటుంబ సౌఖ్యం, అభీష్ట సిద్ధి కలుగుతుంది. జూన్ 17 నుండి లాభస్థానంలో శని వక్రం మూలంగా సుమారు నాలుగు నెలల పాటు గడ్డుకాలం. అయితే ఈ సమయంలో అధిక కృషితోనే సత్ఫలితాలు. నవంబర్ ప్రారంభం నుండి పరిస్థితులు అనుకూలం. అశ్విని నక్షత్రం వారికి వత్సరాదినుండి ఏప్రిల్ 21 వరకు సర్వ శుభములు, రాజగౌరవ సన్మానాదులు, భరణి వారికి స్వర్ణాభరణములు, అధికారయోగం, కృత్తిక నక్షత్రం వారికి పరిస్థితుల సానుకూలమగుట.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 9. 1, 2, 3, 6 తేదీల సంఖ్యలు – ఆది, బుధ, గురు వారములు కలసిన మంచిది. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము నిత్యము పఠించుట, దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయుట మంచిది.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- శుభకార్యాచరణ వలన ధన వ్యయము, గృహమున మంగళకరమగు వాతావరణము, ఉన్నత ఉద్యోగం, వృద్ధి, కుటుంబ విషయములు ప్రోత్సాహకరమగుట సంతానం వృద్ధి, ఆదాయం, గౌరవం, సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.

మే- అనేక సవాళ్లను అధిగమించి, అవిశ్రాంతంగా పనిచేస్తూ మానసికంగా ఒత్తిడిని అధిగమించడం ముఖ్యంగా జన్మరాశిలో బృహస్పతి ఈ సమయం ఆశావాహ దృక్పథాన్ని మేలుకొలిపి మిమ్ములను విజయపథం వైపు నడిపిస్తుంది.

జూన్- పెట్టుబడులుకు, నూతన వ్యాపారములకు సమయం కాదు. కపట స్నేహము ప్రదర్శించడం, వృత్తి వ్యాపారాలు సామాన్యము, మాస ద్వితీయార్థం ఇష్ట కామ్యార్ధ సిద్ధి, బంధు మిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, కుమారుల వలన సౌఖ్యం.

జూలై- వృత్తి ఉద్యోగాలు అనుకూలం భూమి కొనుగోలు లేదా ఏదైనా ఉద్యోగంలో స్థిరపడుట జీతం పెరుగుట, సరైన నిర్ణయాలతో కృషితో సాధించ కలుగుతారు. కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. దూరప్రయాణాలు కలసివస్తాయి.

ఆగస్ట్- వృత్తి ఉద్యోగాలలో పైస్థాయి వారివలన సమస్యలు. మీ సహ ఉద్యోగులతో, స్నేహితులతో, మీ తోటివారితో, తల్లిదండ్రులతోనూ అవగాహనాలోపం వలన సమస్యలు. పనిభారం ఎక్కువై మానసిక వత్తిడికి లోనయ్యే అవకాశం.

సెప్టెంబర్- గృహ వాతావరణం అనుకూలం. జీవిత భాగస్వామి మరియూ సంతానంతో గడపటానికి సమయం కేటాయిస్తారు. తగిన ఆదాయవనరులు కలుగుతాయి. విద్యార్థులు సోమరితనాన్ని వీడి చదువుల్లో ఆసక్తి చూపుతారు.

అక్టోబర్- సమాజంలో విలువ ఆదరణ పెరుగుతుంది. స్నేహితులు, బంధువులు, మిమ్ములను గౌరవిస్తారు. సంతానం, పోటీ పరీక్షలలో రాణిస్తారు. వాహన సౌఖ్యం. ప్రయత్నించిన పనులు నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి.

నవంబర్- అనవసర ఖర్చులు, విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుట మంచిది. ఆధ్యాత్మిక విషయాలలో ప్రాధాన్యత, పిల్లల చదువులపై శ్రద్ధ చూపుతారు. వారి విజయాలు సంతృప్తినిస్తాయి.

డిసెంబర్- మీ సంకల్ప శక్తి పెరిగి మిమ్ములను విజయానికి దగ్గరజేస్తుంది. మీ విజయాలకు మీ సోదరులు మీకు అత్యంత సహాయకారులుగా ఉంటారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఆదాయవనరులు అనూహ్యంగా పెరుగుతాయి.

2024 జనవరి- అనవసర ఖర్చులు తగ్గించుకొనుట మంచిది తండ్రి లేదా తరపు వారితో వాగ్వాదములు, ప్రభుత్వ సంబంధ ఆదాయములు పెరుగుట, పుణ్యక్షేత్ర సందర్శనములు గృహమున మంగళతోరణములు శుభప్రదమైన ఆనందదాయకమైన కలయికలు వాతావరణము.

ఫిబ్రవరి- ఇతరులతో వాదనలు కలసిరాకపోగా మానసిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. సద్గుణాలను పెంచుకుని ఆధ్యాత్మికంగా సాగడం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలగడంతో ఆర్ధికపరిస్థితి మెరుగవుతుంది. మార్చ్- చెడుసావాసాలు చేయడం వలన అధికంగా ధనం ఖర్చు. నేత్ర, ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీమీద పైవారి ఒత్తిడి ఉండేటం వలన నిద్రలేమిని అనుభవించవలసి వస్తుంది. ఆర్థిక విషయాలైతే ప్రోత్సాహకరంగానే ఉంటాయి.

2.వృషభరాశి ఫలితములు

కృత్తిక- 2, 3, 4 పాదములు, రోహిణి- 1, 2, 3, 4 పాదములు, మృగశిర- 1, 2 పా



ఆదాయం – 14 వ్యయం - 11
రాజపూజ్యం- 6అవమానం - 1

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వ తేదీ నుండి వ్యయరాశి యందు లోహమూర్తి గానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరారంభము నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి 31వ తేదీ వరకు ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ తదుపరి సంవత్సరాంతము వరకు, వ్యయస్థానమందు రజతమూర్తులుగా సౌభాగ్యమును కలుగజేయుదురు.

ఈ రాశివారికి వ్యయ స్థానమందు బృహస్పతి, ఇది అంగారకుని స్వస్థానమగుట వలన హఠాత్తుగా మొండిగా తీసుకునే నిర్ణయాలను పునఃపరిశీలించుకోవలసి ఉంటుంది. అధిక ఖర్చు. ఈ రాశివారు సౌఖ్యం కొరకు, రాకపోకలకు అధికధనం వెచ్చించడం, ఇతరులపట్ల సామరస్య ధోరణిని కలిగిఉంటారు. ప్రశాంతతని కోరుకుంటారు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్థులు విలువలు రెట్టింపు అవుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలకు లక్షలాది రూపాయలు విరాళంగా ప్రకటిస్తారు. ఇతర దేశాలలో భూములు కొనుగోలు. ఇతరదేశ ప్రయాణాలు కలసివస్తాయి.

ఈ రాశి వారికి శని రాజ్యస్థానమైన కుంభరాశి యందు సంచారము భవిష్యత్తులో వృత్తి ఉద్యోగాలకు సంబంధించి అభివృద్ధిని సూచిస్తూ సానుకూలం. ఈ సంవత్సరంలో తలపెట్టిన కార్యక్రమాలను ప్రారంభించడం ఆలస్యమైనా ముందు ముందు ఖచ్చితమైన అనుకూలమైన ఫలితాలనిస్తాయి. తోటి ఉద్యోగులతో గొడవులు లేకుండా, కుటుంబాన్ని సరిగ్గా నిర్వహిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. జూన్ 18 నవంబర్ 4 తేదీల మధ్య రాజ్యస్థానమైన కుంభరాశిలో శని వక్రం వలన ఈ రాశి వారు ఉద్యోగవిషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడం మంచిది.

రాహుకేతువులు సంవత్సర ప్రథమార్ధంలో వ్యయ, షష్ఠ స్థానములందు మిశ్రమ ఫలములు, కార్యజయమును, పోగొట్టుకున్న వస్తువులు లభించుట, శత్రువులపై విజయము, న్యాయ, కోర్టుపరమైన విషయములలో విజయం. ద్వితీయార్ధంలో రాహుకేతువులు మూర్తివంతం చేతనూ వృషభరాశి వారికి ఏకాదశ, పంచమస్థాన గతులగుట వలన కుటుంబం, ఆర్థికస్థితి, వాహన సౌఖ్యము కల్గును. కర్షకులు, నాటక, గాత్ర, లలిత కళారంగంలోని వారి పనితనం నైపుణ్యం పెరిగి వృత్తిపరమైన గౌరవము కలుగును. ప్రజాదరణ కలుగుతుంది. వ్యాపారస్థులకు ఆర్ధికంగా ముందంజ. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట అధిక ఫలం. గృహజీవనము బాగుంటుంది. ఆర్ధిక విషయాలు మెరుగవుతాయి. ఈ రాశివారు సంవత్సరాంతంలో ఉద్యోగవిజయాలను పొందుతారు. కృత్తికా నక్షత్రం వారికి సభాగౌరవము, అవార్డులు. రోహిణి నక్షత్రంవారికి గృహమున వివాహాది శుభయోగములు, పిల్లలకు సంబంధములు కలసి వచ్చుట మృగశిర నక్షత్రం వారికి ఇతరులతో సత్సంబంధాలు కల్గును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య విషయంలో విద్యార్థులు బాగా రాణిస్తారు. – 6. 3, 4, 5, 8 తేదీల సంఖ్యలు, బుధ, శుక్ర, శనివారములు కలసిన యోగప్రదములు.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- ఈ రాశి వారికి జన్మ రాశిలో శుక్ర సంచార ప్రభావం అనుకూలం. కవిత్వం గాత్రం వంటి విద్యలలో రాణిస్తారు. సృజనాత్మక శక్తి అవగాహన పెరిగి చదువుల విషయంలో విద్యార్థులు బాగా రాణిస్తారు. ధన సంపాదన, భూయోగం కలుగుతుంది.

మే- ఆకస్మిక ధనలాభము కార్యజయము, సర్వత్రా అనుకూలత. క్రోధము వలన పనులు చెడుట, ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార వాటాలలో పెట్టుబడులు కలసివస్తాయి. గుండె సంబంధ విషయాలలో వైద్యసలహాలు అవసరం.

జూన్- ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు మటుమాయం. భౌతిక సుఖాన్ని అనుభవిస్తారు. జీవితంలో కొత్త దృక్పథాన్ని అలవరచుకుని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు. సోదరులు కుటుంబ సభ్యులు మీకు సహకారాన్ని అందిస్తారు.

జూలై- సోమరితనము వలన కార్యభారము పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం. స్నేహితులు మీ మాటలకు ఎక్కువ విలువనిస్తారు. సంతానం వృద్ధిలోకి వస్తారు.

ఆగస్ట్- మీ తోటివారితో విభేధాలు, మానసిక పరమైన ఒత్తిడి. భూమి లేదా ఆస్తి కొనుగోలు విషయంలో ప్రతిష్టంభనలు. మాతృమూలక అనారోగ్యములు లేదా. కలహములకు దారితీయవచ్చు. ప్రస్తుతానికి వ్యాపార లావాదేవీలు పనికిరావు.

సెప్టెంబర్- శతృజయం, మిత్రలాభం, స్నేహితుల వలన ధనయోగం. శుభవార్తలు వింటారు, సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ నుంచి గౌరవము దక్కుతుంది.

అక్టోబర్- మీ ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కనబడుతుంది. శత్రువులను జయించటానికి వ్యూహాలు రచిస్తారు. మంచిస్నేహితులతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

నవంబర్- గృహయోగం కలుగుతుంది. మాసారంభంలో చంద్రుడు జన్మ రాశిలో యుండుట వలన గృహ అలంకరణ వస్తువులు వస్త్రలాభములు, ప్రేమవ్యవహారాలకు దారి తీసే అవకాశము, ఇసుక, మైనింగ్ వ్యాపారములు కలసి వస్తాయి.

డిసెంబర్- మాతృ కళత్ర సంబంధ కలహములు, ఉదర జననాంగ సంబంధ ఆనారోగ్య సూచనలు, ఉద్యోగములో క్రోధము వీడిన పై అధికారులతో ఇబ్బందులు తొలగుతాయి. దోష నివారణకు సుబ్రహ్మణ్య, సూర్య ఆరాధన మంచిది.

2024 జనవరి- రక్తప్రసరణ, అజీర్ణం మూలవ్యాధుల సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం. రుణములు బారినపడకుండా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

ఫిబ్రవరి- దూర ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యులతో గడపడం వలన మనశ్శాంతి. ఉద్యోగం ఆశించేవారికి తక్షణమే అనుకూలం. ఋణ విమోచక అంగారక స్తోత్రము పఠించుట మంచిది.

మార్చ్- లాభస్థానమందు సకల దోషాలు తొలగి ఆర్థిక పరిపుష్టి ఉద్యోగ విజయము. ఆకస్మిక ధనలాభము. విందు వినోదాలలో ఆనందాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి. ఇతర దూర దేశాలకు వెళ్ళే అవకాశమూ ఉంది.

3. మిథునరాశి ఫలితములు

మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు



ఆదాయం – 2 వ్యయం - 11
రాజపూజ్యం- 2అవమానం - 4

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వ తేదీ నుండి ఏకాదశమ స్థానమందు సువర్ణమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరారంభము నుండి భాగ్య స్థానమందు సువర్ణమూర్తిగానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వ తేదీ తదుపరి సంవత్సరాంతము వరకు రాజ్య స్థానమందు లోహమూర్తులుగా సంచరింతురు.

గురుడు ఏకాదశరాశి సంచారము వలన తేజస్సు, యశోవృద్ధి, మంత్రసిద్ధి, గౌరవం, ప్రతిష్ఠ మరియు సమాజంలో మంచిస్థానం లభిస్తుంది. సంతానాభివృద్ధి. సర్వకార్యసిద్ధి, ఇతరుల వ్యతిరేకతను వారికి అనుకూలంగా మార్చుకుంటారు. గృహమున వస్తు వాహనాది సౌఖ్యములు, ప్రేమ విషయాల్లో జయం. అనేక ఆదాయ మార్గాలలో ఆదాయాన్ని పొందుతారు.

భాగ్యస్థానమందు శని సంచారము అదృష్టమును కల్పిస్తుంది. ఆధ్యాత్మికంగా జీవనములో ముందంజ వేస్తారు. తండ్రి వైపు వారితో సంబంధములను పెంచుకుంటారు. కుంభరాశిలో సంచారము వలవ జీవనము కొత్త ఆశలను చిగుస్తాయి. వీరి ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది. భాగ్య స్థానమందలి శని మిశ్రమ ఫలితాలనిస్తాడు. ఒకప్పుడు భార్యా భర్తలు సంతానం విషయంలో చింత, మరొకప్పుడు ధనలాభము కుటుంబ విషయాల్లో సంతృప్తిని కలుగజేస్తాడు. ఉద్యోగస్తులకు తరచూ మార్పులు, సంవత్సరం ప్రథమార్థంలో అనగా అక్టోబర్ వరకు రాహువు ఏకాదశ స్థానమందు మీ జీవితంలో మంచి దశ. సమస్త శుభఫలితాలు. గృహిణులకు సౌఖ్యమైన కాలం. నూతన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి. విదేశీయాన ప్రాప్తి, గృహమున కళ్యాణాది శుభయోగములు, ధార్మిక తత్వం పట్ల అభిలాష ఆసక్తి పెరుగుతుంది. ఏకాదశ స్థానమందలి రాహువు వలన మీరు మంచి స్థితిని అనుభవిస్తారు. తదుపరి రాజ్యస్థానమందు మృష్టాన్న భోజన సౌఖ్యము, మంచి ఆరోగ్యము. సప్తమ స్థానమందలి కేతువు పంచారం వలన ఆరోగ్య సమస్యలనుభవించి వాటి నుండి బయటపడతారు. కేతువు ప్రభావం వలన ద్వితీయార్ధంలో విజయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి ఆదాయ వనరులు సమకూరును. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సినీ, గాత్ర లలితకళలకు చెందినవారు, నాటక రంగం మొదలగు స్వయంవృత్తులవారు ఆర్ధికంగా ముందంజ వేస్తారు. వారి వృత్తులలో గౌరవాన్ని పొందుతారు. బ్యాంకింగు ఫైనాన్స్ సంబంధ ఉద్యోగులకు పదోన్నతులు, పునర్వసు వారికి కుటుంబ వృద్ధి, పుష్యమి వారికి ఆధ్యాత్మిక ఉన్నతి, ఆశ్రేష వారికి వ్యాపారలాభములు ధనవృద్ధి.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. 1, 3, 6, 8 తేదీల సంఖ్యలు, ఆది, గురు, శుక్ర వారములు కలిసిన యోగప్రదము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- సంతృప్తికరమైన ఆదాయముంటుంది. శరీరంలో రుగ్మతలు, పీడ, కురుపులు. మీ సంపదలు వృద్ధి చెందుతాయి. కీర్తి విస్తరిస్తుంది. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు.

మే- లాభస్థానంలో రవి బుధులు సమస్త ఐశ్వర్యములను కలుగజేస్తాయి. ఆహ్లాదకరమైన జీవనము గడుపుతారు. ఆధ్యాత్మికంగా మీ స్థాయి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు.

జాన్- గౌరవం, ప్రతిష్ఠ మరియు సమాజంలో మంచి స్థానం. సంతానం మద్దతు, ప్రేమ మీకు ఉంటుంది. మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు మరియు వ్యతిరేకతను తారుమారు చేస్తారు. జీవితం విలాసవంతంగా నడుస్తుంది.

జూలై- వస్తు వస్త్రాభరణాలు వాహనం మరియు ఆస్తి వృద్ధి. ప్రేమ విషయాలు నెరవేరుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యాపారంలో ఆశించిన లాభాలు గొప్ప సామాజిక ఖ్యాతిని పొందుతారు.

ఆగస్ట్- కోపాన్ని మరియు నాలుకను అదుపులో ఉంచుకోకుంటే కుటుంబంలోనూ మరియు స్నేహితులతో ఉద్రిక్తతలు సమస్యలను కలుగజేయవచ్చు. రుణాలు లేదా రుణం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు.

సెప్టెంబర్- ప్రమోషన్ లేదా వేతన పెంపు కలుగుతుంది. వృత్తి విషయాల్లో నైపుణ్యం పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం మరియు సంపదలో వృద్ధి కనబడుతుంది. ధైర్య స్థానంలో సూర్యుడు శత్రువులను అధిగమించడానికి మీకు కొత్త శక్తిని ఇస్తాడు.

అక్టోబర్- మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు స్నేహితులు మీ విలువను గుర్తిస్తారు మరియు మీకు గౌరవం ఇస్తారు. మీరు చాలా మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని అనుభవిస్తారు.

నవంబర్- ప్రయాణాలు లాభదాయకం. ప్రియమైనవారితో సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. గృహనిర్మాణాలు కలిసివస్తాయి. అందమైన ఆహ్లాదకరమైన నూతన గృహంలో నివాస యోగం కలుగుతుంది.

డిసెంబర్- సంతోషం మరియు సంతృప్తి సంపద లాభం కలుగుతుంది. మీకు స్నేహితులు మరియు బంధువుల నుండి గౌరవం మరియు గుర్తింపు పొందుతారు. స్పెక్యులేషన్లు వరిస్తాయి. సంతానం వృద్ధి చెందుతుంది.

2024 జనవరి- మీ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చనప్పుడు హాస్యం యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు మరియు తోటివారికి ఉపశమనము కల్గి ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉంటుంది. జ్ఞాన వృద్ధి, వ్యాపార ప్రయోజనాలను పొందుతారు.

ఫిబ్రవరి- ఛాతి కండరముల నొప్పితో ఆరోగ్య సమస్యలకు వైద్య సలహాలు అవసరం. మీ సామాజికస్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం కలిగి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చట్టపరమైన ఇబ్బందులు కలుగును.

మార్చ్- కుటుంబ సభ్యులు ముఖ్యం వారితో వాదనలకు దిగవద్దు. వృత్తి ఉద్యోగాలలోనూ మీ స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడి పని చేయాల్సిన కాలం. ఖర్చులను తగ్గించుకోవడం పొదుపు చేయడం మంచిది. ఛాతీ, గొంతు, వెన్నెముక, మోకాలు మరియు తుంటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు.

4. కర్కాటక రాశి ఫలితములు

పునర్వసు4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు



ఆదాయం – 11 వ్యయం - 8
రాజపూజ్యం- 5అవమానం - 4

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వ తేదీ నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరారంభము నుండి అష్టమస్థానమందు 31వ తేదీ రజతమూర్తిగానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు దశమ, చతుర్థ స్థానములందు సువర్ణమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతము వరకు భాగ్య, తృతీయస్థానములందు రజతమూర్తులుగా సంచరింతురు.

బృహస్పతి దశమరాశిలో సంచారము వలన వృత్తి వ్యాపారాలు అనుకూలము. మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగం ఆశించేవారికి ఉన్నత ఉద్యోగం. మీ ప్రణాళికలు సఫలం. కొన్ని సందర్భాలలో బృహస్పతి దశమరాశి సంచారం ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలున్నప్పటికీ వృత్తి విషయాలలో ముందంజ. నిత్యము ఆధ్మాత్మిక చింతన. శుభకార్యముల వలన ఖర్చు.

ఈ సంవత్సరమంతా బంధువులతోనూ, కుటుంబ సభ్యులతో దూరంగా ఉండటం మంచిది. ఆస్తి విషయాల్లో నష్టం. మానసిక క్షోభనుండి బయటపడి ప్రశాంతంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర సందర్శన వలన ఉపశమనము. సెప్టెంబర్ నుండి డిశెంబర్ నెలల మధ్య రాజ్య స్థానమైన మేషరాశిలో గురుని వక్ర సంచారం వలన అనుకూలం. బోధనా వృత్తుల వారికి వృత్తి నైపుణ్యం పెరిగి పరిశోధనాత్మకంగా పురోగమనము. ఒత్తిడి, స్థానమార్పు. అయినా గురుబలం వలన అవరోధాలన్నీ ఎదుర్కొంటారు.

అష్టమరాశిలో శని సంచారం వలన ప్రతిబంధకములు, అలజడులు కలుగుతాయి. కొత్త వ్యాపారాలను వాయిదా వేయడం. ఇతరులతో సంబంధ భాంధవ్యాల విషయంలో జాగ్రత్త. అష్టమ రాశిలో శనైశ్చరుని వక్ర గమనం వలన ఇబ్బందులు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. అష్టమశని సంచారకాలంలో సమస్యల నుండి బయటపడుటకు రుద్రాభిషేకం, శివారాధన, పరమేశ్వరుని దర్శనం చేయుట ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రధమార్ధంలో రాహువు దశమ మరియు కేతువు చతుర్థ స్థానాలలో సంచారం. విదేశీయాన ప్రాప్తి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి. వృత్తి, వ్యక్తిగత విషయాలు సానుకూలం. ఆర్థిక లాభం వున్నా మానసిక ఇబ్బందులు పడవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఆస్తి విషయాలలో ముందుచూపు అవసరం. రైస్ మిల్లర్లకు లాభం. రాహుకేతువుల సంచారము సంవత్సర ద్వితీయార్ధం అనుకూలం. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణం. కేతువు సంచారం వలన అభివృద్ధిదాయకమైన కాలం. ఆర్థిక లాభాలు, వృత్తి వ్యాపారాలలో ప్రశంసలు. తరచూ ప్రయాణాలు. విద్యలలో ప్రావీణ్యత కౌశలం వలన ఉద్యోగాలలో మెప్పు, పునర్వసు పుష్యమి వారికి సామాజిక గౌరవం, అధికార యోగం. ఆశ్రేష వారికి ధన కుటుంబ వృద్ధి. వీరికి గురు ఆరాధన మంచిది.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 2. 4, 6, 8, 9 సంఖ్యలు గల తేదీలు ఆది, సోమ, శుక్ర, శనివారములు కలసిన మరింత యోగదాయకము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- ఆధ్యాత్మికత మరియు ఆనందంగా జీవనం సాగుతుంది. మీరు వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా మధురంగా ఉంటుంది. మీ సామాజిక స్థితి మెరుగు.

మే- వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. వ్యాపారస్తులకు అధిక ఆదాయాలు. సుఖమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. వాతావరణం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

జూన్- ఊహించని లాభాలను తెస్తుంది. మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. మరియు ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. పదోన్నతితో కూడిన స్థానచలనాలు.

జూలై- పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మొత్తంమీద, మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయాలకు కూడా ఇది మంచి కాలం. దూరప్రయాణాలు కలిసివస్తాయి.

ఆగస్ట్- పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మొత్తంమీద, మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయాలకు కూడా ఇది మంచి కాలం. ప్రయాణాలు ఫలవంతం, సంతానం ఆరోగ్యంతో చదువు విషయాల్లో శ్రద్ధగా ఉంటారు.

సెప్టెంబర్- నాణ్యమైన వృత్తి, వ్యాపార నైపుణ్యాలను, ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించడానికి, సహోద్యోగులతో వాదనలను మానుకోవడం మంచిది. ఆర్ధిక వనరులు పెరిగి లాభాల బాటలో ఉంటారు. ఇతరులకు తోచిన సహాయం చేస్తారు.

అక్టోబర్- ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. గృహ వాతావరణం బాగుంటుంది. సమాజంలో పెద్దవారికి మీ సలహాలు సూచనలు అవసరం. మిమ్ములను సంప్రదించడం ద్వారా కార్యసిద్ధి. నియామకపు పరీక్షలలో గెలుపొందుతారు.

నవంబర్- మీకు నూతన వస్తు వస్త్రాభరణ సౌఖ్యము. సంగీతం పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మీరు కుటుంబంతో వినోద అవకాశాలు, ద్రవ్య లాభాలు మరియు ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతారు. నవరత్నాలు ఆభరణాలు కొనుగోలు.

డిసెంబర్- గ్రహస్థితి అనుకూలం. స్నేహితుల వలన లాభాలు, వ్యాపార వృద్ధి, అదృష్టాన్ని పెంచడం, శుభవార్తలు వస్తాయి. శత్రువులపై జయం, ధైర్యం, మరియు ఆస్తి, పేరు, కీర్తి నుండి మంచి ఆదాయం, కుటుంబంలో ఆనందం.

2024 జనవరి- మంచి సామాజిక జీవితం. మీకు సంగీతం, కళలు మొదలైన సృజనాత్మక విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం. అధికారం, శక్తి, శ్రేయస్సు, సమాజంలో గౌరవస్థానం మరియు విలాసవంతమైన జీవనం కలుగుతుంది.

ఫిబ్రవరి- మీ ఆరోగ్యం సామాన్యం, పిల్లలతో సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు కలసిరావు. చెడు సహవాసాలకు దూరం. సహోద్యోగులతో వివాదాలనుండి తప్పించుకోవాలి. విద్యార్థుల ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. పిల్లల విషయాలలో సంతోషాన్ని కలిగిస్తుంది.

మార్చ్- సంతోషకరమైన మరియు అదృష్ట ప్రదమైన కాలం. మీ ప్రయత్నాల్లో విజయం. వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉపశమనం కనిపిస్తుంది. మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడుతుంది.

5. సింహ రాశి ఫలితములు

మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1పాదము.



ఆదాయం – 14 వ్యయం - 2
రాజపూజ్యం- 1అవమానం - 7

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి భాగ్యస్థానమందు రజతమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా సప్తమస్థానమందు లోహమూర్తిగానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు నవమ, తృతీయ స్థానములందు తామ్రమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతము వరకు అష్టమ, ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తులుగా సంచరింతురు.

సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం తీవ్రమైన ప్రభావాన్ని ఋణ విషయాలు, భాగస్వామ్య వ్యాపారాలు ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కళత్ర సంబంధమైన భాంధవ్యాలు వివాహ విషయాలు, శత్రువుల నుండి రక్షణ ఇవన్నీ భారీగా ప్రభావితం అవుతాయి. చట్టపరమైన మార్గదర్శకాలను గౌరవించి పాటించడం వలన ఇబ్బందుల నుండి బయట పడగలుగుతారు. మీకు రావాల్సిన ధనము చేతికి రావడానికి ఆలస్యం, వ్యాపార వాటాలలో తరుగుదల, సహచరులతో వివాదాలు అస్తిమిత పరిస్థితులకు లోనవ్వడం ఎంతో కొంత తప్పదు.

సింహరాశి వారికి భాగ్యగురుడు ఆరోగ్యము, ద్రవ్యలాభము, గృహ లాభము, మంచి భోజనము, ఎల్లప్పుడు ఆనందకరమగు సంభాషణములు, గృహ వాతావరణము అనుకూలము. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలకు చేరడానికి ఇది మంచి సమయం. ఆర్థిక స్థితి మెరుగు. మరియు పై అధికారులకు మీ మీద నమ్మకము ఏర్పడి మీ సలాహాలకు విలువ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి. అవివాహితులకు కళ్యాణాది శుభయోగాలకు కూడా అనుకూలం. విద్యార్థులు చదువులకై ఇతరదేశాలకు వెళ్లవచ్చు. గురుని వక్ర సంచార కాలంలో ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించుట మంచిది.

రాహుకేతువులు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితములనిచ్చుచున్నారు. ఒక వైపు వ్యవహార ప్రతిబంధకములు, మర్యాదహాని, భ్రాతృ ద్వేషము, మరొకవైపు విదేశీ నివాసయోగము, ఉన్నత విద్యకు సంబంధించి కూడా ఇది మంచి సమయం. మెరుగైన పని సంబంధాలను కొనసాగించడానికి సహోద్యోగులతో ఎటువంటి వాదనలను నివారించడం ఉత్తమం. రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరమగు కాలము. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త. లైంగిక సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులు వచ్చే అవకాశం, కాబట్టి జాగ్రత్త. మీ ప్రత్యర్థులు మీపై కుట్ర పన్నుతారు జాగ్రత్త. మీరు కలలు గనే ఉద్యోగం మిమ్ములను వరించబోతోంది. మీ ఇల్లు మరియు వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట వలన బుద్ధి వికాసము, దిశా, నిర్దేశము కలిగి చర్మ సంబంధ అనారోగ్యములు తొలగుతాయి. మఘ వారికి విదేశీ ద్రవ్యం, పుబ్బ వారికి ఉన్నత విద్యావకాశాలు ఉత్తర వారికి రాజకీయ పరమగు చిక్కులు కలుగుతాయి.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 1. 3, 4, 5, 9 సంఖ్యలు గల తేదీలు ఆది, మంగళ, బుధవారములతో కలసిన మరింత శుభప్రదము,

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- నిందారోపణలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కొంచెం ఇబ్బంది. ఖర్చులను తగ్గిస్తే మంచిది. మాసం ద్వితీయార్థం అనుకూలం, అభివృద్ధి మరియు లాభాలను అనుభవించే శుభకాలం. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత.

మే- ప్రమోషన్‌తో కూడిన కొత్త అవకాశాలను పొందుతారు. పై అధికారులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు సామాజిక పరంగా కూడా ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం విషయాలు అనుకూలం.

జూన్- జీవితంలో ఊహించని లాభాలను తెస్తుంది. అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది మరియు ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

జూలై- పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మొత్తంమీద, మీ ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయాలకు కూడా ఇది మంచి కాలం. ప్రయాణాలు ఫలవంతం, మాసాంతంలో అధిక ఖర్చులు చేస్తారు.

ఆగష్ట్- అంత అనుకూల సమయం కాదు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. శారీరిక అలసట కలగవచ్చు. క్రోధము పూనుట వలన ప్రయోజనము లేదు. చెడు. సావాసాలను వదలటం మంచిది. దూర ప్రయాణాలు అనుకూలం కాదు.

సెప్టెంబర్- గ్రహస్థితి సామాన్యం. మాస ద్వితీయార్థంలో బుధుని సంచారం అనుకూలం. స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ వాక్చాతుర్యంతో అన్నింటా గెలుస్తారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండు.

అక్టోబర్- సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. కొత్త వ్యక్తులను కలవడానికి వారి సహవాసాన్ని ఆస్వాదించడానికి ఇది మంచి కాలం.

నవంబర్- సంగీతం పట్ల ఆకర్షితులవుతారు. మీరు కుటుంబంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రభుత్వం, స్నేహితుల నుండి లాభాలు. వ్యాపార వృద్ధి, శత్రువర్గంపై జయం సాధిస్తారు. అదృష్టం కలసి వస్తుంది. శుభవార్తలు వింటారు.

డిసెంబర్- నూతనవస్త్ర మరియు ఉపకరణాలు కొనుగోలు. మీరు రత్నాలు మరియు ఆభరణాల కొనుగోలు కోసం మీ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో ప్రేమ వ్యవహారాలు వర్ధిల్లుతూ ఉంటాయి ఆర్ధిక వృద్ధి.

2024 జనవరి- పేరు, కీర్తి నుండి మంచి ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం మరియు భౌతిక సుఖాలు. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడుపుతారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు.

ఫిబ్రవరి- పిల్లల విషయాలలో సంతోషాన్ని కలిగిస్తుంది. పరీక్షలలో విజయం, మీ స్నేహితులు, సలహాదారులు మరియు పెద్దలు మీకు విలువ ఇస్తారు మరియు మీతో మంచిగా వ్యవహరిస్తారు. ఆనందకరమైన జీవనశైలిని కలిగి ఉంటాడు.

మార్చ్- మీ మనస్సులో ఆరోగ్య సమస్యల గురించి భయాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయుట, ఆర్థికపరమైన పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు చేసే ముందు వ్యవహారై శైలి అలవరచుకుంటారు.

6. కన్యారాశి ఫలితములు

ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2పాదములు



ఆదాయం – 2 వ్యయం - 11
రాజపూజ్యం- 4అవమానం - 7

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి అష్టమస్థానమందు లోహమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా సప్తమస్థానమందు తామ్రమూర్తి గానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు అష్టమ, ద్వితీయ స్థానములందు రజతమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ మండి సంవత్సరాంతము వరకు సప్తమ, జన్మస్థానమందు లోహమూర్తులుగా సంచరింతురు.

మేష రాశిలో శనైశ్చరుని సంచారం బహు మేలు చేస్తుంది. మీకు బాగా అనుకూలం. ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. తల్లిదండ్రుల మాటను గౌరవిస్తారు.

ముందు ముందు రాబోయే ఆకస్మిక ఘటనలను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉంటారు. రైస్మిల్లర్లకు లాభదాయకం. బ్యాంకింగు ఫైనాన్స్ రంగవృత్తులవారికి పట్టిందల్లా బంగారం, షష్ఠ స్థానమున శని వలన కుటుంబ సభ్యులు మరియు బంధువులతో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. గృహనిర్మాణాదులు సకాలములో పూర్తి చేయగలరు. గృహ సౌఖ్యము. బ్యాంకు ఫైనాన్స్ ఆర్ధికరంగ ఉద్యోగులకు పదోన్నతి.

గురుని అష్టమస్థానస్థితి మీసంతానం పట్ల శ్రద్ధ వహించటం వారికి ఉన్నత విద్య, ఉపాధి లేక సమాజంలో గౌరవ స్థానం సంపాదించిపెట్టడం గుర్తింపు కోసం తహ తహలాడటం, గృహనిర్మాణాలు కలసిరావడం సృజనాత్మకత మరియు మంచి పనులు చేయటం ప్రారంభిస్తారు. కన్యారాశివారికి రాజకీయపరంగా కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకతతో వారివృత్తిలో నైపుణ్యానికి దారి తీస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది. అధిక ఖర్చు, దూరప్రయాణాలు, వ్యాపారంలో కొన్ని ఆకస్మిక సమస్యలు కూడా రావచ్చు. ఆరోగ్యం శ్రద్ధ వహించాలి, న్యాయస్థానాలలో వ్యాజ్యాల విషయంలోనూ జాగ్రత్త. కుటుంబ సభ్యులు లేక వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహపూర్వక వాతావరణం అవసరం. అష్టమరాశి యందు బృహస్పతి కల్గించే మిశ్రమఫలితములలో మెడ, తల నరముల బలహీనత, అజీర్ణము, దొంగల వలన భయము, అగ్నిభయము, రాజభయము, దేహము సొంపు" చెడుట, పోరాట తెగువ కల్గి ఇతరులను అభిశసించుటకు సిద్ధమగుట ఇటువంటి లక్షణములను సూచించును గాన తగుజాగ్రత్త వహించుట మంచిది.

సంవత్సరమంతా రాహుకేతువుల ప్రభావం సానుకూలంగా లేదు. లైంగిక వ్యాధులు, శారీరిక, నేత్రపంబంధ రుగ్మతలు వంటి అడ్డంకులుంటాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. గతంలో దాచీ పెట్టిన ధనాన్ని స్వేచ్చగా వాడుకుంటారు. మీ మీద రాజకీయ పరంగా కుట్రలు పన్నే అవకాశం ఉంది. అయినా మీకు అనూహ్యమైన యుక్తితో అన్నింటిని ఎదుర్కొనగల్గుతారు. దుర్గా, సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. ఉత్తర వారికీ గృహమున కళ్యాణాది శుభయోగములు, హస్తవారికీ గౌరవము, ఉద్యోగప్రాప్తి చిత్ర వారికి నూతన గృహయోగములు కలుగును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య5. 1, 3, 6, 8 తేదీల సంఖ్యలు ఆది, బుధ, గురు, శనివారములతో కలసిన మరింత యోగప్రదమగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- మీ శత్రువుల సంఖ్యను పెంచుతుంది. మీ మనస్సులో ఆరోగ్య సమస్యల గురించి నిరంతరం భయం. మీ జీవిత భాగస్వామికి కష్టాలు లేదా వాదనలకు కూడా మీరు కారణం కావచ్చు. వ్యవహార ప్రతిబంధకాలు ఎక్కువ.

మే- జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో సంబంధం దెబ్బతింటుంది. కొన్ని అనవసర ఖర్చులు మరియు నష్టాలు కూడా ఉండవచ్చు. ధనాదాయం వస్తుంది. ప్రణాళిక అవసరాన్ని గుర్తిస్తారు.

జూన్- మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో మెరుగైన స్థానం పొందుతారు. మీ స్నేహితులు కూడా మీకు సహకరిస్తారు. వివాహితులు కూడా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.

జూలై- మీకు సోదరబలం, స్నేహితుల అండదండలు మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. మీ సోదరులు మరియు స్నేహితులు మీ బలానికి మూలస్తంభాలు. అనేక మార్గాలనుండి ఆదాయం. రాజకీయంగా పలుకుబడి వస్తుంది.

ఆగస్ట్- సకల దోషాలు తొలగి సమస్త ఐశ్వర్యాలు కలసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. అయినా కొత్త పథకాలకు ప్రణాళికలకు దూరంగా ఉండటం మంచిది. మీరు ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభించాలి. అనవసర ఖర్చులు.

సెప్టెంబర్- ఆరోగ్యపరంగా, జ్వరం లేదా రక్త సంబంధిత రుగ్మతలు కలగవచ్చు. వృత్తివ్యాపారాల్లో హెచ్చు తగ్గులు. ప్రస్తుతానికి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించ కుండా ఉండటం మంచిది. మాతృవర్గం వారితో విభేదాలు రావచ్చు.

అక్టోబర్- ఆర్థిక లాభాలు, భౌతిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు మరియు వినోదాలను అందిస్తుంది. విదేశీ పర్యటనలో అనవసరమైన ఖర్చు. చోరీకి గురి కాకుండా సంపాదించిన ద్రవ్యాలను సంరక్షించుకోవడం మంచిది.'

నవంబర్- మాట దురుసుతనం, దూరప్రయాణాలు, జీవిత భాగస్వామి లేదా సహోద్యోగులతో ఆప్రమత్తత అవసరం. సంపదవృద్ధి, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది.

డిసెంబర్- ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు. విద్యా విషయాల్లో రాణిస్తారు. మీరు కొత్త విషయాలు మరియు నైపుణ్యాలను నేర్చుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం తథ్యం. రాబడి ఉన్న రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టవచ్చు.

2024 జనవరి- నూతన వస్తు వస్త్రాల ప్రాప్తి. మీకు కుటుంబ సభ్యులతో వినోద, ద్రవ్య లాభాలు. ప్రభుత్వం నుండి లాభాలను పొందుతారు. రత్నాలు మరియు ఆభరణాల కొనుగోలు కోసం డబ్బును ఖర్చు చేస్తారు.

ఫిబ్రవరి- స్నేహితుల నుండి లాభాలు, వ్యాపార వృద్ధి, శత్రువులపై జయం, ధైర్యం మరియు అదృష్టం మిమ్ములను వరిస్తుంది. శుభవార్తలు వింటారు. మీ జీవనం గృహ వాతావరణం బాగుంటుంది. మీకు అధికార యోగం వస్తుంది.

మార్చ్- మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో మెరుగైన సంభాషణను ఏర్పరచుకోవడంతో సానుకూల ఫలితాలు కలిగిస్తుంది. వ్యాపారస్థులకు ముఖ్యంగా గనులు ఇసుక రవాణా పరిశ్రమలో లాభాలు వస్తాయి. సంపద వృద్ధి. ఉద్యోగస్తులు మెరుగైన పనితీరుకు కనబరచి ప్రశంసలు పొందుతారు.

7. తులా రాశి ఫలితములు

చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ1, 2, 3 పాదములు



ఆదాయం – 14 వ్యయం - 11
రాజపూజ్యం- 7అవమానం - 7

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి కళత్రస్థానమందు తామ్రమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా పంచమస్థానమందు రజతమూర్తిగామా, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి ఆక్టోబర్ 31 వతేదీ వరకు సప్తమ, జన్మస్థానములందు లోహమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతము వరకు షష్ఠ. వ్యయస్థానమందు లోహమూర్తులుగా సంచరింతురు.

సప్తమరాశిలో గురుని సంచారం ఆరోగ్యము, చురుకుదనం, స్నేహితులతో సత్సంబంధాలు, రాజదర్శనము, శరీరపోషణ, తనకిష్టములైన కార్యములు సిద్దించుట, కొత్త ఉద్యోగంలో చేరుట మొదలగు ఫలితాలనిస్తుంది. ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. మీ ఇంట శుభయోగాలకు చాలా అవకాశం ఉంది. అవివాహితులకు కళ్యాణాది శుభయోగములు, రాజకీయనాయకులకు ప్రజాదరణ గౌరవము. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు కలసివస్తాయి. న్యాయవాద వృత్తులవారికి పరస్పర ఒప్పందములతో కూడిన భాగస్వామ్యాలు కలసివస్తాయి. పాత వ్యాపార ఒప్పందాలకు స్వస్తి, ఒక ముఖ్యమైన ఒప్పంద భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు విజయవంతం. గతంలో సవాలుగా ఉన్న న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాల కోసం చూస్తారు. అందరితో మీ సంబంధం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి- మరియు పిల్లలతో అవగాహన పెరుగుతుంది. అనుకోని శుభ సంఘటనలు జరుగుతాయి. వివాహ అవకాశాలు మెండు.

శని పంచమ రాశి సంచారము వలన దాయాదులతో వ్యాజ్యములు, తప్పు చేసి పరితపించుట, సూచించిననూ శని మూర్తివంతముచే అనుకూలించునట్లు చేయును. సుబ్రహ్మణ్య ఆరాధనచే వీటినుండి బయట పడగలుగుతారు. భిన్న ఆచారాలు సంప్రదాయాల నుండి మీకు జీవిత భాగస్వామి లభించే అవకాశం. కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి వస్తుంది.

విద్యార్థులు చదువుల్లో శ్రద్ధ ఏకాగ్రతను పెంచుకోవడం అవసరం. దేవతా సంబంధ ఉపాసనలతో సంతృప్తి. అనితర సాధ్యమైన విషయాలను సాధిస్తారు. స్వయం వృత్తులవారికి, న్యాయవాద, సినీ సంబంధ కళాకారులకు గుర్తింపు. రాజకీయంగా పలుకుబడి. ప్రభుత్వ సంబంధ అధ్యాపక, ఉద్యోగస్తులకు స్థాన చలనములు పదోన్నతులు కల్గును. అన్ని రంగాలలో ముఖ్యంగా చేనేత పనివారికీ ప్రభుత్వ అండదండలు కలుగుతాయి.

చిత్రననక్షత్రం వారికి కార్యసిద్ధి, స్థాన మార్పు, ఉద్యోగ విజయాలు. స్వాతి వారికి గృహమున నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. విశాఖ వారికి అపవాదులు- తొలగి అన్నింటా జయం. దుర్గా, సుబ్రహ్మణ్య, శ్రీ మహా విష్ణు ఆరాధనలు చేయుట మంచిది. అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు చేయుటచే అన్నిరకములుగా కలసి వచ్చును.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య శనివారములు కలసిన యోగము. 6. 5, 7, 9 తేదీల సంఖ్యలు, బుధ, శుక్ర, శనివారములు కలసిన యోగము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- ప్రేమ విషయాలలో అసంతృప్తి, అధికారంతో కూడిన ఉద్యోగం, ప్రభుత్వం నుండి కొంత గుర్తింపు లేదా ప్రతిఫలం సాధ్యమవుతుంది. కోర్టు కేసుల్లో తీర్పు అనుకూలం. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది.

మే- పై అధికారుల ప్రశంసలతో మీరు రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో మెరుగైన సత్సంబంధాలను పెంచుకోవడంలో సరైన పాత్రను పోషించాలి. ఉద్యోగస్తులు మీ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కృషిచేయాలి.

జూన్- అజీర్ణం, రక్త ప్రసరణ సమస్యలు మరియు మూలవ్యాధులు కల్గి అవకాశం. అనవసర ఖర్చులు, నష్టాలు, చెడుసహవాసంలో పాల్గొనే అవకాశం. వృత్తివ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సంస్థల నుండి ఋణం తీసుకునే అవకాశం ఉంది.

జూలై- సంపదను వృద్ధి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. స్నేహితుల నుండి మద్దతు, ప్రయత్నాలలో విజయం పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు. సామాజిక జీవితం మెరుగవుతుంది. గృహవాతావరణం అనుకూలం.

ఆగస్ట్- జీవన స్థాయి హోదా పెరుగుతుంది. మీ జీవితం మంచి మలుపు తీసుకోవడం. ప్రారంభమవుతుంది. మీలోని సృజనాత్మక శక్తి పెరిగి వృత్తులలో రాణించి అధిక ఆదాయాన్ని గడిస్తారు. సోదరులు, స్నేహితులు అనుకూలం. మంచి ఆరోగ్యం.

సెప్టెంబర్- మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. స్నేహితుల నుండి చాలా మద్దతు పాందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరైన సమయం. వ్యాపారం లాభదాయకం. మీరు ఆదాయానికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారు.

అక్టోబర్- మీకు తోబుట్టువుల వలన లాభాలు. శుభవార్తలు వస్తాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. వారి ఉత్తీర్ణత మీకు ఆనందం కల్గిస్తుంది. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. నిద్రలేమి వలన శరీరమందు నొప్పులు కలుగవచ్చు.

నవంబర్- ఆదాయం పెంపు. మీ సహోద్యోగులు, స్నేహితుల నుండి ప్రశంసలు. దీర్ఘకాలిక ప్రణాళికలు లక్ష్యాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. మీరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల సంస్థలో ఉంటారు.

డిసెంబర్- మీ వాగ్దాటి వలన గౌరవం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా. జీతము పెరిగే అవకాశము ఉంది. వృత్తిలో పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం మరియు సంపదలో పెరుగుదల. ప్రయత్నాలు సానుకూలం.

2024 జనవరి- మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు. మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులంతా కలసి పుణ్యక్షేత్రదర్శనం చేస్తారు.

ఫిబ్రవరి- స్నేహితుల నుండి లాభాలు, వ్యాపార వృద్ధి, దైర్యం మరియు అదృష్టం, మరియు సహాయం కలుగుతుంది. తోబుట్టువులతో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మంచి సామాజిక జీవితం.

మార్చ్- పిల్లలు పరీక్షల్లో రాణిస్తారు. సంతోషం కలుగుతుంది. సంతానార్థులకు పుత్ర సంతానం. వ్యాపారం పెరుగుతుంది. ఙ్ఞానం వృద్ధి చెందుతుంది. చదువులో పురోగతి. వాహనం, సంపద మరియు విలాసవంతమైన జీవితం. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం కూడా తగినంతగా ఉంటుంది.

8. వృశ్చిక రాశి ఫలితములు

విశాఖ 4వపాదము, అనూరాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ1, 2, 3, 4 పాదములు



ఆదాయం – 5 వ్యయం - 5
రాజపూజ్యం- 3అవమానం - 3

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి షష్ఠస్థానమందు సువర్ణ మూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా చతుర్థస్థానమందు సువర్ణమూర్తి గానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు షష్ఠ వ్యయస్థానములందు తామ్రమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతము వరకు పంచమ, లాభస్థానమందు తామ్రమూర్తులుగా సంచరింతురు.

భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. వారితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. నిఖర లాభాలు కలుగుతాయి. గురుని ప్రభావం వలన మీ సామర్థ్యాన్ని మీ నైపుణ్యాల గురించి ఇతరులు తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగు. మీ ప్రయత్నాలలో స్వీయ అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ తోటివారి ద్వారా సహాయాన్ని పొందుతారు. ఏవృత్తి వారికైనా అనలమైన సమయమే. మిమ్ములను నూతన ఉద్యో త్యాగాలు వరిస్తాయి. అధ్యాపక, న్యాయాధికారిలాంటి గౌరవప్రదమైన వృత్తులవారికి వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. గురుని వక్ర సంచారకాలంలో అనగా అక్టోబర్ నవంబర్ లో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు, అప్పులు, మీతోటి ఉద్యోగులతో సమస్యలు రాకుండా చూసుకోవడం ముఖ్యం.

చతుర్థస్థానంలో శని సంచారకాలంలో ఉత్పన్నమయ్యే సమస్యల నుండి బయట పడుటకు రుద్రాభిషేకం, శివారాధన, శివార్చన, శివాలయంలో ప్రదక్షిణలు, రుద్రాభిషేకం లాంటివి చేయడం వలన ఆర్ధిక మనో ధైర్య స్థైర్యాలు కలుగుతాయి. జూన్ 17 నుండి నవంబర్ 4 మధ్య శని వక్రంలో ఉన్నప్పుడూ శని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా గృహ నిర్మాణాలు వాయిదా, అయితే తలపెట్టిన పనులు ఆలస్యం కావడం, వీరికి మానసికంగానూ, శారీరికంగానూ వ్యథ, కాలయాపన అయిననూ చివరిలో మంచి ఫలితాలు. విద్యాపరంగానూ చేసిన పని పూర్తికాక ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశిలో శని యొక్క సంచారం మీ మాతృవర్గం మరియు విద్యా విషయాలను ప్రభావితం చేస్తుంది.

శని యొక్క అర్ధాష్టమ రాశి సంచార కాలంలో కొన్ని ఆర్థిక హెచ్చు తగ్గులకు ప్రమాదాలకు దారి తీయొచ్చు. గృహ వాతావరణం అనుకూలం గాదు. ఆస్తి విషయాలలో త్వరిత నిర్ణయాలు పనికి వ్యాపార సంస్థలు లేక వైద్య ఆవాస కేంద్రాలలో ప్రమాదాలకు అవకాశం ఉంది. రాహుకేతువుల సంచారం వలన మిశ్రమఫలితాలు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు కలసిరావు, ముందు చేస్తున్న వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో కొనసాగించవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. విద్యార్థులు కష్టపడి విజయం సాధిస్తారు. న్యాయవాద, కాంట్రాక్టర్ వృత్తులవారికి సామాన్యం, ఎరువులు, మందుల వ్యాపారులకు అనుకూలం. కోర్టు సంబంధ కేసులు ఎదురవ్వ వచ్చు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సమస్యల నుంచి బయట పడగలరు. విశాఖ వారికే సత్సంతానం. ఉన్నతి, అనూరాధ వారికి ఉన్నత విద్యా ఉత్తీర్ణత, ఉన్నతులతో స్నేహసౌశీల్యత, కొద్దిపాటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. విద్యాప్రణాళికలలో విజయం సాధిస్తారు. జ్యేష్ఠ వారికి కళ్యాణ శుభయోగములు, దూర ప్రయాణాలు కలసివస్తాయి.

ఈ రాశివారికి ఆదృష్ట సంఖ్య - 9. 1, 2, 3, 4 తేదీల సంఖ్యలు ఆది, సోమ, మంగళ, గురు వారములు కలసిన మరింత మేలు జరుగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- అన్ని రంగాలలో అభివృద్ధి, ప్రేమ, కరుణ పెరుగుతాయి. పిల్లలు సహాయ కారులుగా ఉంటారు. సమాజంలో మీ స్థానం మెరుగుపడుతుంది. శ్రేయోభిలాషులను పొందుతారు. మీ ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది.

మే- పిల్లల విషయాలలో సంతోషాన్ని కలిగిస్తుంది. సంతానం, పరీక్షలలో విజయం సాధిస్తారు. మీ వృత్తి వ్యాపారాలలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చెడు సావాసాలకు దూరంగా ఉంటే అభివృద్ధి కలుగుతుంది. విలాసవంతమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు.

జూన్- చదువులో పురోగతి, మంచి సుఖము యత్నకార్యసిద్ధి, అన్ని ప్రయత్నాలలోనూ వరుస విజయాలు సాధిస్తారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది మీరు అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు.

జూలై- వాహనం, సంపద మరియు విలాసవంతమైన జీవితం వలన మీ జీవనశైలి సంపన్నంగా ఉంటుంది. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం కూడా. పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ప్లూ వంటి విషజ్వరాల బారిన పడతారు.

ఆగస్ట్- మీరు వృత్తి వ్యాపారాలలో సంతృప్తికరమైన ఆదాయాన్ని మరియు వృద్ధిని పొందుతారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఒత్తిడిని అధిగమిస్తారు.

సెప్టెంబర్- మీరు ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. మీ సామాజిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రాంతంలో భూమిని కొనుగోలు. రియల్ ఎస్టేటుదార్లకు ఏజంట్లకు కలిసివస్తుంది.

అక్టోబర్- దేవతానుగ్రహం కలిగి సత్సంప్రదాయాలకు కట్టుబడియుండటం, ధనధాన్య లాభాలు, గృహమున మంగళతోరణములు భూగృహ స్థిరాస్తుల వృద్ధి సంతోషకరమైన వాతావరణము, మృష్టాన్న భోజనము, సంతృప్తి మిత్రసమాగమము.

నవంబర్- నిద్రలేమి, శరీరంలో నొప్పులు, పాదాలు, కళ్ళు మరియు ఉదర సంబంధ అనారోగ్యములు. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు. వ్యవహార ప్రతిబంధకాలను కోర్టుల్లో వ్యాజ్యాలు నివారించుటకు కృషి చేయవలసి వస్తుంది.

డిసెంబర్- గృహమున శుభకార్యశోభ. మంచి ఆదాయం. మీ సహోద్యోగులు, స్నేహితుల నుండి ప్రశంసలు. మీరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల సంస్థలో ఉంటారు. కమ్యూనికేషన్ మీకు లాభదాయకం. మీ తోబుట్టువుల ఆరోగ్యం జాగ్రత్త.

2024 జనవరి- వాగ్దాటి ప్రదర్శించి, వక్తృత్వపు పోటీలలో విజయం. సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది. వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. స్పెక్యులేషన్ మిమ్ములను వరిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు.

ఫిబ్రవరి- సంపద వృద్ధి, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, మీరు వ్యక్తిగతంగా చాలా సంఘటనలను ఆశించవచ్చు. మంచి ఆరోగ్యం. సంపదలు పెరుగుదల, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి.

మార్చ్- గృహంలో మరమ్మత్తుల కోసం ధనాన్ని వెచ్చించడం, నూతన గృహ ప్రాప్తి, విద్యా విషయాలలో ముందంజవేయడం, నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం, సంతానం విషయంలో శుభవార్త. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

9. ధనూ రాశి ఫలితములు

మూల1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వపాదము



ఆదాయం – 8 వ్యయం - 11
రాజపూజ్యం- 6అవమానం - 3

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి పంచమస్థానమందు రజతమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా తృతీయ స్థానమందు లోహమూర్తిగానూ, రాహు కేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు పంచమ, లాభస్థానములందు సువర్ణమూర్తిగానూ అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతము వరకు చతుర్థ, దశమ స్థానమందు రజిత మూర్తులుగా సంచరింతురు.

శని సంచారం చాలా అనుకూలం. నూతన నిర్మాణాలు కలసివస్తాయి. స్థానమార్పు. మిత్రుల అండదండలు ధైర్యంతో కార్యనిర్వహణ. రాజకీయంగా గుర్తింపు. విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. గురుబలం ఉంది. భవిష్యత్ ప్రణాళికలలో పురోగతి. సంపద వృద్ధి, కుటుంబ విషయాల్లో పురోగతి. అధికారికంగా దూర ప్రయాణాలు, విజయాలు. అన్ని రంగాలలో అభివృద్ధి. పిల్లలు చాలా సహాయకారులుగా ఉంటారు. అందరి అభిమానాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడి మరియు స్పెక్యులేషన్లో లాభాలు.

శని ధైర్యస్థాన సంచారంతో మీ కృషికి మరిన్ని విజయాలు. స్వకార్య సిద్ధి. చిత్తశుద్ధితో చేసిన పనిలో విజయం. రాజకీయంగా ముందంజ. అన్నింటా విజయం. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగం వస్తుంది. భూములను కొని వృద్ధి చేస్తారు. రాజకీయపరమైన వ్యవహారాలలో ఇతరులపై ఆధిపల్యాన్ని ప్రదర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలం, లాభం. విద్యా సంస్థలను నడుపు యజమానులు వృద్ధిని చూస్తారు. సిమెంటు, స్టీలు, నిర్మాణరంగ విభాగాలవారికి మెరుగైన ఆదాయాలు. వైద్యులకు, ఔషధసంస్థల వ్యాపారులకు అధిక లాభాలు.

రాహు సంచారం వలన చాలా మానసిక ఒత్తిడిని గాని, పిల్లలకు సంబంధించిన విషయం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. అయినా మూర్తివంతముచే శుభఫలితాలు కలుగుతాయి.

వ్యాపారంలో ఆదాయం వృద్ధికి ఆశాజనకమైన కాలం. ద్వితీయార్ధంలో మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రేమికుల విషయంలో ఫలితాలు విరుద్ధముగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. కేతువు ఏకాదశ స్థానమందు యుండుటచే సామాజిక గౌరవం పెరుగుతుంది. విదేశీయాన ప్రాప్తి. గృహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దైవకార్యాలలో పాలుపంచుకుంటారు. మూలనక్షత్రం వారు ప్రజోపయోగ కార్యక్రమాలకు అంకితమవుతారు. అధికారవృద్ధి, పూర్వాషాఢ వారికి సంపద వృద్ధి, విదేశీ ప్రయాణాలు కలసిరావడం, ఉత్తరాషాఢ వారికి ఉన్నత ఉద్యోగ సంతానయోగములు కలుగును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3. 1, 2, 5, 9 తేదీల సంఖ్యలు ఆది, బుధ, గురువారములు కలసిన మేలు కలుగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- ప్రతీ పనిని యుక్తితో చేస్తూ మరియు ఇతరులను మర్యాదతో చూస్తారు. మీ వ్యాపార భాగస్వామి మీకు ద్రోహం చేసే అవకాశం ఉన్నందున వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కొద్దిగా తగ్గవచ్చు. ఆరోగ్యం సామాన్యం.

మే- గ్రహస్థితి అనుకూలం కాదు. దోష పరిహారార్థం సుబ్రహ్మణ్య ఆరాధన అభిషేకములు చేయుట మంచిది. తలచిన పనులు నెరవేరుట, ధనలాభములు, కుటుంబ వాతావరణము సుఖ సంతోషములతో యుండుట, పుత్ర సౌఖ్యము,

జూన్- ఆరోగ్య విషయాలలో స్వస్థత చేకూరి ఉపశమనం కలుగుతుంది. సంతోషకరమైన మరియు అదృష్టం కాలము. శత్రుజయము కల్గును. మీ ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉపశమనం కనిపిస్తుంది.

జూలై- వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన మార్పులు మంచి ఫలితాలు, కళత్ర, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల చదువుల్లో ముందంజ, వాహనం, సంపద మరియు విలాసాలతో తులతూగుతారు.

ఆగస్ట్- మీ సామాజిక స్థితి బాగుంటుంది. మీరు విలాసవంతమైన జీవనశైలిని పొందుతారు. పిల్లల వ్యవహారాలు కూడా సజావుగా సాగుతాయి. మీరు ఆకస్మికంగా తెలివైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. మంచి ఆదాయం.

సెప్టెంబర్- కొన్ని సమస్యలు జీవిత భాగస్వామితో మీ అవగాహనను విభేదిస్తాయి. ఖర్చులను తగ్గించుకోవడం మరియు పొదుపు గురించి ఆలోచించిస్తారు. ఎక్కువ శ్రమ లేకుండా అభివృద్ధి మరియు లాభాలను అనుభవించే శుభ కాలం ఇది. ఉద్యోగులకు ఉన్నతి కలుగుతుంది.

అక్టోబర్- ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు. కొత్త అవకాశాలను పొందుతారు. మరియు పై అధికారుల నుండి ప్రశంసలను గుర్తింపును పొందుతారు. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు అధిక లాభం కలుగుతుంది.

నవంబర్- సంస్థలకు ఆధిపత్యం వహించి లాభాల బాటన నడుపుతారు. మీరు అన్నివర్గాల నుంచి గౌరవాన్ని పొందుతారు. పెట్టుబడులు, వ్యాపారం కూడా. లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలకు ఇది మంచి కాలం.

డిసెంబర్- సంస్థాగతమైన ఖర్చులను తగ్గించుకుంటారు. క్రమశిక్షణ, ధైర్యంతో ప్రణాళికలను అమలుచేసి విజయం సాధిస్తారు. భాగస్వామ్యులను ఒక కంట కనిపెడుతూ ద్వేషం, క్రోధం మాని వ్యవస్థను నియంత్రణలోనికి తెచ్చుకుంటారు.

2024 జనవరి- మీ ఇంట మిత్రుల సందడి. రక్తపోటు నరముల నిస్సత్తువ వంటి వానికి లోనవ్వచ్చు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. దురుసుగా మాటలాడటం వలన ఇతరులు నొచ్చుకునే అవకాశం ఉంది. మాతన వస్తు, వస్త్ర ప్రాప్తి.

ఫిబ్రవరి- ధైర్యంగా దర్జాగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. మీ వ్యాపారంలో మీ ప్రతికూల వర్గం వారిని అణగదొక్కుతారు. మీప్రయత్నాలు సానుకూలఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు విలువ గౌరవం ఇస్తారు.

మార్చ్- గ్రహస్థితి అనుకూలం. స్నేహితుల వలన లాభాలు, వ్యాపార వృద్ధి, శత్రువుల పలాయనాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దీర్ఘకాలిక వ్యాధి ఇప్పుడు తగ్గుతుంది. మీరు జీవితంలో కొత్త దృక్పథాన్ని పాండుతారు.

10. మకరరాశి ఫలితములు

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు



ఆదాయం – 11 వ్యయం - 5
రాజపూజ్యం- 2అవమానం - 6

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి చతుర్థస్థానమందు లోహమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగానూ, రాహు కేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు చతుర్థ, రాజ్యస్థానములందు రజతమూర్తిగానూ అక్టోబర్ 31వతేదీ నుండి సంవత్సరాంతము వరకు తృతీయ, భాగ్యస్థానమందు లోహమూర్తులుగా సంచరింతురు.

గురుడు చతుర్థ స్థానమందు మిశ్రమ ఫలితాలను తెస్తాడు. ఆస్థి విషయాలలో విబేధాలు. మీ బంధువులు, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి. దూరప్రయాణాలను మానాలి. అవవసర ఖర్చు తగ్గించాలి. ప్రస్తుతం చేసే వ్యాపారాలకై అప్పు చేయవలసి రావచ్చు. మాతృవర్గం వారితో తగాదాలు. గృహనిర్మాణాలు, స్థిరాస్థి సంపాదించడం, రియల్ ఎస్టేటు వ్యాపారులకు అధిక రాబడి. ఇంటికి సంబంధించిన విషయాలలో లాభపడతారు. కుటుంబ సమస్యలు తీరుతాయి. తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగా సాగుతాయి. మీ తల్లిదండ్రులు నుండి మీకు ఆర్థిక, లేక వారసత్వ సంపదలు సంక్రమించవచ్చు. భూమి, ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి తగిన సమయం.

ఇది ఏల్నాటి శని యొక్క మూడవ మరియు ఆఖరి దశను సూచిస్తుంది. మీరు సొంత ఇంటికి దూరంగా గడపవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలలో మరింత జాగ్రత్త అవసరం. మానసిక స్థైర్యముతో యుండుట అవసరం. కొత్త పెట్టుబడులు, వ్యాపారాలను వాయిదా వేయిట మంచిది. శని ద్వితీయ స్థానంలో యుండుట వలవ దుబారా ఖర్చులు చేయడం, అనైతిక కార్యకలాపాలలో పాలుపంచుకోకుండా యుంటే మీ ఐశ్వర్యాన్ని మరియు కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా ప్రభావితం చేస్తాడు. మీ వృత్తిపరమైన జీవితం లాభదాయకంగా ఉంటుంది. మీకు ఉద్యోగంలో పదోన్నతి ఎదుగుదల కలుగుతుంది. కుటుంబ వృద్ధి అవుతుంది. జన్మరాశికి నాల్గింట రాహువు సంచారం ఆందోళనలు కల్గించే సమయం. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొంతవరకు మానసిక ప్రశాంతతను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. స్థానచలనం ఏర్పడవచ్చు. దశమ స్థాన గతుడైన కేతువు చేతికి వచ్చిన సంపద జారిపోయేటట్టు చేస్తుంది. వృత్తి ఉద్యోగ సమస్యల కారణంగా మానసిక క్షోభను అనుభవించవచ్చు. ఉద్యోగులకు ఇది సంతృప్తికరమైన కాలం. వైద్య వృత్తి వారికి అనుకూలమైన సమయం.

అక్టోబర్ తదుపరి 3ట రాహువు సంచారం జీవితంలో సుఖ సంతోషాలను కలిస్తుంది. మీరు మీ వృత్తి వ్యాపారాలను లాభాల బాటలో పునరుద్ధరిస్తారు. ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సు పొందుతారు. ఉద్యోగం లో ప్రమోషన్ కూడా. వస్తుంది. కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అన్నీ రంగాలవారికి వారి వారి వృత్తులలో ఉన్నత శిఖరాలకు చేరే సమయం విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది.

'ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 8. 3, 5, 6, 7, 8 తేదీల సంఖ్యలు సోమ, మంగళ, శుక్ర వారములు కలసిన యోగప్రదము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- విద్యార్థులకు ప్రగతిశీల సమయం. వ్యాపారాలకు, ముఖ్యంగా మెటల్ పరిశ్రమలో లాభాలు వస్తాయి. సంపద వృద్ధి. మీ మెరుగైన పనితీరుకు అనుగుణంగా మీరు చాలా ప్రశంసలు మరియు ప్రమోషన్ కూడా పొందుతారు.

మే- సంతానం విషయాలలో సంతోషం. పరీక్షలలో విజయం, మరిన్ని వినోద అవకాశాలను కలిగించే సమయం. గృహ సౌఖ్యానికి ప్రాధాన్యత, ప్రయాణాలు వాయిదా.

జూన్- ఉద్యోగ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. పై అధికారులకు వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. శత్రువులు మరియు పోటీదారులు మీ పై ఎదురు తిరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండాలి.

జూలై- గుండె మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో కూడా సమస్యలను ఎదుర్కోవచ్చు. వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండీ ఒత్తిడి.

ఆగస్ట్- గుండె లేక ఊపిరితిత్తుల వ్యాధుల వలన సతమతమవుతారు. గ్రహాల ప్రభావం ప్రతికూలం. సూర్యుని ఆరాధించుట వలన మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానమార్పులు. విద్యార్థులకు విదేశీ విద్య, నూతన అవకాశాలు.

సెప్టెంబర్- గ్రహ స్థితి మిశ్రమము. గుహ్యావయవములకు సంబంధించిన రుగ్మతలు, ప్రయాణంలో అవరోధాలు. ఖర్చులు పెరగడం, ప్రేమ విషయాలలో అసంతృప్తి. మిమ్ములను సమస్యలలో ఇరికించే ప్రయత్నంలో ఉండేవారి నుండి అప్రమత్తం.

అక్టోబర్- ఆరోపణలను ఎదుర్కొనవలసిన సమయం. ఖర్చు తగ్గించాలి. మానసిక ప్రశాంతత లోపించడం, మరియు శత్రువుల నుండి సమస్యలు దూరమగుటకు చంద్రుని ఆరాధించుట, పవిత్ర గ్రంథ పఠనం చేయుట మంచిది.

నవంబర్- అధికార వృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో చలామణి అవుతారు. గత మాసం కంటే ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనము. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. సామాజికంగా గుర్తింపు వస్తుంది.

డిసెంబర్- సమస్త దోషాలు తొలగి ఐశ్వర్యాలు మిమ్ములను వరిస్తాయి. ఎక్కువ శ్రమ లేకుండా వ్యాపారాలలో రాణిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరం. ఇంట్లో విందు వినోదాలతో వారసుల సందడి.

2024 జనవరి- నిద్రలేమి మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఖర్చు అధికం. సంపద మరియు అభివృద్ధి విషయాల్లో స్నేహితుల నుండి మద్దతు. మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.

ఫిబ్రవరి- సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి. సత్ఫలితాలను పొందుతారు. కొత్త వ్యక్తులను కలవడానికి మరియు వారితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

మార్చ్- నూతన వస్తు వస్త్రాభరణాల ప్రాప్తి. మర్యాద పూర్వకమైన మీ ప్రవర్తన ఇతరులకు ఆనందాన్ని సంతృప్తిని కల్గిస్తుంది. చమత్కార సంభాషణ వాగ్ధాటి, వ్యాస రచన వక్తృత్వపు పోటీలలో విజయం. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత పొందుతారు.

11. కుంభ రాశి ఫలితములు

ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు పాదములుపాదములు



ఆదాయం – 11 వ్యయం - 5
రాజపూజ్యం- 2అవమానం - 6

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి తృతీయస్థానమందు తామ్రమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సంవత్సరమంతా జన్మ స్థానమందు తామ్రమూర్తి గానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు తృతీయ, నవమస్థానము లందు లోహమూర్తిగానూ అక్టోబర్ 31వతేదీ నుండి సంవత్సరాంతము వరకు ద్వితీయ, అష్టమస్థానమందు తామ్రమూర్తులుగా సంచరింతురు.

గురుని తృతీయ స్థాన సంచార సమయంలో జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అధికారులు వ్యతిరేకత, అడ్డంకుల కారణంగా వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అవసరం. అతిశ్రమచే కార్యములు పూర్తి, కొత్తగా స్థలాలను కొనుగోలు చేయుట, వ్యాపార వృద్ధి, లాభాలు. కుంభరాశికి అధిపతి శనైశ్చరుడు తన రాశిలో సుమారుగా 2 1/2 సం॥లకు పైగా అనగా 2025 మార్చ్ నెలాఖరు వరకు ఈ రాశిలో సంచరించి ప్రభావితం చేస్తాడు. ఆచితూచి తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది.

శని సంచారం ఈ సంవత్సరమంతా అనుకూలం. వృత్తిపరమైన విషయాలలో పురోగమిస్తారు. వృత్తి విషయాలలో ఉన్నతి. ఆచూతూచి మాటలాడడం వలన శతృత్వం నుంచి బయట పడతారు. జూన్ 18 నవంబర్ 4 తేదీల మధ్య శని శతభిషం, ధనిష్ఠ నక్షత్రాలలో శని వక్రంలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాల వారిపై శని ప్రభావం తీవ్రం. పనులు ఆలస్యం మరల అదే పనిని చేయడం. మానసిక, శారీరక, వ్యథ, కాలయాపన ఉన్నా ఆఖరులో పనులు సత్ఫలితాన్నిస్తాయి. రైతులకు, పారిశుద్ధ కార్మికులకు, కార్మిక శాఖ ఉద్యోగులకు, రైల్వే, జట్టుపనివారికి, వైద్యశాలల్లో పనిచేసే సాంకేతిక నిపుణులకు ఉన్నత ఉద్యోగాలు, ఆదాయం పెంపు. రాజకీయ, న్యాయవాదులకు మంచి సమయం, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. కొత్త వ్యాపారాలను వాయిదా వేయుట మంచిది. రుద్రాభిషేకం, శివారాధన, శివాలయంలో ప్రదక్షిణలు, పరమేశ్వరుని దర్శనం, శ్రీవేంకటేశ్వరుని ఆరాధన చేయుట ఉపయుక్తం.

రాహు కేతువులు సంవత్సర ప్రథమార్ధంలో ఉత్తమ ఫలితాలనిస్తాయి తదుపరి నవంబర్ నుండి ఆర్థికంగా బలోపేతానికి కృషి చేయాల్సిన పరిస్తితులను కలిస్తాయి.

ఆచార వ్యవహారాలలో తెగువను ప్రదర్శించి ధనార్జన చేస్తారు. ఉద్యోగులైతే వృత్తి జీవితాన్ని ఆస్వాదించడం కష్టపడి పనిచేయడం వలన వారికి ఉన్నతులకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సు పొందుతారు. ఏళ్ల తరబడి పోరాడే సమస్యలనుండి విముక్తి, నేత్రసంబంధ అనారోగ్యానికి వైద్యులను సంప్రదించవలసి వస్తుంది. మత్స్య, మాంస క్రయ విక్రయదారులకు, పెట్రోలు డీజిల్ వంటి డీలర్లకు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ పనిముట్ల వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. అదృష్టసంఖ్య 8, ధనిష్ఠ వారికి నూతన గృహ యోగములు, శతభిష నక్షత్రం వారికి ధైర్యం, ప్రణాళికతో లక్ష్యసాధన కార్యజయం పూర్వాభాద్ర వారికి సమయానుకూల ప్రవర్తన వలన లాభపడటం జరుగుతుంది.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 8. 2, 3, 6, 9 తేదీల సంఖ్యలు మంగళ, శుక్ర, సోమ వారములతో కలసిన మరింత యోగప్రదముగా నుండును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- ఆదాయం పెరుగుదల. ప్రశాంతతకై స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం. మీ ఆహారపు అలవాట్లపై కూడా నిఘా ఉంచాలి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

మే- ధైర్యం ప్రణాళిక లక్ష్యంతో ముందుకు సాగి విజయాన్ని వరిస్తారు. ఉద్యోగ విషయమైనా కావచ్చు లేదా మీ వ్యాపారానికి సంబంధించిన నూతన పథకమైనా అవ్వచ్చు. సంతానం వృద్ధి, విజయాలు సాధిస్తారు.

జూన్- గృహ వాతావరణం అనుకూలం, తరచుగా జ్వరాల బారినపడే అవకాశము. శుభకార్యం, వ్యవసాయ పెట్టుబడులకు ధనాన్ని వెచ్చించవలసిఉంటుంది. ఋణం తీసుకోవలసి ఉంటుంది. పదోన్నతితో కూడిన స్థానచలనం రావొచ్చు.

జూలై- జ్ఞాపకశక్తి కృషి పట్టుదలతో విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ప్రతిభా పాటవాలు కలిగి పురోగమిస్తారు. పై చదువులకు ఇతరదేశాల్లో అవకాశం. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. గృహవాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ఆగస్ట్- ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి గుహ్యావయవములకు, జననావయవములకు చికిత్స అవసరం. వైద్యులను సంప్రదించుట, భార్యాభర్తల మధ్య వైషమ్యాలకు తావు లేకుండా ఒకరి అభిప్రాయములను ఒకరు గౌరవించుట మంచిది.

సెప్టెంబర్- బంధువులు, పూర్వపు మిత్రుల కలయిక, గురువులను సమాజానికై కృషిచేసి రాణించినవారిని గౌరవించుట, మిత్రుల నుండి బంధువుల నుండి శుభవార్తలు, అధికార కార్యక్రమాలకు ఇల్లు విడిచి బయట ఉండవలసి వస్తుంది.

అక్టోబర్- పనితనంలో మీరు కనబరిచే ప్రతిభ అసామాన్యంగా ఉంటుంది. మీకు గౌరవాన్ని కీర్తిని కల్గిస్తుంది. అజీర్ణం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు.

నవంబర్- మీరు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తులవుతారు. వృత్తివ్యాపార ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఆదాయం మరియు వృద్ధి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధ సంబంధాలు సంతృప్తినిస్తాయి. వ్యతిరేకతలను జయిస్తారు.

డిసెంబర్- ప్రభుత్వం నుండి లాభాలు, తీర్థయాత్ర లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం, ఇంట్లో శుభకార్యాలు మరియు అదృష్టం కలసివస్తాయి. భార్యా భర్తలమధ్య సానుకూల ధోరణి మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

2024 జనవరి- లాభాలలో వ్యాపారాలు నడుస్తాయి వృత్తి ఉద్యోగ విషయాలు- ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇతర దేశాలలో ఉన్న మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అన్నింటా విజయం సాధిస్తారు. అనుకూలమైన సమయం.

ఫిబ్రవరి- భూమి లేక గృహం స్థిరాస్తులను పొందుతారు. వ్యవహార జయం. మీరు సాధించే ప్రతీ పనిలోనూ మీ స్నేహితుల ప్రమేయం ఉంటుంది, వారి నైతిక బలాన్ని మీరు కూడగట్టుకుంటారు. మీ సాంఘిక జీవితం మెరుగవుతుంది.

మార్చ్- ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. అపమృత్యు దోష నివారణకు మృత్యుంజయ మంత్రంతో ఈశ్వరాభిషేకం చేయించుకుంటే మంచిది. ఆయురారోగ్యాలు వృద్ధి. కుటుంబం శాంతియుతంగా ఉంటుంది. వాక్చాతుర్యం ప్రదర్శిస్తారు.

12. మీన రాశి ఫలితములు

పూర్వాభాద్ర4వపాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4పాదములు



ఆదాయం – 8 వ్యయం - 11
రాజపూజ్యం- 1అవమానం - 2

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 21వతేదీ నుండి ద్వితీయస్థానమందు రజతమూర్తిగానూ, శనైశ్చరుడు ఈ సవత్సరమంతా వ్యయ స్థానమందు రజతమూర్తి గానూ, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వతేదీ వరకు ద్వితీయ, అష్టమ స్థానములందు తామ్రమూర్తిగానూ అక్టోబర్ 31వతేదీ నుండి సంవత్సరాంతము వరకు జన్మ, సప్తమ స్థానమందు సువర్ణమూర్తులుగా సంచరింతురు. వీరు చురుకైన స్వభావము కలిగి ఇతరులను ప్రభావితము చేయు సత్తా గలవారు." విద్యా విషయాల్లో రాణించి అధికార యోగమును పొందుతారు.

ధన స్థానమందు గురుని సంచారం హృదయమందు సుఖము, యశోవృద్ధి, సౌభాగ్యము, ధార్మిక కార్యక్రమములు చేయుటయందు ఆసక్తి, ధనయోగము కుటుంబ సౌఖ్యము జీవితంలో ఉచ్ఛస్థితి, ఇతరులకు మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. గురుని ద్వితీయ స్థాన సంచారం అన్ని వృత్తులవారికి ప్రతిభను చూపి లాభదాయకమైన సంపాదనశక్తిని కలుగజేస్తుంది.

సంపద మరియు లాభాలు పెరుగుదల. మీలో దాగియున్న సృజనాత్మక శక్తికి వాగ్దాటి తోడై మీకు సమాజంలో మంచి స్థానం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తొలగి కుటుంబం విషయాలు ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం అనుకూలం. కొత్తగా వివాహం అయిన వారికి సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది.

శని వ్యయస్థాన సంచారం చేత ఏలినాటి శని దశ ప్రారంభం. శని యొక్క మూర్తిమంతముచేత కేవలము ధనము అధికముగా ఖర్చగుతుంది. అయితే ధన ఆదాయానికి లోటు ఉండదు. అయితే మీ జీవనంలో కొత్త సవాళ్ళు ఎదురవ్వవచ్చు. వ్యాపార విషయాలలో పెట్టుబడులు తగ్గించడం మంచిది. నూతన వ్యాపారాలకు సమయం కాదు. ప్రయాణాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం ద్వితీయ జన్మ స్థానాలలో రాహువు, అష్టమ, సప్తమ స్థానాలలో కేతువు అతి సామాన్య ప్రభావాలు. సంవత్సర ద్వితీయార్ధంలో సువర్ణముర్తివంతముచే ఎంతో కొంత దుష్ప్రభావాలను తగ్గించి మేలు చేస్తుంది. సామాజిక కార్యకర్తలకు పత్రికా విలేఖరులకు, రచనా వ్యాసంగాలు చేసేవారికి అనుకూలం. రొయ్యి, మత్స్య, వ్యవసాయ మరియు అన్ని రకాల వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. సంవత్సర ప్రథమార్థం సామాన్యం, ద్వితీయార్థం అనుకూలం. రైస్ మిల్లర్లకు, కాంట్రాక్టర్లకు, డీలర్లకు కిరాణా. నూనె వ్యాపారస్తులకు కలసి వచ్చే కాలము.

పూర్వాభాద్ర వారికి తెలివితేటలు సమయానుకూల ధోరణితో కార్యములను చక్కగా సాధించుకొనుట, విద్యా ఉద్యోగ విజయము, కార్యసిద్ధి ఉత్తరాభాద్ర వారికి ఇతరులకు మిత్రులకు మేలు చేయుట, ఆధ్యాత్మిక విషయములలోనూ పరిజ్ఞానము సంపాదించి ఇతరుల అవసరములకు వర్తింపజేయుట శాస్త్ర పరిపక్వతను సాధించి ఉపాధి ఏర్పరచుకుని పురోగమించుట కల్గును. రేవతి వారికి గృహమున ఆనందకరమైన వాతావరణము కల్గియుండుట గృహమున శుభకార్య సిద్ధి ధనధాన్య వృద్ధి మనఃస్థిమితము కల్గుమ.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3. 1, 2, 5, 9 తేదీల సంఖ్యలు, ఆది, సోమ, గురు వారములు కలసిన మరింత మేలు కలుగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్- జన్మరాశిలో రవి, గురులు అహంభావాన్ని ఆకస్మికంగా ఎప్పుడైనా కోపాన్ని కల్గించవచ్చు, నాలుకను అదుపులో ఉంచుకుంటే, స్నేహితులతోనూ, స్వ కుటుంబ సభ్యులతోనూ ఉద్రిక్తతలను తగ్గించవచ్చు. ఆదాయానికి లోటుండదు.

మే- సంపద, ఆస్తి మరియు శారీరక మానసిక బలాన్ని కూడగట్టుకునే సమయం. ఆస్తి, పేరు, కీర్తి వలన ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం మరియు భౌతిక సుఖాలు వస్తాయి. విలాసవంతమైన జీవనశైలి.

జూన్- ప్రమోషన్ లేదా వేతన పెంపు. వృత్తి ఉద్యోగాలలో పురోగతి, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం మరియు సంపదలో పెరుగుదల కాలం, ధైర్యయుక్తమైన ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలను అందిస్తాయి. సంతానవృద్ధి.

జూలై- విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు కనబరుస్తారు. సోమరితనాన్ని వదలి స్వయం కృషితో జ్ఞానసముపార్జన చేస్తారు. తల్లిదండ్రులకు కలసి వస్తారు. కుటుంబమున ఆనందం సంతృప్తి. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి.

ఆగస్ట్- వృత్తిలో సమస్యలను ఎదుర్కొంటారు. కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. అయినా ఇది ఆరోగ్య విషయాలలో ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ప్రత్యర్థుల వ్యాజ్యాలను సమర్ధవంతంగా తిప్పికొడతారు.

సెప్టెంబర్- అన్ని ప్రయత్నాలలోనూ వరుస విజయాలు మిమ్ములను వరిస్తాయి. వ్యాపారం పెరుగుతుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీరు అనేక మార్గాల నుండి చాలా ప్రయోజనాలను పొందుతారు. బంధుమిత్ర సమాగమము.

అక్టోబర్- ఆధ్యాత్మిక, దైవ సంబంధ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వృద్ధి. అధిక ధనాన్ని నిల్వ చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. మీ సాంఘిక ప్రవర్తన అందరికీ మార్గదర్శకమవుతుంది. ధార్మిక సంస్థలకు విరాళాలిస్తారు.

నవంబర్- గ్రహస్థితి మిశ్రమం. అష్టమ రవి, కుజ సంచారం అనేకావేశాలకు లోనవ్వచ్చు. శృంగార కళాపోషణ పెరుగుతుంది. వ్యాపార వాటాలలో పెట్టుబడులు, నూతన వ్యాపారాలకు పెట్టుబడులకు ఉపయోగం లేదు.

డిసెంబర్- అధికారం విస్తరిస్తుంది. అధికారిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ప్రజా సంబంధాలు పటిష్టపరచుకుంటారు. అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రభావం మీపై ఉంటుంది. భోగ భాగ్యాలను అనుభవిస్తారు.

2024 జనవరి- రాజకీయనాయకులకు పరీక్షా సమయం, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులు రాణిస్తారు. మీ ఇంటికి విశిష్ట అతిథులు వచ్చి మీకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు.

ఫిబ్రవరి- అధిక లాభాలను ఆర్జిస్తారు. సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. అనేక మార్గాల నుండి ఆదాయం పెరుగుతుంది. విందు వినోదాలకు శుభకార్యాలకు హాజరు అవుతారు. సామాజికంగా అందరితో కలుపుగోలుతనం కలసి వస్తుంది.

మార్చ్- జన్మ రాశిలో బుధ రాహువులు బంధనయోగాన్నిచ్చే అవకాశం ఉంది. మీరు వేసే ప్రతి అడుగు సరైనదని నిర్ధారించుకుంటే మంచిది. గృహమున శుభయోగాలు కలసి వస్తాయి. భూ, గృహ, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.

29. శ్రీ శోభకృత్ నామ సంవత్సర పండుగలు

2023 మార్చ్ - చైత్ర మాసము

22 శ్రీ శోభకృత్ ఉగాది, వసంత నవరాత్ర ప్రారంభం, మహాదర్శనమ్

23 చంద్రదర్శనమ్

24 మత్స్య జయంతి

29 పశ్చాదస్తమిత గురుమౌఢ్యారంభము సా 5.01

30 శ్రీరామ నవమి

31 ధర్మరాజ దశమి

ఏప్రిల్

1 సర్వ ఏకాదశి

2 వామన ద్వాదశి

3 అనంగపూజ

4 మహావీర జయంతి

6 విశ్వాంబరావధూత దత్తావతారం - ఆకివీడు

7 గుడ్ ఫ్రైడే

9 సంకటహర చతుర్థి

13 అనఘావ్రతం

14 ష సంక్రమణమ్ సా 5.04, అశ్విని కార్తె ప్రా।।, సౌరమాన వత్సరాది, అంబేద్కర్ జయంతి

16 సర్వ ఏకాదశి

18 మాసశివరాత్రి

వైశాఖ మాసము

21 చంద్రదర్శనమ్

22 గంగానదీ పుష్కర ప్రారంభం

23 అక్ష తృతీయ, పరశురామజయంతి

25 శ్రీ శంకర జయంతి, శ్రీ జయలక్ష్మీ మాత జయంతి, శ్రీ రామానుజ జయంతి, ప్రాగుదిత గురుమౌఢ్య త్యాగం సా. 5, 09

28 భరణికార్తె ప్రా॥ ఉ.9.12

మే

1 సర్వ ఏకాదశి

3 గంగానది పుష్కర సమాప్తి

4 నృసింహజయంతి, మాయాముక్తావధూత దత్తావతారం – అచ్చరపాకమ్, డొల్లుకర్తరి ప్రా।। రా 2.43

5 కూర్మజయంతి, మహా వైశాఖి

6 అన్నమాచార్య జయంతి

8 సంకటహర చతుర్థి

11 కృత్తికకార్తె ప్రా, నిజకర్తరి ప్రా. తె 4.11

13 అనఘావ్రతం

14 శ్రీ హనుమజ్జయంతి, కార్యసిద్ధి ఆంజనేయ విశేషపూజ, వార్షిక వేదపరీక్షా ప్రారంభం

15 వృషభసంక్రమణము ప.3.15, సర్వఏకాదశి

18 మాసశివరాత్రి

జ్యేష్ఠ మాసము

21 చంద్రదర్శనమ్, శ్రీ దత్తవేంకటేశ్వర బ్రహ్మోత్సవ ప్రారంభం

25 రోహిణికార్తె ప్రా।। రా 1.36

26 శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి జన్మదినమ్, బ్రహ్మోత్సవ సమాప్తి

29 కర్తరీత్యాగము ప 1.21

30 దశపాపహరదశమి, గంగాదశహరా వ్రతం

31 నిర్జలైకాదశి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి పాదుకా పూజ

జూన్

4 దత్తావధూత దత్తావతారం - హైదరాబాద్

7 సంకటహర చతుర్థి

8 మృగశిరకార్తె ప్రా।। రా.1.08

11 అనఘావ్రతమ్

14 మతత్రయ ఏకాదశి

16 మిథున సంక్రమణమ్ రా 1.21, మాసశివరాత్రి

17 వటసావిత్రీ వ్రతమ్

ఆషాఢ మాసము

19 చంద్రదర్శనము

20 జగన్నాథ రథయాత్ర

22 ఆర్ర్దకార్తె ప్రా।। 2.05

23 విశాలాక్షీ అమ్మవారి ఆషాఢ శుక్రవార పూజ ప్రా।।, స్కంద పంచమి

25 వివస్వత్సప్తమి

28 చాక్షుష మన్వంతరాది

29 తొలి ఏకాదశి, శయన ఏకాదశి

30 బక్రీద్

జూలై

1 శని త్రయోదశి

3 ఆషాఢపూర్ణిమ, గురుపూర్ణిమ, ఆదిగురు దత్తావతారం - చెన్నై, శ్రీ దత్తవిజయానందతీర్థ స్వామివారి 20వ చాతుర్మాస్య వ్రతం, వ్యాసపూజ

6 సంకష్టహర చతుర్థి, పునర్వసు కార్తె ప్రా॥ 3.48,

10 అనఘావ్రతం

13 సర్వ ఏకాదశి

15 శనిత్రయోదశి

16 మాస శివరాత్రి

17 కర్కాటక సంక్రమణమ్ సా 5.03, దక్షిణాయన ప్రారంభం, అమాసోమవార వ్రతమ్

అధిక శ్రావణ మాసము

18 అధిక శ్రావణమాసారంభమ్

19 చంద్రదర్శనమ్

20 పుష్యమి కార్తె ప్రా।। తె 5.21

29 మతత్రయ ఏకాదశి, మొహర్రం

ఆగస్ట్

3 ఆశ్రేష కార్తె ప్రా।। తె 5.38

4 సంకటహర చతుర్థి

8 పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యారంభమ్ ప 1.58

9 అనఘావ్రతమ్

12 మతత్రయ ఏకాదశి

14 మాసశివరాత్రి

15 భారత స్వాతంత్ర్య దినోత్సవం

నిజశ్రావణ మాసము

17 నిజశ్రావణమాసారంభమ్, మఘకార్తె ప్రా।।, సింహపంక్రమణమ్ తె 4.22

18 చంద్రదర్శనము ప్రాగుదిత శుక్రమౌఢ్య త్యాగం సా 7.21

19 శ్రీ దత్తవేంకటేశ్వర శ్రావణ శనివార పూజ ప్రా।।

21 సచ్చిదానందేశ్వర శ్రావణ సోమవార అభిషేక ప్రా।।, గరుడపంచమి, నాగపంచమి

24 సంస్కారహీన శివరూప దత్తావతారమ్ – జయలక్ష్మీపురం, నరహరితీర్థస్వామివారి ఆరాధన

25 వరలక్ష్మీ వ్రతం

27 సర్వఏకాదశి

29 ఋగ్వేద ఉపాకర్మ, ఓణం పండుగ

30 రక్షాబంధనమ్, రాఖీపూర్ణిమ

31 తైత్తిరీయోపాకర్మ, పుబ్బ కార్తె ప్రా. రా.12.47, విఖనస జయంతి, హయగ్రీవ జయంతి

సెప్టెంబర్

1 శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన

3 సంకష్టహర చతుర్థి

5 ఉపాధ్యాయుల దినోత్సవమ్

6 శ్రీకృష్ణాష్టమి

7 అనఘావ్రతమ్

10 సర్వ ఏకాదశి

13 మాస శివరాత్రి.

14 పోలాల అమావాస్య, ఉత్తరఫల్గుని కార్తె ప్రా।। సా.6.42

భాద్రపద మాసము

16 చంద్రదర్శనము

17 సామవేద ఉపాకర్మ, కన్యాసంక్రమణమ్ తె 4.48, బలరామజయంతి, వరాహజయంతి

18 స్వర్ణగౌరీ వ్రతమ్, వినాయక చవితి, శ్రీపాదవల్లభ జయంతి, క్షిప్రగణపతి విశేష పూజలు - విజయవాడ

19 ఋషి పంచమి

23 కేదార వ్రతము

25 విష్ణు పరివర్తనైకాదశి

26 వామనజయంతి

27 హస్తకార్తె ప్రా।। ఉ.9.47

28 అనంతపద్మనాభ వ్రతం, దేవదేవ దత్తావతారం – నూజివీడు

29 చాతుర్మాస్య వ్రతసమాప్తి, ఉమామహేశ్వర వ్రతం

30 మహాలయపక్ష ప్రారంభం

అక్టోబర్

1 ఉండ్రాళ్ళతద్దె, అశూన్యశయన వ్రతం

2 సంకష్టహర చతుర్థి, మహాభరణి, గాంధీ జయంతి

5 వ్యతీపాన్మహాలయము

7 అనఘావ్రతమ్

10 మతత్రయ ఏకాదశి

11 చిత్రకార్తె ప్రా।। రా.10.04, యతిమహాలయం

13 మాస శివరాత్రి

14 మహాలయ అమావాస్య, కుశగ్రహణమ్

ఆశ్వయుజ మాసము

15 శరన్నవరాత్ర ప్రారంభం

16 చంద్రదర్శనము

17 విశాఖకార్తె ప్రా. ఉ 8.43

18 తులా సంక్రమణమ్ ప 3.08, కావేరీ స్నానమ్

20 సరస్వతీపూజ

22 దుర్గాష్టమి

23 మహానవమి, విజయదశమి, శమీపూజా

25 స్వాతికార్తె ప్రా।। ఉ7.45, మతత్రయ ఏకాదశి

28 పాక్షిక చంద్రగ్రహణమ్, వాల్మీకి జయంతి, దిగంబర దత్తావతారం - హృషీకేశ్

31 అట్లతద్దె

నవంబర్

1 సంకష్టహర చతుర్థి

5 అనఘావ్రతమ్

7 విశాఖ కార్తె ప్రా।। ఉ 8.43

9 మతత్రయ ఏకాదశి

10 ధన్వంతరి జయంతి

11 మాస శివరాత్రి

12 నరకచతుర్దశి, దీపావళి అమావాస్య, ధనలక్ష్మీపూజ

13 కేదారగౌరీ వ్రతమ్, అమాసోమవార వ్రతమ్

కార్తిక మాసము

14 కార్తికమాసారంభమ్, బాలల దినోత్సవమ్

15 చంద్రదర్శనమ్, యమద్వితీయ, భగినీ హస్తభోజనమ్

17 నాగులచవితి, వృశ్చిక సంక్రమణ ప।। 12.38

20 కార్తిక సోమవార అభిషేక ప్రా।।, అనూరాధ కార్తె ప్రా।। రా.12.56

22 యాజ్ఞవల్క్య జయంతి

23 ఉత్థాన ఏకాదశి, ప్రబోధనైకాదశి

24 క్షీరాబ్ధి ద్వాదశి, శ్యామకమల లోచన దత్తావతారం - విజయవాడ

26 కార్తిక పూర్ణిమ, జ్వాలాతోరణమ్

27 దత్తయోగిరాజ అవతారం – బెంగళూర్, గురునానక్ జన్మదినమ్

28 అత్రివరద దత్తావతారం- మచిలీపట్నం

29 దిగంబరావధూత దత్తావతారం - గండిగుంట

30 సంకష్టహర చతుర్థి

డిసెంబర్

3 కార్తె ప్రా।। రా 10.48

5 అనఘావ్రతమ్

8 సర్వఏకాదశి

11 మాసశివరాత్రి

మార్గశిర మాసము

14 యోగిరాజ వల్లభ దత్తావతారం – ప్రొద్దుటూరు, చంద్రదర్శనమ్

16 ధనుస్సంక్రమణమ్ రా 12. 34, మూల కార్తె ప్రా।। రా 12.34

17 ధనుర్మాసారంభమ్

18 సుబ్రహ్మణ్య షష్ఠి, మైసూరు మరకత సుబ్రహ్మణ్య కావడి ఉత్సవమ్

23 వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీ దత్తవేంకటేశ్వర ఉత్తర ద్వార దర్శనమ్, గీతా జయంతి

24 హనుమద్ర్వతం, దత్తజయంతి ఉత్సవ ప్రా, మండపోత్సవ, పంచామృత అభిషేకమ్

25 రథోత్సవమ్, క్షీరాభిషేకమ్, క్రిస్మస్

26 దత్తజయంతి, కాలాగ్నిశమన దత్తావతారం - మైసూర్, తెప్పోత్సవం

30 సంకష్టహర చతుర్థి

2024 జనవరి

1 ఆంగ్ల వత్సరాది

4 ప్రధాన అనఘాష్టమీవ్రతమ్

7 సర్వ ఏకాదశి

10 మాస శివరాత్రి

పుష్య మాసము

13 చంద్రోదయము

14 భోగి

15 మకరసంక్రమణమ్ ఉ 8.25, ఉత్తరాయణ పుణ్యకాలః ప్రా।।, మకరసంక్రాంతి

16 కనుమ పండుగ

21 సర్వ ఏకాదశి

25 లీలావిశ్వాంబరావధూత దత్తావతారం - సూరత్

26 రిపబ్లిక్ డే

29 సంకష్టహర చతుర్థి

31 త్యాగరాజ ఆరాధన

ఫిబ్రవరి

1 త్రిస్రోష్టకాలు

3 అనఘావ్రతమ్

6 మతత్రయ ఏకాదశి

8 మాస శివరాత్రి

9 మౌని అమావాస్య

11 చంద్రోదయమ్

13 కుంభసంక్రమణమ్ రా 7.15

14 మదన పంచమి, శ్రీపంచమి, మరకత రాజరాజేశ్వరీ వార్షికపూజ - విజయవాడ

16 వైవస్వత మన్వాది, రథసప్తమి, సూరప్ప పౌండరీకయాజి ఆరాధన, భీష్మాష్టమి

18 మాధ్వనవమి

19 శ్రీపాదవల్లభ అనఘాదత్తక్షేత్ర బ్రహ్మోత్సవం - పిఠాపురం

20 భీష్మైకాదశి

24 మహామాఘి, సిద్ధరాజ దత్తావతారం - కొచ్చిన్

27 సంకష్టహర చతుర్థి

మార్చ్

2 తిస్రోష్టకాలు

3 అనఘావ్రతమ్

6 సర్వ ఏకాదశి

8 మహాశివరాత్రి, సచ్చిదానందేశ్వర విశేష పూజలు

11 చంద్రోదయమ్

14 మీన సంక్రమణమ్ ప 2.50

19 జ్ఞానసాగరదత్తావతారం - అనంతపురం

20 సర్వ ఏకాదశి

21 1946 శాలిశక వత్సరాది

23 కామదహనం

25 శ్రీ లక్ష్మీ జయంతి, హోలీ, కామదహన పూర్ణిమ

28 సంకష్టహర చతుర్థి

ఏప్రిల్

1 తిస్రోష్టకాలు

2 అనఘావ్రతమ్

5 సర్వ ఏకాదశి

7 మాసశివరాత్రి

9 క్రోధినామ సంవత్సర యుగాది

© Copyright SGS PANCHANGAM. All Rights Reserved