మకర సంక్రమణ - పురుష లక్షణమ్

శ్రీ మన్మథ నామ సం।।ర పుష్య శుద్ధ షష్ఠీ శుక్రవారం అనగా 15- 1- 2016 ఉదయం గం।। 6.46 ని।।లకు ఉత్తరాభాద్రా నక్షత్రము, పరిఘ యోగం - కౌలవ కరణం మకర లగ్నము, రవి మకరరాశి యందు ప్రవేశించి సంచరించును.

ధ్వాంక్షనామధేయం - వైశ్యులకు సామాన్యము, చందనోదక స్నానం - సుభిక్షత, యవనాళాక్షతాధారణ - అలచందలకు హాని, పసుపువస్ర్త ధారణ - యుద్ధజనకము, కుంకుమ గంధలేపనం - స్త్రీ నాశనం, పగడపుష్ప ధారణ - ఆకలిభయం, రజతాభరణ ధారణ - ధరలు పెరుగుట, పక్వాన్న భక్షణ - ప్రజానాశనం, చూతఫల భక్షణ - నటులకు నాశనం, రాగిపాత్రలో భోజనం - లోహనాశనం, ధనుస్సు ధరించుటచే – క్షత్రియ నాశనం, పసుపుపచ్చని ఛత్రధారణ – శుభం, సితపద్మధారణ – శుభం, వరాహవాహనం (పంది) – రాజపీడ, ఊర్ధ్వస్థితావస్థ - దుర్భిక్షము మరియు రోగములు, లజ్జాచేష్ట – ప్రజాసౌఖ్యం, ఉత్తరదిగ్యానం – తద్దేశారిష్టం, శుక్లపక్షం – ప్రజలకు పీడ, రాజులకు యుద్ధం, తిథి – శుద్ధ షష్ఠీ – భయం, శుక్రవారం – సరసమైన ధరలు.

ఉత్తరాభాద్ర – క్షామం, మకరలగ్నం - రాజులకు యుద్ధం, కాలం ఉదయం– రాజులకు పీడ.

ఫలశ్రుతి -

·         సంక్రాంతి పురుషోత్పత్తికాలే దానం స్వశక్తి తః

ఫలాని కాంస్యాది దానాని దీయంతే దోషనాశనమ్।।

·         ఫలానిన మూలాన్యజినం సువర్ణం గ్రమాంశుకాద్యం సతిలేక్షుగావః

ధాన్యం ఖరాంశోర్మకర ప్రవేశ యాతాని - దానాని విశేషితాని।।

·         తేజసే రూప సామర్ధ్యః సార్వభౌమః ప్రజాయతే

యశ్శృణోతి మధు శుక్ల పక్షకే వర్షనాథ సచివాధికం ఫలం

                            ప్రాప్నుయాద్దురితముక్త విగ్రహ శ్చాయురర్ధ మతులం యశస్సుఖమ్।।